బ్రేకింగ్ న్యూస్ .. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దారుణం
బ్రేకింగ్ న్యూస్ .. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దారుణం
చోటుచేసుకుంది రోజువారి కూలీగా బాలాజీ దాల్ (పొప్పుల ఫ్యాక్టరీ)మిల్లు నందు పనిచేయుచున్న తలారి నగ్నమా 30సం. W/o తలారి రఘు. రోజు ఐదు గంటల సమయంలో ఫ్యాక్టరీ నుండి కూలి పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండేది కానీ ఈరోజు సాయంత్రం 6 గంటలు సమయం గడిచిన ఇంటికి రాకపోవడంతో భర్త అనుమానం వచ్చి ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి మా భార్య ఇంటికి రాలేదని యాజమాన్యాన్ని అడిగితే యాజమాన్యం మీ భార్య ఇంతకు మునిపే ఇంటికి వెళ్లిందని చెప్పడంతో అనుమానం వచ్చి ఇక్కడే ఉన్న సిబ్బందిని అడగగా సిబ్బంది కొద్దిమంది మీ భార్య చనిపోయినదని విషయము తెలపడంతో విషయం తెలుసుకున్న భర్తతో పాటు వాళ్ళ బంధువులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి వచ్చి గొడవ చేసి గేట్ ని తోచుకుంటూ లోపలికి వెళ్లి చూడగా అమ్మాయి చనిపోయిందని నిర్ధారించారు అయితే ఏది ఏమైనా కూడా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోలేదనేసి యాజమాన్యం పైన మాకు అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మృతురాలకు ఇద్దరు చిన్న ఆడపిల్లలు కూడా ఉన్నారు యాజమాన్యం దొడ్డిదారిన పారిపోయారని ఆమె భర్త తెలిపారు అంతేకాదు ఇక్కడ ఇల్లీగల్గా 5 ఫ్యాక్టరీలు నడుపుతున్నారని స్థానికులు తెలియజేశారు ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ నేమ్ బోర్డులు కూడా లేవు కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదని కానీ సెక్యూరిటీ కెమెరాలు అయితే ప్రతి చోటా అమర్చారని వారు ఆపోయారు సంఘటన స్థలానికి బుక్కరాయసముద్రం పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు
Oct 29 2023, 06:58