గోరంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు
గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకుంటే నీకు నడిరోడ్డు లో అవమానించే రోజులు దగ్గర లో ఉన్నాయి..రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం హెచ్ సోదనపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు పంపిణి మరియు గ్రామo లో నిరసన ర్యాలీ ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ అలనాటి నియంతలను తలదన్నే విధంగా ప్రతిపక్షాలను, ప్రజలను పీడిస్తున్న సైకో జగన్ సాధారణంగా ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటేనే అతని దగ్గరికి వెళ్ళడానికి అందరు బయపడతారని, అలాంటిది ఒక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సైకో జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోడానికి రాష్ట్ర ప్రజలు అందరు ముందుకు రావాలన్నారు. తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో జైలుకు పంపిన సైకో జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.చంద్రబాబు నాయుడికి జైల్లో భద్రత కరువైందన్నారు. గోరంట్ల మాదవ్ కి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వడు అని తెలిసి ఎలాగోలా ఎంపీ టికెట్ తెచ్చుకోవాలని అలా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇలాగే మాట్లాడితే నడిరోడ్డు లో అవమానించే రోజులు దగ్గర లో ఉన్నాయి.తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, అభిమానులు చంద్రబాబు గారి కోసం చేస్తున్న పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అందరి ఆశీస్సులతో అతి త్వరలో కడిగిన ముత్యంలా చంద్రబాబు గారు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నెలరోజులుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లు సాగిస్తున్న నిరసనోద్యమాలు చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏమిటో నిరూపిస్తున్నాయన్నారు. తెలుగుగడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవాలన్నారు. తెలుగుదేశం పాలనను తీసుకు రావడానికి ప్రజలు కలిసి కట్టుగా శ్రమించాలని కోరారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు,బూత్ ఇంచార్జ్ లు,మండల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,హెచ్ సోదనపల్లి, మంగపట్నం గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Oct 28 2023, 07:14