విద్యార్థులకు లైంగిక వేధింపుల నుండి మహిళలు, పిల్లల రక్షణ-సమాజ పాత్ర.. పలు కార్యక్రమాలకు హాజరైన 14వ పటాలము కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు IPS
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్బంగా పలు రకాల కార్యక్రమాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్బంగా ఈ రోజు అనగా 26.10.2023 తేదీ అప్పర్ ప్రైమరీ స్కూల్ జంతలూరు మరియు జడ్. పి. హై స్కూల్ రోటరీ పురము విద్యార్థులకు బెటాలియన్ ఆవరణం లో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిధి గౌరవనీయులైన కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారు హాజరైనారు, ఈ కార్యక్రమంలో భాగముగా కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్., గారు అన్నీ రకములైన ఆయుధములను చూపిస్తూ వాటి పనితీరు గురించి మరియు ఊపయోగించు విధానమును గురుంచి చక్కగా విద్యర్థాలకు వివరించడమైనది.
ఈ రోజు అనగ 27.10.2023 తేదీన బెటాలియన్ నందు సోషల్ మీడియా దుర్వినియెగము మరియు సైబర్ మోసలను అరికట్టడములో సాంకేతికత పాత్ర అనే అంశము పై పోలీస్ సిబ్బందికి వ్యాస రచన పోటీలను పెట్టడము జరిగినది. సిబ్బంది అందరూ ఎంతో ఆసక్తితో ఏ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచినవారికి బహుమతులను బాహుకరించాడమైంది.
అలాగే SRIT ఇంజనీరింగ్ కళాశాల యందు చర్చాగోష్టి పోటీలను లైంగిక వేధింపుల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణ-సమాజ పాత్ర అనే అంశము పై నిర్వహించడము జరిగింది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిధి గౌరవనీయులైన 14 వ పటాలము కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారు హాజరైనారు, కళాశాల విద్యార్థులతో కూలంకుశంగా చర్చించడము జరిగింది.
అలాగే రోటరీ పురము గ్రామము లోని జడ్. పి. హై స్కూల్ విద్యార్థులకు లైంగిక వేధింపుల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణ-సమాజ పాత్ర అనే అంశము పై వ్యాస రచన పోటీలను నిర్వహించడము జరిగింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహముతో ఈ పోటీలలో పాల్గొన్నారు.
అలాగే బుక్కరాయసముద్రము నందు కమాండెంట్ శ్రీ ఆర్.గంగాధర రావు, ఐ.పి.యస్ గారి ఆధ్వర్యములో బెటాలియన్ బ్యాండ్ షో నిర్వహించడము జరిగింది.
పై కార్యమలలో డి. నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్ గారు, ఆర్.ఐ. లు శ్రీ బి. రాము శ్రీ యస్. నాగేంద్ర గారు మరియు శ్రీ. బి.లొకేశ్వర నాయుడు, శ్రీ జి. సీతారామ రావు గారు, ఆర్.యస్.ఐ. లు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.
Oct 28 2023, 07:01