సంద్రోహంలో గల్లంతైన బస్సు యాత్ర.. దిగ్విజయంగా సాగిన బస్సు యాత్ర.. భారీ జన సంద్రోహంతో నిండిపోయిన బహిరంగ సభ..
దిగ్విజయంగా సాగిన బస్సు యాత్ర
భారీ జన సంద్రోహంతో నిండిపోయిన బహిరంగ సభ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్నతోనే సామాజిక న్యాయం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
40 ఏళ్ల చరిత్రని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేయలేని పనిని, ముఖ్యమంత్రి జగనన్న శింగనమల చెరువుని లోకలైజేషన్ చేసి రైతులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ఘనత ఆయనదే అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
సింగనమల మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభించి,భారి ర్యాలితో బుక్కరాయసముద్రం చేరుకున్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ నందిగం సురేష్, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ యస్.మంగమ్మ, పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ... సామాజిక సాధికార బస్సుయాత్ర మొదటగా శింగనమల నియోజకవర్గం నుంచి ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చెరువునీ సీఎం జగనన్న సహకారంతో నీళ్లతో నింపగలిగామన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఒక చెరువుకైనా నీళ్లు నింపారా అని ప్రశ్నించారు. పేదలు రైతులు అభివృద్ధి చెందాలంటే ఒక్క జగనన్నతోనే సాధ్యమన్నారు.
జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత శింగనమల చెరువుకు నీరు నింపడంతోపాటు, చెరువును లోకలైజేషన్ చేసి శింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా 40 చెరువులకు నీరు అందించిన ఘనత జగనన్నదే అన్నారు. వీటి ద్వారా రైతులతోపాటు, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు మంచి జరిగిందన్నారు.
జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల్లో 76% ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి చేకూరిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్ హోదా పదవులు ఇవ్వడం జరిగిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక జగనన్నతోనే సాధ్యమన్నారు. జరగబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.
సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేసిన శింగనమల నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, అనంతపురం నగర పాలక సంస్థ మేయర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Oct 27 2023, 07:23