నేడు సింగణమల నియోజకవర్గం నుంచి ప్రారంభం కానున్న సామాజిక సాధికారిక బస్సు యాత్రకు పెద్ద ఎత్తున తరలిరండీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
◆సామాజిక సాధికారిక బస్సు యాత్రను విజయవంతం చేసుకుందాం.
◆ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగనన్న ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు.
◆వైయస్సార్సీపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
నేడు సింగణమల నియోజకవర్గం నుంచి ప్రారంభం కానున్న "సామాజిక సాధికారిక బస్సు యాత్రకు" వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే పద్మావతి పిలుపునిచ్చారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ లో జరగనున్న బస్సు యాత్ర సభా స్థలాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు.
నాలుగున్నరేళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన అభివృద్ధి, సంక్షేమాలపై ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం,కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుండి ప్రారంభం కానుందన్నారు.
ఈ బస్సు యాత్ర శింగనమల నుండి ప్రారంభమై బుక్కరాయసముద్రం చేరుకొని డా.బి. ఆర్. అంబేద్కర్ సర్కిల్ దగ్గర సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. వైసీపీ అధిష్టానం మేరకు జరిగే బహిరంగ సభకు డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ నందిగం సురేష్, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు అవుతారన్నారు.
ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు గత టిడిపిలో పాలనలో నారా చంద్రబాబు నాయుడు పనితీరును, వైఎస్ఆర్సీపీ వచ్చిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజలకు వివరించనున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Oct 26 2023, 08:01