పేద ప్రజలకు రక్ష..జగనన్న ఆరోగ్య సురక్ష : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
పేద ప్రజలకు రక్ష..జగనన్న ఆరోగ్య సురక్ష : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
![]()
◆పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ బోయగిరి గిరిజమ్మ
పేద ప్రజలకు ఉపయోగపడే మహోత్తరమైన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.
కంటి పరీక్షల నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను తిలకించారు. వైద్యం కోసం వచ్చిన అవ్వా తాతలతో ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి అవసరమైన మందులు అందజేయాలని వైద్యులకు సూచించారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ పథకం,108,104, సేవలు ప్రవేశపెట్టారని అదే దృష్టితో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండడుగులు ముందుకేసి పేదవాడి ఆరోగ్యం కోసం తపనపడుతున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.
గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం
కల్లుమడి గ్రామంలో నూతన గ్రామ సచివ
Oct 25 2023, 16:58