చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి సైకో జగన్ పైశాచికానందం పొందుతున్నాడు ...రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అఆలం నరసానాయుడు
చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి సైకో జగన్ పైశాచికానందం పొందుతున్నాడు ...రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం గడ్డంనాగేపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందజేశారు.గ్రామo లో ర్యాలీ నిర్వహించి ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ ఏనాడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనని వారందరూ మేము సైతం చంద్రబాబు గారికి బాసటగా నిలుస్తున్నారన్నారు.ఈ సైకో జగన్ రెడ్డి దుష్టపాలనను అంతమొందించాలని, చంద్రబాబు గారి చల్లని పాలన తిరిగి రాష్ట్రానికి అవసరమని అందరూ భావిస్తున్నారన్నారు. విషకౌగిలి నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని అన్యాయంగా, జైల్లో పెట్టించి, తద్వారా జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత అక్రమ అరెస్టుపై సైకో జగన్ ఎందుకు సహేతుక కారణాలు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబు గారిని జైల్లో పెట్టించారన్నారు. ప్రజల్లో వస్తోన్న ఆదరణను ఓర్వలేక, బాబు ష్యురిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి అడ్డుకట్ట వేయాలనే దురుద్దేశంతోనే రాత్రికి రాత్రి చంద్రబాబు గారిని అరెస్టు చేశారన్నారు.
నైపుణ్యాభివృద్ది సంస్థ కేసులో అవినీతి జరగలేదని ఇప్పటికే స్వయంగా సిమెన్స్ సంస్థ తేల్చిచెప్పిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయం దక్కుతుందని గట్టిగా విశ్వశిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,బూత్ ఇంచార్జ్ లు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,గడ్డంనాగేపల్లి,కర్ణాపొడికి గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Oct 25 2023, 15:59