దేశం చేస్తుంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం.. కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
.జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ కు నిరసనగా శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు 5నిమిషాల పాటు నిర్వహించిన " దేశం చేస్తుంది రావణ దహనం మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో సైకో పోవాలి అని రాసిన పత్రాలను అగ్ని లో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకటనరసానాయుడు గారు* పాల్గొన్నారు. ఈ సందర్బంగా *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు నాయుడు గారి ని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన ఉండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి ని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిట్టు రంగారెడ్డి, ఎర్రినాగప్ప,pl లక్ష్మి నారాయణ, తలారి కుళ్లాయప్ప, పప్పూరు సత్తి, గుత్తానాయుడు,కమలాకర్, రవి, నరసన్న, తిరుపతయ్య,ధనుంజయ,వెంకటరాముడు,సుధ,శివారెడ్డి, నాగభూషణ,నాగేంద్ర, హనుమంత్ రెడ్డి,మారుతీ, విజయ్,రామాంజి బొoదలవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మండల కో ఆప్షన్ నెంబర్ బెల్గాం రషీద్ పీరా
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వైఎస్ఆర్సిపి కోఆప్షన్ నెంబర్ బెల్గామ్ రషీద్ పీరా సింగనమల నియోజకవర్గం ప్రజలకు బుక్కరాయసముద్రం మండల ప్రజలకు వైసీపీ కుటుంబ సభ్యులకు రైతులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అధికారులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు
చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి సైకో జగన్ పైశాచికానందం పొందుతున్నాడు ...రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అఆలం నరసానాయుడు

చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి సైకో జగన్ పైశాచికానందం పొందుతున్నాడు ...రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం గడ్డంనాగేపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందజేశారు.గ్రామo లో ర్యాలీ నిర్వహించి ప్రజావేదిక-రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ ఏనాడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనని వారందరూ మేము సైతం చంద్రబాబు గారికి బాసటగా నిలుస్తున్నారన్నారు.ఈ సైకో జగన్ రెడ్డి దుష్టపాలనను అంతమొందించాలని, చంద్రబాబు గారి చల్లని పాలన తిరిగి రాష్ట్రానికి అవసరమని అందరూ భావిస్తున్నారన్నారు. విషకౌగిలి నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని అన్యాయంగా, జైల్లో పెట్టించి, తద్వారా జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత అక్రమ అరెస్టుపై సైకో జగన్ ఎందుకు సహేతుక కారణాలు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబు గారిని జైల్లో పెట్టించారన్నారు. ప్రజల్లో వస్తోన్న ఆదరణను ఓర్వలేక, బాబు ష్యురిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి అడ్డుకట్ట వేయాలనే దురుద్దేశంతోనే రాత్రికి రాత్రి చంద్రబాబు గారిని అరెస్టు చేశారన్నారు.

నైపుణ్యాభివృద్ది సంస్థ కేసులో అవినీతి జరగలేదని ఇప్పటికే స్వయంగా సిమెన్స్ సంస్థ తేల్చిచెప్పిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయం దక్కుతుందని గట్టిగా విశ్వశిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,బూత్ ఇంచార్జ్ లు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,గడ్డంనాగేపల్లి,కర్ణాపొడికి గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని శ్రీ కొల్లాపూరమ్మ స్వామి వారికీ101 టెంకాయలు కొట్టిన Ex.ZPTC రామలింగారెడ్డి
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో* దసరా శరన్నవరాత్రులు మహోత్సవం సందర్బంగా 8వ రోజు శ్రీ కొల్లాపూరమ్మ స్వామి వారికీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డీలర్ శివయ్య, కిష్టయ్య, నారాయణ స్వామి, నాగేంద్ర, కాటమయ్య, చెన్నమయ్య, లింగమయ్య,మహేష్, నరసింహులు,చిన్నారాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నా మట్టి నా దేశం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించాలి..
నా మట్టి నా దేశం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించాలి* నెహ్రూ యువ కేంద్రం అనంతపురం మరియు పంచాయత్ రాజ్ మరియు రెవెన్యూ ఆఫీస్ బుక్కరాయసముద్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వెలుగు ఆఫీస్ లోని మీటింగ్ హాల్ నందు మేరీ మట్టి మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం.పి.డి.ఓ కె.తేజోష్ణ గారు, మండల రెవెన్యూ అధికారి రమాదేవి గారు మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత బిసాతి భరత్ గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసాటి జీవన్ కుమార్, నెహ్రూ యువ కేంద్రం ప్రోగ్రాం ఇంచార్జ్ జి. శ్రీనివాసులు గారు వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కే . మద్దిలేటి గారు. మరియు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విష్ణు ప్రియ గారు అనంతపురం అర్బన్ బ్యాంక్ డైరక్టర్ సుంకర రమేష్ గారు నాగరాజు గుప్త గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రవేశ పెట్టిన మేరీ మట్టి మేరా దేశ్ కార్యక్రమం ద్వారా మట్టికి నమస్కారం వీరులకు వందనం పేరుతో గత మూడు నెలలుగా నా మట్టి నా భూమి అనే కార్యక్రమం ద్వారా ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించి దేశ భక్తిని పెంచడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు వంటి ఐదు సూత్రాలను పాటించి భారత దేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలపడంలో అలాగే కృషి చేయాలని పేర్కొన్నారు. అలాగే అమృత్ కళాష్ యాత్ర లో భాగంగా ర్యాలిని నిర్వహించి మట్టి మరియు బియ్యాన్ని సేకరించారు. ఈ సేకరించిన కలశ్ లను ఈ నెల ఆఖర్లో ఢిల్లీ లోని కర్తవ్య పత్ వద్ద నిర్వహించే అమృత్ యాత్రలో మన జిల్లా నుంచి దాదాపు 150 మంది యువత పాల్గొంటారు అని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మరియు మెడల్స్ ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి పథం యూత్ అసోసియేషన్ అధ్యక్షలు కే. జయమారుతి, కార్యదర్శి వై. పవన్ సభ్యులు తుకారాం నాయక్, శ్రీకాంత్, సంతోష్ నాయక్, భరత్ సాయి , గణేష్ మరియు ఆఫీస్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం మండలం, జంతలూరు గ్రామము, 14th Bn APSP నందు పోలీస్ అమరవీరుల దినోత్సవము..

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము తేది: 21.10.2023 ప్రదేశము: 14th వ పటాలము, అనంతపురము. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము సందర్భంగా 21.10.2023 తేదీన బుక్కరాయసముద్రం మండలం, జంతలూరు గ్రామము, 14th Bn APSP నందు పోలీస్ అమరవీరుల దినోత్సవముకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కె. చిన్నారావు, సూపరిండెంట్ ఆఫ్ జైలర్, ఓపెన్ ఎయిర్ జైల్ గారిని శ్రీ డి. నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్ గారు పుష్పగుచ్చము ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. శ్రీ కె. చిన్నారావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి గౌరవ సూచికంగా పోలీసు వందనము స్వీకరించి అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కె. చిన్న రావు గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నక్సలిజం టెర్రరిజం ఫ్యాక్షనిజం మాఫియా పలు ఆర్థిక నేరగాళ్లను ఎదుర్కోవడంలో అసువులు బాసిన పోలీస్ సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 14వ బెటాలియన్ ఏపీఎస్పీ నందు పని చేస్తూ అసువులు బాసిన శ్రీ యన్. ఉదయ్ భాస్కర్, పీ,సి-760, వారి కుటుంబము మరియు బి. నారాయణస్వామి, పి. సి. 960 కుంటుంబము రావడం జరిగినిది. ఇరువురు కుటుంబాల యెక్క బాగోగులును శ్రీ డి.నాగేశ్వరప్ప అడిషనల్ కమాండెంట్ అడిగి తెసుకోవడము జరిగినది. తదనంతరం అమరవీరుల స్థూపానికి బెటాలియన్ అధికారులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కె. చిన్నా రావు, సూపరిండెంట్ ఆఫ్ జైలర్ గారు, శ్రీ డి నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్, డి.వి రమణమూర్తి, అసిస్టెంట్ కమాండెంట్, విల్సన్ కేర్ అసిస్టెంట్ కమాండెంట్ గారు. ఆర్.ఐ లు నాగేంద్ర, లోకేశ్వర నాయుడు, సీతారామ రావు గారు, ఆర్ యస్ ఐ లు, ఏ ఆర్ యస్ ఐ లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గోన్నారు.

ఉండవల్లి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం కి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆక్రమ అరెస్టు తర్వాత తొలిసారి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో* టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం కి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు..
ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్న.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర వివరాలగురించి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రోజుకి ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నారు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు పూర్తి అయినాయి ఎన్ని నియోజకవర్గాలు పూర్తి అయినాయని ఎమ్మెస్ రాజు గారిని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది
ఉండవల్లి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోజరుగుతున్న సర్వసభ్య సమావేశానికి హాజరైన ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆక్రమ అరెస్టు తర్వాత తొలిసారి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉండవల్లి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి హాజరైన ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు గారు, రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులుతదితరులు..
దసరా శరన్నవరాత్రులు 7వరోజు శ్రీ పెద్దమ్మ స్వామి వారిని దర్శించుకొన్న జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు రామలింగారెడ్డి, పర్వాతనేని శ్రీధర్ బాబు
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దసరా శరన్నవరాత్రులు 7వ రోజు సందర్భంగా శ్రీ పెద్దమ్మ స్వామి వారిని దర్శించుకొని పూజ కార్యక్రమంలో పాల్గొన్నా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.