బుక్కరాయసముద్రం మండలం, జంతలూరు గ్రామము, 14th Bn APSP నందు పోలీస్ అమరవీరుల దినోత్సవము..
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము తేది: 21.10.2023 ప్రదేశము: 14th వ పటాలము, అనంతపురము. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము సందర్భంగా 21.10.2023 తేదీన బుక్కరాయసముద్రం మండలం, జంతలూరు గ్రామము, 14th Bn APSP నందు పోలీస్ అమరవీరుల దినోత్సవముకు
ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కె. చిన్నారావు, సూపరిండెంట్ ఆఫ్ జైలర్, ఓపెన్ ఎయిర్ జైల్ గారిని శ్రీ డి. నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్ గారు పుష్పగుచ్చము ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. శ్రీ కె. చిన్నారావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి గౌరవ సూచికంగా పోలీసు వందనము స్వీకరించి అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కె. చిన్న రావు గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నక్సలిజం టెర్రరిజం ఫ్యాక్షనిజం మాఫియా పలు ఆర్థిక నేరగాళ్లను ఎదుర్కోవడంలో అసువులు బాసిన పోలీస్ సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 14వ బెటాలియన్ ఏపీఎస్పీ నందు పని చేస్తూ అసువులు బాసిన శ్రీ యన్. ఉదయ్ భాస్కర్, పీ,సి-760, వారి కుటుంబము మరియు బి. నారాయణస్వామి, పి. సి. 960 కుంటుంబము రావడం జరిగినిది. ఇరువురు కుటుంబాల యెక్క బాగోగులును శ్రీ డి.నాగేశ్వరప్ప అడిషనల్ కమాండెంట్ అడిగి తెసుకోవడము జరిగినది. తదనంతరం అమరవీరుల స్థూపానికి బెటాలియన్ అధికారులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కె. చిన్నా రావు, సూపరిండెంట్ ఆఫ్ జైలర్ గారు, శ్రీ డి నాగేశ్వరప్ప, అడిషనల్ కమాండెంట్, డి.వి రమణమూర్తి, అసిస్టెంట్ కమాండెంట్, విల్సన్ కేర్ అసిస్టెంట్ కమాండెంట్ గారు. ఆర్.ఐ లు నాగేంద్ర, లోకేశ్వర నాయుడు, సీతారామ రావు గారు, ఆర్ యస్ ఐ లు, ఏ ఆర్ యస్ ఐ లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గోన్నారు.
Oct 23 2023, 07:37