పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి:...అలం నరసానాయుడు...
నార్పల మండలం మంగపట్నం గ్రామంలో రైతు కామిరెడ్డి మిద్దె ఓబిరెడ్డి కి చెందిన వేరుసెనగ పంట వర్షాలు లేక ఎండిపోవడంతో *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* పరిశీలించారు. ఖరీఫ్ యందు వేరుశనగ, పత్తి, ఆముదం, కంది ,జొన్న, సద్ద, కొర్ర .అనేకమైన వాణిజ్య ఆహార పంటలు జూన్ నెలాఖరులో రైతులు సాగు చేశారు. కానీ సకాలంలో వర్షాలు లేక పంటలన్నీ పిందె పూత ఊడల దశ లోనే పంటలన్నీ ఎండిపోయాయి. వర్షాలు రాక పంటలు ఎండిపోవడంతో రైతులు,కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి సంవత్సరం అధిక వర్షాల వల్ల ,అకాల వర్షాల వలన, అనావృష్టి వలన నష్టపోతున్నారు. కరువుపై మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట పొలాలను రాష్ట వ్యాప్తంగా పర్యటించాలి. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారం నివేదిక తయారుచేసి నష్ట పరిహరం ఎకరాకు 30,000 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రతి పక్షాల పైన కక్ష పూరితంగా వ్యవహరించేకే సమయం అంతా సరిపోతుందె తప్ప పంట నష్ట పోయిన వారిని ఆదుకోవడంలో పూర్తిగా విపలం అయిందన్నారు. అదే విధంగా మంత్రులు కాని, ఎమ్మేల్యేలు కాని ప్రతి పక్షాల మీద ఆరోపణలు చేస్తారె తప్ప పంట నష్ట పోయిన రైతుల గురించి శాసనసభలో ప్రస్తావించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అనే ఆలోచన కూడా లేదన్నారు.రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ప్రాజెక్టులలో నీరు వృథాగా సముద్రం పాలుజేశారు. త్రాగునీటికి కూడా కష్టంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ ఇంచార్జి లు, యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,బూత్ ఇంచార్జ్ లు,సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.
Oct 21 2023, 07:06