ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి * గత పాలనలో, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల ఒరవడిని చూసి ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండలం గంగనపల్లి, ముచ్చుకుంటపల్లి, తుంపెర గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. స్థానిక ప్రజలు, అధికారులు కలసి ఘన స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నుంచి అందిన లబ్దిని వివరించారు. ఏవైనా సమస్యలున్నా, అర్హులై ఉండి ఎవ్వరికైనా పథకాలు అందకపోయినా తెలియజేయాలన్నారు, దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుపరచని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రజలకు అందిస్తుంటే ప్రతి పక్షాలు వాటిని ఓర్వ లేక ఓటమి భయంతో ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు. నేరుగా సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల ఖాతాలకే వేయడంతో అవినీతి రహితంగా పథకాల సొమ్ముని ప్రజలు పొందుతున్నారన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల నుంచి ప్రజాస్పందన అనూహ్యంగా లభిస్తుందన్నారు.
సైకో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపుదాం....రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం గొల్లపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చేశారన్నారు. కానీ ఈ సైకో జగన్ రెడ్డి పాలనలో అక్రమాలు దౌర్జన్యాలు బెదిరింపులతో పాలన సాగుతోందని అని నిజాయితీగా రాష్ట్రానికి కష్టపడిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 45 రోజులు జైల్లో నిర్బంధించారని, అక్రమ అరెస్టుపై ప్రతి ఒక్కరు సంఘీభావం తెలియజేస్తున్నారు. అని ప్రజలందరూ ఏకమై వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తారని రోజులు దగ్గర పడ్డాయి అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు,బుత్ ఇంచార్జ్ లు గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, గ్రామ నాయకులు,గొల్లపల్లి, సిద్దలచెర్ల, దుర్గం గ్రామ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు
మైదుకూరు టీడీపీ నాయకులు ఎమ్మెస్ రాజు గారి యాత్రకు సంఘీభావం
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు టీడీపీ నాయకులు ఎమ్మెస్ రాజు గారి యాత్రకు సంఘీభావం తెలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర మైదుకూరు నియోజకవర్గం మూడుమాళ్ళు గ్రామం లో
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు చేపట్టిన ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్ యాత్ర* మైదుకూరు నియోజకవర్గం మూడుమాళ్ళు గ్రామం లో ఎస్సీ కాలనీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎమ్మెస్ రాజు గారికి, రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య గారికి, ఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిమ్మయ్య గారు శాల్వాతో ఘనంగా సత్కరించి సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులుగన్నేపాటి మల్లేసు,జిల్లా Sc cell అధికారప్రతినిధి టుంకూరు రామాంజనేయులు,జిల్లా మైనారిటీ Ex సలీమ్ భాష, సుబ్బారాయుడుexmptc, దావనం శ్రీనయ్య జిల్లా sc celll కార్యదర్శి, కొండయ్య, లక్షినారాయణ రెడ్డి, పుల్లయ్య, సత్తార్,నగర sc cell రాయుడు మరియు టిడిపి కార్యకర్తలు ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
సైకో జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి : రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బొమ్మకుంటపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ సైకో జగన్ రెడ్డి చేస్తున్న కుట్రను, మోసాన్ని అన్యాయంగా ఎటువంటు అవినీతి జరగకుండానే నేరం మోపి చంద్రబాబునాయుడు గారిని జైలుకు పంపారని, అవినీతి జరిగి వుంటే ఇప్పటికే సాక్షాలు చూపేవారు అని కేవలం కక్ష సాధింపు కోసమే ఇలా అక్రమంగా కేసులు మోపుతున్నారని ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలియచేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి వైపు అడుగేసి భవిష్యత్తు మార్చుకోవాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందని ఒక్కసారి ఆలోచించాలని వ్యవస్థలు అన్ని నాశనం చేసి యువతకు ఉద్యోగాలు లేకుండా అందుకే ప్రజలు మేలుకోకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, బొమ్మకుంటపల్లి, పప్పూరు గ్రామ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు
జగనన్న పాలనలో అందరికీ సంక్షేమం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
*పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి* ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు చేరాయని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండలం మాలవాండ్లపల్లి, కమ్మ కొట్టాలు, గొల్లపల్లి, సిద్ధరాచర్ల, బోయ కొట్టాల, దుర్గం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పొందిన లబ్దిని ప్రజలకు వివరిస్తూ బుక్ లెట్లను పంపిణీ చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకొని, పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..పథకాల అమలులో జగనన్న ప్రభుత్వానికి ఎలాంటి కుల, మత, వర్గ, పార్టీలంటూ తారతమ్యాలు లేవన్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. వైసీపీ నాలుగేళ్ళ పాలనలో తమ కుటుంబానికి రూ.7 లక్షలు లబ్ది చేకూరిందని సాకే పద్మావతి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
SK యూనివర్సిటీలో ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సును కొనసాగించాలని AISF 5వ రోజు రిలే నిరాహారదీక్షలు సంఘీభావం తెలిపిన KVPS రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప

*ఎస్క్ యూనివర్సిటీలో ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సును కొనసాగించాలని AISF SFI AISA విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్క్ యూనివర్సిటీ ప్రధాన గెట్ ముందు 5వ రోజు రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరిగింది..ఈ దీక్షలో 5వ రోజు కూర్చున్న వారు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.కుల్లాయస్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ యూనివర్సిటీ అకాడమీ కన్సల్టెంట్ డాక్టర్ ప్రతాప్ గారు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మంజునాథ్ ఏఐఎస్ఎ యూనివర్సిటీ కార్యదర్శి రాజు నాయక్ తదితరులు... ఈ దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలుపుతూ మాట్లాడుతున్న కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప గారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు మాజీ విద్యార్థి నాయకులు రామిరెడ్డి తదితరులు అనంతరం కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకులు డాక్టర్ అంకన్న ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు వేమన ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉమామహేష్ విశ్వనాథ్ తదితరులు*

జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు కి చేరుకున్న ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్* *యాత్ర * జమ్మలమడుగు నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ముద్దనూరు దగ్గర ఘన స్వాగతం పలికిన జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి గారి తండ్రి మాజీ MLC నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జమ్మాపురం రమణారెడ్డి, క్రిస్టియన్ సెల్ స్టేట్ ఉపాధ్యక్షులు చదిపిరాల రమేష్ రెడ్డి, కడప పార్లమెంటు ఎస్సీ సెల్ఫ్ అధ్యక్షులు మల్లేష్, పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్యదర్శిశ్రీనివాసులు, ఎస్సీ సెల్ నాయకులు రాయుడు, మిరున్ ప్రసాద్ మరియు ముద్దనూరు ఎస్సీ సెల్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జంగంమపల్లి సర్పంచ్ కుళ్లాయప్ప, మాజీ ఎంపీటీసీ చండ్రాయుడు, నాయకులు రాఘవనాయుడు, వాసాపురం హరి,బాలనాగి నరేష్, CBN విజయ్, ఐటీడీపి షఫీ, వాసు, శీను, చిన్నా చౌదరి, నరసాపురం అశోక్, విభూది రమేష్, నవీన్, మారుతీ, హేమంత్,,శివ నాయుడు, తదితరులు
పెనకచర్ల డ్యామ్, సౌత్ కెనాల్ కు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన ద్విసభ్య కమిటీ సబ్యూలు ముంటిమడుగు కేశవరెడ్డి..

సింగణమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సబ్యూలు ముంటిమడుగు కేశవరెడ్డి ,అన్న గారి ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కలిసి పెనకచర్ల డ్యామ్, సౌత్ కెనాల్ వాటర్ వదిలే విషయమై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేయడానికి గార్లదిన్నె మండల నాయకులు రైతులు. ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. నీళ్లు వదిలే విషయం మీద కలెక్టర్ గారు వాటికీ సంబందించిన అధికారులతో మాట్లాడి, సాగు, నీరు త్రాగు. వదిలే విషయం మాట్లాడి రైతులకి తగిన న్యాయం చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది.

నల్లపరెడ్డిపల్లి గ్రామం లో బాబుతో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమంలో ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసా నాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందిచడం జరిగింది.ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసిన అరాచక పాలన సాగుతుందన్నారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన చంద్రబాబు గారిని ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా దురదృష్టకరం. నియంత సైకో జగన్ సాగిస్తున్న విధ్వంస పాలనపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మహోద్యమంగా మార్చిన చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. టిడిపి పై ఎన్ని అక్రమ కేసులు దాడులు చేసిన రాబోయే రోజుల్లో రేట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైసిపి ప్రభుత్వం ఇలాగే తమపై కేసులు దాడులు ఆపని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్, బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు నల్లపరెడ్డిపల్లి, గుంజేపల్లి గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు