జగన్ పాలన లో రాష్ట్రo రావణ కాష్టం లా మారింది..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 16 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష నల్లబెలూన్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమం లో నార్పల మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసిన అరాచక పాలన సాగుతుందన్నారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన చంద్రబాబు గారిని ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా దురదృష్టకరం. నియంత సైకో జగన్ సాగిస్తున్న విధ్వంస పాలనపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మహోద్యమంగా మార్చిన చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. టిడిపి పై ఎన్ని అక్రమ కేసులు దాడులు చేసిన రాబోయే రోజుల్లో రేట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైసిపి ప్రభుత్వం ఇలాగే తమపై కేసులు దాడులు ఆపని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఎర్రి నాగప్ప, రాఘవ నాయుడు, చంద్రబాబు,లక్ష్మి నాయుడు, లక్ష్మీనారాయణ,బొగ్గు నారాయణస్వామి,చంద్రమోహన్ రెడ్డి,Po రాజన్న, రాజన్న,వెంకట నారాయణరెడ్డి,సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణమ్మ ,తలారి కుల్లాయప్ప, మల్ రెడ్డి, వేణు, రాజ గోపాల్,శేఖర్,సత్తి, గుత్త నాయుడు, వెంకటరమణ,భార్గవ్, రామానాయుడు,గంగాధర్ నాయుడు, రమేషు,గోపాల్,భక్త వత్సల్, సత్తయ్య,శీన, ధనుంజయ,నాగభూషణ, మారుతి, నరసింహుడు,చక్రవర్తి, నాగేంద్ర,శ్రీరాములు, నల్లప్ప, కుల్లాయప్ప,నాగన్న, ప్రసాద్,నాగేష్,ఆది, రాధాకృష్ణ,హరీష్,మహేష్,గణేష్ మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో  సమకాలిన, సామాజిక అంశాలపై తన కవిత్వ పటిమతో పోరాటం చేసినమహాకవి జాషువా.. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు..
ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు, నవయుగ చక్రవర్తి గుఱ్ఱం జాషువా సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తికలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, మరియు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో కలిసిపూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాత్రగడ్డపాడులో గుఱ్ఱం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారన్నారు. చిన్నతనం నుంచి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేదని, బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడిని, ఆయన 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశాడన్నారు. రుక్మిణి కళ్యాణం, కోకిల, ధ్రువ విజయం, గబ్బిలం, ఫిరదౌసి, ఖండకావ్యాలు, తదితర అనేక రచనలు చేశాడని, కవితా విశారద, కవికోకిల, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ గా బిరుదులు పొంది ప్రసిద్ధులైనారన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో యుద్ధ ప్రచారకుడిగా పని చేశారన్నారు. తెలుగు రాష్ట్రంలో జన్మించిన అతి గొప్ప వ్యక్తుల్లో జాషువా ఒకరని, కడు పేద కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు పొందిన మహనీయుల్లో జాషువా చాలా గొప్పవాడన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డి అర్ ఓ  కొండయ్య మాట్లాడుతూ కవి కోకిల బిరుదాంకుతులైన గుర్రం జాషువా ఉపాధ్యాయునిగా, ఆచార్యునిగా, శాసనమండలి సభ్యునిగా పని చేయడంతో పాటు సాహిత్యకారునిగా సామాజిక అసమానతలు,  మూఢాచారాలు, దేశభక్తి వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని అనేక ప్రసిద్ధ రచనలు రచించడం ద్వారా తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలు అందించారని  తెలిపారు ఈ కార్యక్రమంలో సాంఘికసంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, డి ఆర్ డి పి డి నరసయ్య, పశుసంవర్ధక జెడ్ శుభ దాస్, ఐ సి డి సి పిడి, లలిత కుమారి, ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు డిఐపిఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి.
గుత్తి మండల ప్రవాస్ యోజన లో భాగంగా మండల బీజేపీ కార్యవర్గ సమావేశం..
  భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు సూచనల మేరకు మండల అధ్యక్షుడు బలకా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన లో భాగంగా మండల కార్యవర్గ సమావేశం బిజెపి మండల కార్యాలయంలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రవాస్ యోజన మండల ఇంచార్జ్ గొంది అశోక్ గారు హాజరైనారు ఈ సమావేశంలో మండల కమిటీ శక్తి కేంద్ర ప్రముఖులు బూతు కమిటీ అధ్యక్షులు లతో మాట్లాడడం జరిగినది బిజెపి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేసి పూర్తిస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలని తెలపడం జరిగినది విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలలో కి తీసుకువెళ్లాలని సూచించడమైనది ప్రధానమంత్రి జయంతి సందర్భంగా సేవా పక్షంలో కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు డిబి రంగరాజు ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జె యం మాణిక్యం ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మండల ప్రధాన కార్యదర్శి నాగేపల్లి లక్ష్మయ్య ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పూజారు ఉపులప్ప కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అప్పల రంగస్వామి రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య మండల ఉపాధ్యక్షులు వరిమడుగు లక్ష్మీనారాయణ పాటిల్ మోహన్ రెడ్డి మండల కార్యదర్శి ఎస్ రాము వడ్డే వెంకటేశ్వర్లు వేణుగోపాల్ రాజ్ జే వెంకట్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
మిలద్ ఉన్ నబీ ప్రత్యేక ప్రార్థనలతో పాల్గొన్న అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ AKS ఫయాజ్..
నేడు మిలద్ ఉన్ నబీ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, నగర మేయర్ వసీం గారితో కలిసి మసుబా బీ దర్గా లో ప్రత్యేక ప్రార్థన లో పాల్గొన్నారు అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ AKS ఫయాజ్ గారు. అనంతరం మొహమ్మద్ ప్రవక్త ప్రజలను మంచి మార్గం లో నడిపించడానికి చెప్పిన విషయాలను గుర్తు పెట్టుకోవాలి అని అన్నారు. ప్రేమానురాగాలు, శాంతిని మొహమ్మద్ ప్రవక్త బోధించారు అని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో మత పెద్దలు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు సైఫుల్ల బైగ్, కో ఆప్షన్ సభ్యులు షంశుద్దిన్, వైఎస్సార్సీపీ నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు....
గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల..
గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల గారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. వడగాల్పు నా జివీతమైతే వెన్నెల నా కవిత్వం అన్న నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా
ఎం.యస్ .స్వామినాథన్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల..
మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ (జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "హరిత విప్లవ పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.అతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.ఇవాళ ఆయన 98 వయసులో చెన్నై లో తుది శ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమరవీరుడు భగత్ సింగ్ గారి త్యాగాలు మరువలేనివి భగత్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించాలి.. NSUI జిల్లా నాయకులు మురళీకృష్ణ, మంజునాథ్.
అనంతపురం నగరంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ గారి 116వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ గారి ఫోటోకి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన NSUI జిల్లా నాయకులు j.మురళీకృష్ణ పుల్లలరేవు మంజునాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర నరాలలో దేశభక్తి అణువణువునా స్వాతంత్య్రం సాందిచాలనే కాంక్ష పట్టు విడువని పోరాట పటిమ పోరాటం అంటే ఇలానే చెయ్యాలని భావి తరాలకు చాటి చెప్పిన గోప్ప పోరాట యోధుడు భగత్ సింగ్ అని అన్నారు. భగత్ సింగ్’.. ఈ పేరు వింటే చాలు భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయే ధీరుడు భగత్ సింగ్ అని అన్నారు. 1907 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించిన ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం... బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడారని ఉరి కంబం ఎదురుగా కనిపిస్తున్నా.. వారు అధైర్య పడలేదు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని 13 ఏళ్ల వయసు నుంచే బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన అసమాన్య పోరాటయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నేటితరం విప్లవ జ్వాలకు అసలైన మార్గదర్శిగా భగత్ సింగ్ ను చూస్తున్నారంటే ఆయనలోని పోరాట పటిమ ఎంత బలమైనదో తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, మహేంద్ర, మహేష్, బాబు, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కు నిరసనగా పెరవలి లో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ..

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగాసింగనమల మండలం పెరవలి గ్రామపంచాయతీలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు నియోజకవర్గ ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఆదేశానుసారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి సీనియర్ తెలుగుదేశం నాయకులు గోరంట్ల మారుతి నాయుడు ఆధ్వర్యంలో పెరవలి గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు ని అక్రమ అరెస్టు చేసి ఈరోజు 20 రోజులు కావొస్తుందని కానీ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు చూపకుండా రిమాండ్ లోనే ఉంచుతున్నారని వీటిని తెలియజేస్తూ గ్రామంలో ఇంటింటికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు పై జరుగుతున్న కుట్ర కుతంత్రాలు  ప్రజలకు తెలియజేస్తూ 2024లో నారా చంద్రబాబు నాయుడుకు మనం మద్దతు తెలిపి ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు*

ఈ కార్యక్రమంలోపెరవలి సర్పంచ్ రాజు మాట్లాగొంది సర్పంచ్ గాండ్ల రమేష్ నూతనంగా ఎన్నికైన వార్డ్ నెంబర్ బాలకృష్ణ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్  దండు విజయ్ కుమార్  పెరవలి కృష్ణమోహన్ నాయుడు నాగరాజు వీరాంజనేయులు వెంకట స్వామి కృష్ణమోహన్  రామచంద్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగస్వామి జిల్లా బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న నియోజవర్గ బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి ఎస్సీ సెల్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మొండి పోగుల ఎర్రిస్వామి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాల్ వీరనారాయణ మాజీ ఎంపీటీసీ చిక్కాల చెనరాయుడు రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి నాగులగుడ్డం లక్ష్మీనారాయణ శ్రీనివాస్ నాయక్ సుదర్శన్ నాయక్ నారాయణస్వామి రాజు నరేష్ మాట్లాగొంది పుల్లయ్య రమేష్ సింగనమల శంకర్ నల్లప్ప జడేజా బోయ సుధాకర్ రవి హరి అంజి రాచేపల్లి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు

యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి అధ్యక్షతన సింగనమల రంగరాయ చెరువులో జల దీక్షకు ఏపీ రైతు సంఘం సీపీఐ మద్దతు తెలియజేస్తూ...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరోజు సింగనమల మండల కేంద్రంలో టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి అధ్యక్షతన సింగనమల రంగరాయ చెరువులో జల దీక్షకు ఏపీ రైతు సంఘం (సీపీఐ)పూర్తి మద్దతు తెలియజేస్తూ

 ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

 డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను శాంతియుతంగా ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పైన కార్మికుల సమస్యల పైన ఉద్యమాలు చేయకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు ,పోలీసుల ద్వారాఅక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉద్యమాలను చేయాలని చూడడం చాలా దుర్మార్గం దీనికి తార్కాణము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎటువంటి ఆధార్ లేకుండా అరెస్టు చేయడం ఉదాహరణ ,ఉద్యమాలు అణిచివేచే ప్రయత్నాలు ఇకనుండీఅయినా వైకాపాప్రభుత్వము

ఇటువంటీ చర్యలు మానుకొని రైతులు పడుతున్న అష్ట కష్టాలను ప్రజలు,రైతులు అధిక భారాలతో కార్మికులపడుతున్నభాధలు పైన దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలి ఈరోజు నిరుద్యోగ యువతఉద్యోగాలు లేక రోడ్ల పాలవుతున్నారు ప్రభుత్వపాలసీలుప్రజలకుఉపయోగ పడే విధంగా ఉండాలి,కావున ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టులు,అపాలి శాంతియుతంగా చేసే ఉద్యమాలకు సహకరించాలని లేకుంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి పుట్టకథలు హెచ్చరించడం జరిగింది. పాల్గొన్నవారు,

 తెలుగుదేశం నాయకులతోపాటు రైతు సంఘం శింగనమలనియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్, చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి చేనేతమధు, సిపిఐ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నారప్ప, సింగనమల రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, బయన్న, మరియు రామ సుబ్బారెడ్డి ఆచారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగావిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు డా_తలారి_రంగయ్య..

తన జీవితంలో అడుగడుగునా కులవివక్షను ఎదుర్కొంటూనే సమాజ సంస్కరణకు సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని సాంఘిక అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీ గుర్రం జాషువా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు #డా_తలారి_రంగయ్య గారు.