ఆధునిక తెలుగు సాహిత్యంలో సమకాలిన, సామాజిక అంశాలపై తన కవిత్వ పటిమతో పోరాటం చేసినమహాకవి జాషువా.. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు..
ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు, నవయుగ చక్రవర్తి గుఱ్ఱం జాషువా సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తికలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, మరియు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో కలిసిపూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాత్రగడ్డపాడులో గుఱ్ఱం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారన్నారు. చిన్నతనం నుంచి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేదని, బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడిని, ఆయన 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశాడన్నారు. రుక్మిణి కళ్యాణం, కోకిల, ధ్రువ విజయం, గబ్బిలం, ఫిరదౌసి, ఖండకావ్యాలు, తదితర అనేక రచనలు చేశాడని, కవితా విశారద, కవికోకిల, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ గా బిరుదులు పొంది ప్రసిద్ధులైనారన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో యుద్ధ ప్రచారకుడిగా పని చేశారన్నారు. తెలుగు రాష్ట్రంలో జన్మించిన అతి గొప్ప వ్యక్తుల్లో జాషువా ఒకరని, కడు పేద కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు పొందిన మహనీయుల్లో జాషువా చాలా గొప్పవాడన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డి అర్ ఓ కొండయ్య మాట్లాడుతూ కవి కోకిల బిరుదాంకుతులైన గుర్రం జాషువా ఉపాధ్యాయునిగా, ఆచార్యునిగా, శాసనమండలి సభ్యునిగా పని చేయడంతో పాటు సాహిత్యకారునిగా సామాజిక అసమానతలు, మూఢాచారాలు, దేశభక్తి వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని అనేక ప్రసిద్ధ రచనలు రచించడం ద్వారా తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలు అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సాంఘికసంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, డి ఆర్ డి పి డి నరసయ్య, పశుసంవర్ధక జెడ్ శుభ దాస్, ఐ సి డి సి పిడి, లలిత కుమారి, ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు డిఐపిఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి.
Sep 28 2023, 19:34