రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 15 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమం లో sc సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు గారు, పుట్లూరు మండల కన్వీనర్ బాలరంగయ్య, మల్లికార్జున, బ్రహ్మయ్య, bks మండల నాయకులు కేశన్న, సురేంద్ర,నరేష్, నార్పల మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు, ms రాజు గారు, మాట్లాడుతూ..
పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు చంద్రబాబు గారికి సంఘీభావం తెలుపుతుంటే ఆయన నిజాయితీ ఏంటో ఈ జగన్ కి ఇంకా అర్థం కావట్లేదు,ప్రజలు స్వచ్ఛందంగా మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా బాబు గారిని వెంటనే విడుదల చేయాలని ఆందోళనలు చేస్తున్నారు
నువ్వు మా చంద్రబాబు గారిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరో ఆరు నెలల్లో నిన్ను, నీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపి వేస్తారు. ఇంకా న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Sep 28 2023, 19:14