దళితుల హక్కులు, సామాజిక న్యాయం కై ఈనెల 29న 'విజయవాడలో జరిగే “మహాధర్నా" ను జయప్రదం చేయండి. కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు.
బుక్కరాయసముద్రం
మండల కేంద్రములో ఈనెల 29న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎ.నాగలింగమయ్య రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్ . కుల్లాయప్ప, సంజీవరెడ్డి, సిఐటియు నాయకులు నాగేంద్ర, నెట్టికంటయ్య, ఎం ఆర్ పి ఎస్ నాయకులు వెంకటాపురం చంద్ర, మారెన్న, చెన్నప్ప, చిన్న గంగయ్య, ఎర్రన్న , తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నేటికీ దళితుల పై దాడులు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కూడా దళితులను అత్యంత కిరాతకంగా చంపివేయడం జరుగుతున్నది. యావత్ భారతావని తలదించుకునే విధంగా మణిపూర్లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేయడంతో దేశం నివ్వెర పోయింది. ఇంత జరిగినా మతోన్మాద ప్రధానమంత్రి మోదీ పల్లెత్తు మాట మాట్లాడకపోగా ద్రోహులకు రక్షణ కల్పించడం అత్యంత సిగ్గు చేటు. దళితులను ఆదిపత్య కులాలు, పాలక పార్టీలు ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్ప వీరిని మనుషులుగా చూడకపోవడం దురదృష్టకరం.
బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసి దళిత, గిరిజనులకు తీవ్ర అన్యాయాన్ని తలపెట్టారు. దళితుల్లో చదువుకున్న నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారు. కేంద్రంలో లక్షలాది • ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్న వాటిని భర్తీ చేయటం లేదు. జగన్ ప్రభుత్వం 9/77 చట్టాన్ని మార్చి గవర్నర్తో ఆర్డినెన్స్ ఇప్పించి 20 సం॥రాలు దాటిన తర్వాత అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు అనే చట్ట సవరణ చేశారంటే ఇది దళితుల చేతుల నుండి భూమిని లాగివేయడమే. మన రాష్ట్రంలో నేటికీ దళితులు చనిపోతే శవాన్ని పూడ్చడానికి ఆరడుగుల నేల లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. స్మశానాలు కొనుగోలు చేయమని ఉత్తర్వులు ఇస్తున్నారు తప్ప నిధులు మంజూరు చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా రోజురోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయి.
సామాజిక న్యాయంకై
తరలిరండి... భాగస్వాములుకండి. ప్రధానంగా దళితుల సమస్యలు
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్పిసి రద్దు చేయాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
దళిత, గిరిజనులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను 300 యూనిట్లకు పెంచాలి. జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫార్సులు అమలు చేయాలి.
కోనేరు రంగారావు భూకమిటీ సిఫార్సులను అమలు చేయాలి.
అసైన్డ్ చట్ట సవరణ ఉపసంహరించాలి. మిగులు భూములు ప్రజలకు పంచాలి.
డప్పు, చర్మ కారుల పెన్షన్ రూ. 5,000/- లకు పెంచాలి.
స్మశానంలో పని చేస్తున్న కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.
ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 29 (శుక్రవారం)న విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Sep 28 2023, 17:07