ఎం.యస్ .స్వామినాథన్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల..
మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ (జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "హరిత విప్లవ పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.అతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.ఇవాళ ఆయన 98 వయసులో చెన్నై లో తుది శ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమరవీరుడు భగత్ సింగ్ గారి త్యాగాలు మరువలేనివి భగత్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించాలి.. NSUI జిల్లా నాయకులు మురళీకృష్ణ, మంజునాథ్.
అనంతపురం నగరంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ గారి 116వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ గారి ఫోటోకి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన NSUI జిల్లా నాయకులు j.మురళీకృష్ణ పుల్లలరేవు మంజునాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర నరాలలో దేశభక్తి అణువణువునా స్వాతంత్య్రం సాందిచాలనే కాంక్ష పట్టు విడువని పోరాట పటిమ పోరాటం అంటే ఇలానే చెయ్యాలని భావి తరాలకు చాటి చెప్పిన గోప్ప పోరాట యోధుడు భగత్ సింగ్ అని అన్నారు. భగత్ సింగ్’.. ఈ పేరు వింటే చాలు భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయే ధీరుడు భగత్ సింగ్ అని అన్నారు. 1907 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించిన ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం... బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడారని ఉరి కంబం ఎదురుగా కనిపిస్తున్నా.. వారు అధైర్య పడలేదు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని 13 ఏళ్ల వయసు నుంచే బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన అసమాన్య పోరాటయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నేటితరం విప్లవ జ్వాలకు అసలైన మార్గదర్శిగా భగత్ సింగ్ ను చూస్తున్నారంటే ఆయనలోని పోరాట పటిమ ఎంత బలమైనదో తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, మహేంద్ర, మహేష్, బాబు, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కు నిరసనగా పెరవలి లో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ..

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగాసింగనమల మండలం పెరవలి గ్రామపంచాయతీలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు నియోజకవర్గ ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఆదేశానుసారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి సీనియర్ తెలుగుదేశం నాయకులు గోరంట్ల మారుతి నాయుడు ఆధ్వర్యంలో పెరవలి గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు ని అక్రమ అరెస్టు చేసి ఈరోజు 20 రోజులు కావొస్తుందని కానీ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు చూపకుండా రిమాండ్ లోనే ఉంచుతున్నారని వీటిని తెలియజేస్తూ గ్రామంలో ఇంటింటికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు పై జరుగుతున్న కుట్ర కుతంత్రాలు  ప్రజలకు తెలియజేస్తూ 2024లో నారా చంద్రబాబు నాయుడుకు మనం మద్దతు తెలిపి ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు*

ఈ కార్యక్రమంలోపెరవలి సర్పంచ్ రాజు మాట్లాగొంది సర్పంచ్ గాండ్ల రమేష్ నూతనంగా ఎన్నికైన వార్డ్ నెంబర్ బాలకృష్ణ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్  దండు విజయ్ కుమార్  పెరవలి కృష్ణమోహన్ నాయుడు నాగరాజు వీరాంజనేయులు వెంకట స్వామి కృష్ణమోహన్  రామచంద్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగస్వామి జిల్లా బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న నియోజవర్గ బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి ఎస్సీ సెల్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మొండి పోగుల ఎర్రిస్వామి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాల్ వీరనారాయణ మాజీ ఎంపీటీసీ చిక్కాల చెనరాయుడు రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి నాగులగుడ్డం లక్ష్మీనారాయణ శ్రీనివాస్ నాయక్ సుదర్శన్ నాయక్ నారాయణస్వామి రాజు నరేష్ మాట్లాగొంది పుల్లయ్య రమేష్ సింగనమల శంకర్ నల్లప్ప జడేజా బోయ సుధాకర్ రవి హరి అంజి రాచేపల్లి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు

యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి అధ్యక్షతన సింగనమల రంగరాయ చెరువులో జల దీక్షకు ఏపీ రైతు సంఘం సీపీఐ మద్దతు తెలియజేస్తూ...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరోజు సింగనమల మండల కేంద్రంలో టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి అధ్యక్షతన సింగనమల రంగరాయ చెరువులో జల దీక్షకు ఏపీ రైతు సంఘం (సీపీఐ)పూర్తి మద్దతు తెలియజేస్తూ

 ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

 డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను శాంతియుతంగా ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పైన కార్మికుల సమస్యల పైన ఉద్యమాలు చేయకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు ,పోలీసుల ద్వారాఅక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉద్యమాలను చేయాలని చూడడం చాలా దుర్మార్గం దీనికి తార్కాణము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎటువంటి ఆధార్ లేకుండా అరెస్టు చేయడం ఉదాహరణ ,ఉద్యమాలు అణిచివేచే ప్రయత్నాలు ఇకనుండీఅయినా వైకాపాప్రభుత్వము

ఇటువంటీ చర్యలు మానుకొని రైతులు పడుతున్న అష్ట కష్టాలను ప్రజలు,రైతులు అధిక భారాలతో కార్మికులపడుతున్నభాధలు పైన దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలి ఈరోజు నిరుద్యోగ యువతఉద్యోగాలు లేక రోడ్ల పాలవుతున్నారు ప్రభుత్వపాలసీలుప్రజలకుఉపయోగ పడే విధంగా ఉండాలి,కావున ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టులు,అపాలి శాంతియుతంగా చేసే ఉద్యమాలకు సహకరించాలని లేకుంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి పుట్టకథలు హెచ్చరించడం జరిగింది. పాల్గొన్నవారు,

 తెలుగుదేశం నాయకులతోపాటు రైతు సంఘం శింగనమలనియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్, చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి చేనేతమధు, సిపిఐ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నారప్ప, సింగనమల రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, బయన్న, మరియు రామ సుబ్బారెడ్డి ఆచారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగావిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు డా_తలారి_రంగయ్య..

తన జీవితంలో అడుగడుగునా కులవివక్షను ఎదుర్కొంటూనే సమాజ సంస్కరణకు సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని సాంఘిక అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీ గుర్రం జాషువా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు #డా_తలారి_రంగయ్య గారు.

కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయస్థాయిలో గుర్తింపు..

కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈనెల 12 13 వ తేదీన జరిగిన నేషనల్ క్వాలిటీ అసూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 89.19% సాధించడం జరిగినది. ఇందుకు గాను మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయస్థాయిలో గుర్తింపు పొందినది. దీనికి సహకరించిన జిల్లా అధికారులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి మా వైద్యుల తరఫున కృతజ్ఞతలు.

రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 15 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమం లో sc సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు గారు, పుట్లూరు మండల కన్వీనర్ బాలరంగయ్య, మల్లికార్జున, బ్రహ్మయ్య, bks మండల నాయకులు కేశన్న, సురేంద్ర,నరేష్, నార్పల మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు, ms రాజు గారు, మాట్లాడుతూ.. 

పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు చంద్రబాబు గారికి సంఘీభావం తెలుపుతుంటే ఆయన నిజాయితీ ఏంటో ఈ జగన్ కి ఇంకా అర్థం కావట్లేదు,ప్రజలు స్వచ్ఛందంగా మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా బాబు గారిని వెంటనే విడుదల చేయాలని ఆందోళనలు చేస్తున్నారు 

నువ్వు మా చంద్రబాబు గారిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరో ఆరు నెలల్లో నిన్ను, నీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపి వేస్తారు. ఇంకా న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు  

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీలు తగ్గించమంటే అక్రమ అరెస్టులా.. డి.చిన్నప్పయాదవ్ ఏపిరైతుసంఘము జిల్లా ప్రధానకార్యదర్శి

వామపక్ష పార్టీలఅద్వర్యంలో

విద్యుత్ చార్జీలు తగ్గించాలని

అనంతపురము పవర్ అపీసు (విద్యుత్ కార్యాలయము) దగ్గర ధర్నా కార్యక్రమము కు

వెళ్ళకుండా,మరియి మాజీముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకునిరసనగా

ఈ రోజు జిల్లా కేంద్రములో టి డి పి అద్వర్వములో జరిగే కాగడాల ప్రధర్శనకు సంఘీభావము తెల్పే దానికి

పోవుతున్నారని శింగనమల పోలీసులు ముంధస్తు జిల్లా వ్యాప్తంగా మాతోపాటు వామపక్షనాయకులను,ప్రజాసంఘాలనాయకులను అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము వైసిపి ప్రభుత్వము అధికారములోకి వచ్చినప్పుడునుండి 5సార్లు విద్యుత్ చార్జీలు పెంచిసామాన్యుల నడ్డి విరిచినారుఇప్పటికైనా పేదలపై భారాలు తగ్గించాలి లేకుంటే తోందరలోనే ప్రజల అగ్రహనికి గురికాకతప్పదనిపాలకపక్షానికి హెచ్చరించడముజరిగింది.

 అరెస్టుఅయిన నాయకులు,చేనేత శింగనమల మండలకార్యదర్శి నేషేమధు,సీపీఐ సీనీయర్ నాయకులు వెంకటరెడ్ది,రైతుసంఘము మండలకార్యదర్శి,కోండపల్లి

చంద్రశేఖర్, నాగరాజు తదితరులను అరెస్టు చేయడముజరిగింది.

దళితుల హక్కులు, సామాజిక న్యాయం కై ఈనెల 29న 'విజయవాడలో జరిగే “మహాధర్నా" ను జయప్రదం చేయండి. కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రములో ఈనెల 29న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎ.నాగలింగమయ్య రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్ . కుల్లాయప్ప, సంజీవరెడ్డి, సిఐటియు నాయకులు నాగేంద్ర, నెట్టికంటయ్య, ఎం ఆర్ పి ఎస్ నాయకులు వెంకటాపురం చంద్ర, మారెన్న, చెన్నప్ప, చిన్న గంగయ్య, ఎర్రన్న , తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ

76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నేటికీ దళితుల పై దాడులు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కూడా దళితులను అత్యంత కిరాతకంగా చంపివేయడం జరుగుతున్నది. యావత్ భారతావని తలదించుకునే విధంగా మణిపూర్లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేయడంతో దేశం నివ్వెర పోయింది. ఇంత జరిగినా మతోన్మాద ప్రధానమంత్రి మోదీ పల్లెత్తు మాట మాట్లాడకపోగా ద్రోహులకు రక్షణ కల్పించడం అత్యంత సిగ్గు చేటు. దళితులను ఆదిపత్య కులాలు, పాలక పార్టీలు ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్ప వీరిని మనుషులుగా చూడకపోవడం దురదృష్టకరం.

బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసి దళిత, గిరిజనులకు తీవ్ర అన్యాయాన్ని తలపెట్టారు. దళితుల్లో చదువుకున్న నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారు. కేంద్రంలో లక్షలాది • ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్న వాటిని భర్తీ చేయటం లేదు. జగన్ ప్రభుత్వం 9/77 చట్టాన్ని మార్చి గవర్నర్తో ఆర్డినెన్స్ ఇప్పించి 20 సం॥రాలు దాటిన తర్వాత అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు అనే చట్ట సవరణ చేశారంటే ఇది దళితుల చేతుల నుండి భూమిని లాగివేయడమే. మన రాష్ట్రంలో నేటికీ దళితులు చనిపోతే శవాన్ని పూడ్చడానికి ఆరడుగుల నేల లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. స్మశానాలు కొనుగోలు చేయమని ఉత్తర్వులు ఇస్తున్నారు తప్ప నిధులు మంజూరు చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా రోజురోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయి.

సామాజిక న్యాయంకై

తరలిరండి... భాగస్వాములుకండి. ప్రధానంగా దళితుల సమస్యలు

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్పిసి రద్దు చేయాలి. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.

దళిత, గిరిజనులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను 300 యూనిట్లకు పెంచాలి. జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫార్సులు అమలు చేయాలి.

కోనేరు రంగారావు భూకమిటీ సిఫార్సులను అమలు చేయాలి.

అసైన్డ్ చట్ట సవరణ ఉపసంహరించాలి. మిగులు భూములు ప్రజలకు పంచాలి.

డప్పు, చర్మ కారుల పెన్షన్ రూ. 5,000/- లకు పెంచాలి. 

స్మశానంలో పని చేస్తున్న కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.

ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 29 (శుక్రవారం)న విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సర్వ మతాల సంప్రదాయాలకు ప్రాధాన్యం గుడి, మసీదు, చర్చి, భద్రత మీ చేతుల్లోనే శాంతియుతంగా మెలగాలని హితువు.. సీఐ డి.నాగార్జున రెడ్డి

అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో స్థానిక సీఐ డి.నాగార్జున రెడ్డి పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

గ్రామ రెవెన్యూ పంచాయతీ కి చెందిన వివిధ మసీదులు, దేవాలయాలు, చర్చ్ మరియు దర్గాలకు చెందిన కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం వివిధ మతాలకు, జాతులకు సాంప్రదాయాలకు నిలువుటద్దమని, అందరి సంప్రదాయాలను గౌరవించి, సోదర భావంతో మెలగాలని సూచించారు. మతపరంగా నిర్వహించే పూజా వేడుకలు, నమాజ్ మరియు ఇఫ్తార్లు, ర్యాలీలు,యాత్రలు, ఊరేగింపులు,సభలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాంతియుతంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరగా...

వివిధ దేవాలయాల వద్ద తాగుబోతుల దుశ్చర్యలు, దొంగతనాలు, అభద్రత విషయాలు నిర్వాహకులు పేర్కొన్నారు.

దీనిపై సిఐ డి.నాగార్జున రెడ్డి స్పందిస్తూ కచ్చితంగా రాత్రి వేళల్లో జరుగు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని భరోసా ఇచ్చి, గుడి,మసీదు,దర్గా మరియు చర్చి భద్రత కొరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బి.కే.ఎస్ దర్గా కమిటీ చైర్మన్ మండ్ల నాగభూషణం, ఇర్ఫాన్,ఇస్లాంపూర్ కాలనీ సుల్తాన్,చాంద్ బాషా, రజాక్,కాశీ విశ్వేశ్వర దేవాలయ చైర్మన్ వెంకట చలపతి, వినాయక గుడి మేనేజర్ శాంతి మూర్తి, సాయిబాబా గుడి పూజారి బద్రీనాథ్, మస్జిదే ఫాతిమా సాని ముతవల్లి నబి రసూల్,డిజిటల్ భాష, షాషావలి, జన చైతన్య కాలనీ తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి, టోపీ బాషా తదితర గాంధీ నగర్ మరియు రాఘవేంద్ర కాలనీ వాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.