యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి అధ్యక్షతన సింగనమల రంగరాయ చెరువులో జల దీక్షకు ఏపీ రైతు సంఘం సీపీఐ మద్దతు తెలియజేస్తూ...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరోజు సింగనమల మండల కేంద్రంలో టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి అధ్యక్షతన సింగనమల రంగరాయ చెరువులో జల దీక్షకు ఏపీ రైతు సంఘం (సీపీఐ)పూర్తి మద్దతు తెలియజేస్తూ
ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను శాంతియుతంగా ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పైన కార్మికుల సమస్యల పైన ఉద్యమాలు చేయకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు ,పోలీసుల ద్వారాఅక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉద్యమాలను చేయాలని చూడడం చాలా దుర్మార్గం దీనికి తార్కాణము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎటువంటి ఆధార్ లేకుండా అరెస్టు చేయడం ఉదాహరణ ,ఉద్యమాలు అణిచివేచే ప్రయత్నాలు ఇకనుండీఅయినా వైకాపాప్రభుత్వము
ఇటువంటీ చర్యలు
మానుకొని రైతులు పడుతున్న అష్ట కష్టాలను ప్రజలు,రైతులు అధిక భారాలతో కార్మికులపడుతున్నభాధలు పైన దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలి ఈరోజు నిరుద్యోగ యువతఉద్యోగాలు లేక రోడ్ల పాలవుతున్నారు ప్రభుత్వపాలసీలుప్రజలకుఉపయోగ పడే విధంగా ఉండాలి,కావున ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టులు,అపాలి శాంతియుతంగా చేసే ఉద్యమాలకు సహకరించాలని లేకుంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి పుట్టకథలు హెచ్చరించడం జరిగింది. పాల్గొన్నవారు,
తెలుగుదేశం నాయకులతోపాటు రైతు సంఘం శింగనమలనియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్, చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి చేనేతమధు, సిపిఐ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నారప్ప, సింగనమల రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, బయన్న, మరియు రామ సుబ్బారెడ్డి ఆచారి తదితరులు పాల్గొన్నారు.
Sep 28 2023, 14:59