సర్వ మతాల సంప్రదాయాలకు ప్రాధాన్యం గుడి, మసీదు, చర్చి, భద్రత మీ చేతుల్లోనే శాంతియుతంగా మెలగాలని హితువు.. సీఐ డి.నాగార్జున రెడ్డి
అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో స్థానిక సీఐ డి.నాగార్జున రెడ్డి పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
గ్రామ రెవెన్యూ పంచాయతీ కి చెందిన వివిధ మసీదులు, దేవాలయాలు, చర్చ్ మరియు దర్గాలకు చెందిన కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం వివిధ మతాలకు, జాతులకు సాంప్రదాయాలకు నిలువుటద్దమని, అందరి సంప్రదాయాలను గౌరవించి, సోదర భావంతో మెలగాలని సూచించారు. మతపరంగా నిర్వహించే పూజా వేడుకలు, నమాజ్ మరియు ఇఫ్తార్లు, ర్యాలీలు,యాత్రలు, ఊరేగింపులు,సభలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాంతియుతంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరగా...
వివిధ దేవాలయాల వద్ద తాగుబోతుల దుశ్చర్యలు, దొంగతనాలు, అభద్రత విషయాలు నిర్వాహకులు పేర్కొన్నారు.
దీనిపై సిఐ డి.నాగార్జున రెడ్డి స్పందిస్తూ కచ్చితంగా రాత్రి వేళల్లో జరుగు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని భరోసా ఇచ్చి, గుడి,మసీదు,దర్గా మరియు చర్చి భద్రత కొరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బి.కే.ఎస్ దర్గా కమిటీ చైర్మన్ మండ్ల నాగభూషణం, ఇర్ఫాన్,ఇస్లాంపూర్ కాలనీ సుల్తాన్,చాంద్ బాషా, రజాక్,కాశీ విశ్వేశ్వర దేవాలయ చైర్మన్ వెంకట చలపతి, వినాయక గుడి మేనేజర్ శాంతి మూర్తి, సాయిబాబా గుడి పూజారి బద్రీనాథ్, మస్జిదే ఫాతిమా సాని ముతవల్లి నబి రసూల్,డిజిటల్ భాష, షాషావలి, జన చైతన్య కాలనీ తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి, టోపీ బాషా తదితర గాంధీ నగర్ మరియు రాఘవేంద్ర కాలనీ వాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Sep 28 2023, 14:46