టిడిపి అధినేత నారా చంద్రబాబుని అక్రమ అరెస్టు నిరసిస్తూ కదిరి నుండి సైకిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు టిడిపి కార్యకర్త సతీష్ కుమార్

సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టిడిపి కార్యకర్త సతీష్ కుమార్ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ కదిరి నుండి సైకిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయలుదేరాడు. కడప జిల్లా కమలాపురానికి చేరుకున్న సతీష్ కుమార్ కు ఆ జిల్లా టిడిపి నాయకులు కార్యకర్తలు చంద్రబాబుకు తోడుగా మేము సైతం అంటూ కొద్ది దూరం సైకిల్ యాత్ర చేపట్టిన కార్యకర్త వెంట నడిచారు. ఇంత పెద్ద సహాయం చేస్తున్న టిడిపి కార్యకర్తను పలువురు అభినందిస్తున్నారు.

రైతులను కరువు కోరలు నుండి కాపాడి తక్షణమే కరువు సహయకచర్యలు చేపట్టాలి ఏపిరైతుసంఘము జిల్లాప్రధానకార్యదర్శి డి.చిన్నప్పయాదవ్..

అనంతపురముజిల్లా రైతులనుకరువు కోరలునుండికాపాడితక్షణమే కరువు సహయకచర్యలుచేపట్టాలి,

జిల్లా వ్యాప్తంగాఅన్నిమండలాలను కరువుమండలాలుగా ప్రకటించి,నష్టపోయిన హప్రతిరైతుకుపంటలవారిగా నష్టపరిహరము అందించాలి. సీపీఐ ~~రైతుసంఘము అద్వర్యంలో నార్పల మండలతహశీల్దార్ కార్యాలయము దగ్గరనిరసన ఈ కార్యక్రమములో ముఖ్యఅథితులుగా సీపీఐ 

నీయోజకవర్గ కార్యదర్శి,టి.నారాయణస్వామి ఏపిరైతుసంఘము జిల్లాప్రధానకార్యదర్శి డి.చిన్నప్పయాదవ్ , సీపీఐ మండల కార్యదర్శి గంగాధర పాల్గోని మాట్లాడుతూ..

జిల్లావ్యాప్తంగా నార్పల మండలముతోపాటు2023 ఖరీఫ్ యందు వేరుశనగ, పత్తి, ఆముదం, కంది ,జొన్న, సద్ద, కొర్ర .అనేకమైన వాణిజ్య ఆహార పంటలు జూన్ నెలాఖరు నుండి సాగు చేయడం జరిగినది కానీ సకాలంలో వర్షాలు లేక పంటలన్నీ పిందె పూత ఊడల దశ లోనే పంటలన్నీ ఏండిపోవడం జరిగినది అందువలన రైతులు కౌలు రైతులు పెట్టిన పంటలన్నీ నష్టపోవడం జరిగినది ఇప్పటికే పంటలవారిగా ఎకరాకి 20 నుంచి 30 వేల వరకు పంటలు పెట్టి నష్టపోవడం జరిగినది కావున ప్రతి సంవత్సరం అధిక వర్షాల వల్ల ,అకాల వర్షాల వలన, అనావృష్టి వలన నష్టపోవడం జరుగుతున్నది కానీ ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఈ సంవత్సరం అనావృష్టి వలన దాదాపుగా లక్షల ఎకరాల్లో వేసినఅన్ని రకాల పంటలు నష్టపోవడం జరిగింది కావున వాతావరణ బీమాను రద్దుచేసి, గ్రామాల యూనిట్ ఆధారంగా పంటల బీమాపథకాన్ని వర్తింపచేయాలి, తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారం నివేదికలు తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపి నష్టపరిహరము,పంటల బీమా వచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ క్రింది డిమాండ్లను తక్షణమే అమలు చేయాలి.

డిమాండ్లు!

   1)జిల్లాలోని 31మండలములను కరువుమండలముగా ప్రకటించి ఏకరాకు 25000వేలునష్టపరిహరము అందించాలి.

2)నష్టపోయినప్రతిరైతుకుపంటలవారిగా పంటనష్టపరిహరము అందించాలి.

3)రైతులుతీసుకున్నఋణాలుఅన్ని రద్దుచేసి తిరిగి క్రోత్తఋణాలుఇవ్వాలి.

4)రైతులకు ఉచితంగా పశుగ్రాసము పంఫీణీ చేయాలి.

5)జాతీయవిపత్తులనిర్వణక్రిందకేటాయిస్తామన్న4000కోట్లు కేటాయించాలి.

6) మద్దతు ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్ల రూపాయలు కేటాయించాలి.

7)విత్తనాలు, ఎరువులు పురుగుమందులు 90% సబ్సిడీతో రైతులుఅందించాలి.

8) 50 సంవత్సరాల నుండి ప్రతి రైతుకు 10,000 నెలకు పెన్షన్ ఇవ్వాలి.

9 )ఏకరాకు 10వేలు రూ"సాగుసాయము క్రిందరైతులకుకౌలు రైతులకుఇవ్వాలి.

  పాల్గొన్నవారు, నార్పల సీపీఐ మండలకార్యదర్శి,గంగాధర ,సుధాకర,సీపీఐ మండలసహయకార్యదర్శి రమేష్ ,

రైతు సంఘంమండల అద్యక్షులు జోసెఫ్ ,లలితమ్మ, పెద్దపెద్దయ్య, శీను, నాగరాజు, సంజీవ రాయుడు శివమ్మ, మా బి ,శ్రీదేవి, ఏర్రెప్ప, రామచంద్ర, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ గారి* ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలియచేసిన పలువురు టిడిపి శ్రేణులు

సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసన గా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 2వ రోజు కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ గారి ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలియచేసిన రాష్ట్ర కార్యదర్శి కల్లుకుంట అంజినప్ప హిందూపురం పట్టణ అధ్యక్షుడు DE రమేష్ ,డైమండ్ బాబా, మంగేష్, అమర్ ,తదితర నాయకులు .....

మాజీ మంత్రివర్యులు పరిటాల సునీత గారిని స్వగృహంలో పరామర్శించిన.. అనంతపురం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి

 మాజీ మంత్రివర్యులు రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల సునీత గారు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ సోమవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిటాల సునీత గారిని అక్రమ అరెస్టు చేసి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి ఇంటిలో ఉన్న మాజీ మంత్రివర్యులని అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసూల చంద్రమోహన్ చిక్కాల చండ్రా యుడు జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహ కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న తదితరులు పరామర్శించడం జరిగింది*

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై సమీక్ష సమావేశం...

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం లతో వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నీలంపల్లి గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. అనంతరం జగనన్న ఆరోగ్యం సురక్ష పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొర్రపాడు వైద్యాధికారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నీలంపల్లి గ్రామ సర్పంచ్ రసూల్ బి, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి జిల్లా నందు రేపే టూరిజం డే సంబరాలు అందరూ ఆహ్వానితులే

సత్యసాయి జిల్లా నందు రేపు జరగబోయే ప్రపంచ టూరిజం దినోత్సవ సంబరాలకు అందరూ ఆహ్వానితులే కాబట్టి అందరూ హాజరై టూరిజం డే ఉత్సవాలను వీక్షించి విజయవంతం చేయాలని కోరుతూ...

చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ.. ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం నిరసన ర్యాలీ..

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం మరియు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల నాగభూషణ మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు డేగల కృష్ణమూర్తి వేలూరు రంగయ్య ఆలం వెంకట నరస నాయుడు ముత్యాలపనాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని ఏ తప్పు చేయని నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఏ తప్పు చేయని నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఈరోజుకు 19 రోజులు డిమాండ్ పంపడం పంపడం అన్యాయమని మాకు వచ్చిన నిధులు 8629 కోట్లు అక్రమాకంగా మళ్లించడం ఇది చట్ట ఉల్లంఘన కాదా అని వారు ధ్వజమెత్తారు* 

 ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచులు పిట్టు వెంకటనారాయణమ్మ యుగంధర్ నల్లప్ప కుల్లాయప్ప నాయుడు నర్సింగ్ మూర్తి నాగమణి రెడ్డి నరేష్ వసంత్ కుమార్ రమేష్ నాగార్జున రాజు నాగమణి రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి శివశంకర్ నాగమణి రెడ్డి అస్పర్ధ రెడ్డి సాకే తిరుపాల్ ఉజ్జినప్ప సీనయ్య  ఆంజనేయ రెడ్డి భరత్ కుమార్ నాగార్జున మల్లికార్జున వీరికి సంఘీభావంగా  జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి నరసింహులు  మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి బ్యాల్ల నాగేంద్ర నిట్టూరు శివాజీ భగవాన్ ఎల్లనూరు దొడ్లో రామాంజనేయులు హనుమంతు కొయ్యగురా పెద్దన్న చండ్రా రాయుడు తదితరులు సంఘీభావం తెలిపి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు

కళ్ళకు గంతు లు కట్టుకొనిమోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన..రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ..

సింగనమల దిసభ్య కమిటీ సభ్యుల ఆదేశాల మేరకు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, కళ్ళకు గంతు లు కట్టుకొనిమోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో జిల్లా రైతు అధికార ప్రతినిధి తలారి తిప్పన్న ,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నరసాపురం శివరామకృష్ణ, రంగాపురం శ్రీరాములు, గుగుడు చికెన్ ఓబులేసు, మల్లెల కుల్లాయప్ప, గోపాల్, బొగ్గు నల్లప్ప ,శ్రీరామయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది

బుక్కరాయసముద్రం మూడో సచివాలయం నందు దక్షిణామూర్తి నగర్ లో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం..

బుక్కరాయసముద్రం మూడో సచివాలయం నందు దక్షిణామూర్తి నగర్ లో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య అధికారిని డాక్టర్ స్వాతి లక్ష్మి గారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో భాగంగా నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి వెళ్లి సర్వే చేస్తున్నారా లేదా అని ప్రజల వద్ద ఆరా తీయడం జరిగింది, దీర్ఘకాలిక రోగులకు రక్తపోటు మరియు డయాబెటిస్, ఆస్తమా, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తున్నారా లేదా అని ఆరా తీయడం జరిగింది, అక్టోబర్ ఆరో తారీఖున నిర్వహించు జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపునకు తప్పనిసరిగా అందరూ రావాలని, వారికి ముందస్తుగా టోకెన్లను అందిస్తున్నారా లేదా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు, ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా బెడ్ రిటన్ ( మంచానికే పరిమితమైన రోగుల ఇంటి వద్దకు వెళ్లి) వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగింది, అలాగే కాన్పు అనంతరం బాలింత సేవలు అందిస్తున్నారా లేదా అని బాలింత ఇంటి దగ్గరకు వెళ్లి పరిశీలించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మీట్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్త బొజ్జమ్మ, ఆశా కార్యకర్తలు కృష్ణవేణి, సావిత్రి, వాలంటీర్లు ఫ్యామిలీ ఫిజీషియన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

జగనన్న కాలనీల నందు ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను పరిశీలించిన మండల జడ్పిటిసి నీలం భాస్కర్

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దారాంపురం గ్రామం రోడ్డు ప్రక్కన ఉన్న జగనన్న కాలనీ నందు లబ్ధిదారుల ఇళ్ళ ముందు ఇంకుడు గుంతలను చేపడుతున్న సందర్భంగా ఆ ఇంకుడు గుంతలను పరిశీలించిన మండల జెడ్పిటిసి నీలం భాస్కర్. కార్యక్రమంలో జే సి ఎస్ మండల కన్వీనర్ పసులూరు భయపరెడ్డి స్టోర్ డీలర్ల సంఘం ఉపా అధ్యక్షులు సాకే లక్ష్మీనారాయణ హౌసింగ్ ఏఈ రాజశేఖర్ రెడ్డి