రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో మంగళవారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వేడుకలకు వచ్చేవారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాపు ఇచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకూ ఉన్న రోడ్డు మూసివేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు అందజేయనున్నారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతించనున్నారు.

ఏ గోల్డ్ పాసులున్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

ఏ పింక్ పాసులున్న వాహనదారులు కోట ప్రధాన ద్వారం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్టాప్ వద్ద పార్క్ చేయాలి. బీ పాసులున్న వాహనదారులు గోల్కొండ బస్టాప్ దగ్గర కుడి మలుపు తీసు కొని ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

సీ గ్రీన్ పాసులున్న వాహనదారులు గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి 500 మీటర్ల దరంలో ఉన్న ఓసీ/ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. డీ ఎరుపు పాసులున్న వారికి ప్రియదర్శిని స్కూల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఇకఈ నలుపు పాసులన్న వారు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. షేక్పేట, టోలీచౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగింది....

బోను లో చిక్కిన చిరుత

తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు.

తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దదిగా అటవీ అధికారులు గుర్తించారు.

రెండు రోజుల క్రితం నరశింహస్వామి ఆలయ సమపంలో బాలికపై చిరుత దాడి చేసింది. చిరుత సంచరించే ప్రాంతాలను గుర్తించి అటవీ అధికారులు నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు చిరుత చిక్కిన ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

కాగా.. తిరుమల..మొదటి ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత సంచారం తాజాగా కలకలం రేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న వాహనదారులకు 38వ మలుపు వద్ద చిరుత కనపడింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకున్న తర్వాత నడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది..

తిరుపతి :ఆగస్టు 14

తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ సోమవారం కూడా కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

ఇక ఆదివారం శ్రీవారిని 84,401 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

37738 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

Rajinikanth: జైలర్ హిట్ అవుతుందని నేను అనుకోలేదు.. రజినీ సంచలన వ్యాఖ్యలు

సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు మూడేళ్ళ తరువాత జైలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. బీస్ట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్..

ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో జైలర్ సినిమాను తెరకెక్కించాడు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రజినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా జైలర్ గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం ముందే మూడురోజుల్లో రూ. 200 కోట్లు రాబట్టి రజినీ ర్యాంపేజ్ ను చూపించింది. ఇక ఈ చిత్రం రజినీ ఎలివేషన్స్.. మోహన్ లాల్, శివన్న లా క్యామియో.. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. బీస్ట్ సినిమా పరాజయం తరువాత నెల్సన్ తో సినిమా వద్దని రజినీకి చాలామంది చెప్పినా ఆయన కథను నమ్మి ఈ సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చారు..

ఇక తాజాగా రజినీ బద్రీనాథ్‌ ఆలయాన్ని సందర్శించి అనంతరం రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమంలో ప్రత్యేక్షమయ్యాడు. మొట్ట మొదటిసారి రజినీ, జైలర్ రిజల్ట్ పై స్పందించాడు. ” సినిమా షూటింగ్ సమయంలో చాలా ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడికి నేను కూడా లోనయ్యాను. ఒకనొక సందర్భంలో ఈ సినిమా హిట్ అవుతుందా అనే అనుమానం కూడా వచ్చింది. అప్పుడు స్వామిజీ ఒక మాట చెప్పారు.. కంగారు పడకు.. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. ఆయనే స్వయంగా చెప్పిన తరువాత ఇక జైలర్ రిజల్ట్ గురించి ఆలోచించడం ఎందుకు అనుకున్నా.. ఇక జైలర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి..

గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది.

ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసిన విషయం తేలిసిందే.

కాగా.. కొన్ని రోజుల నుంచి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న నిరసనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగొచ్చారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలను మీడియా తెలంగాణ సర్కారు దృష్టికి తీసుకొచ్చింది.

మరోవైపు ప్రతిపక్షాలు సైతం అభ్యర్ధుల ఆందోళనకు మద్దతు ఇస్తూ పరీక్ష వాయిదా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నేపథ్యంలో సీఎం కేసీఆర్ గ్రూప్-2 అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ అధికారులతో చర్చించాలని సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.....

నేడే వెస్టిండీస్ భారత్ తుది పోరు..

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిన్న శ‌నివారం జ‌రిగిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. కీలకమైన నాల్గవ మ్యాచ్‌లో విండీస్‌ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలోనే ఛేదించింది.

లక్ష్య ఛేదనలో ఓపెనర్లు జైస్వాల్‌, గిల్‌ స్వైరవిహారం చేయ‌గా.. ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేసిన జైస్వాల్‌ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్‌ 77 పరుగులు చేశాడు.

ఇక‌, నేడు ఆదివారం విండీస్‌ – భారత్‌ మధ్య ఐదో టీ 20 మ్యాచ్‌ రాత్రి 8:00గంటలకు జరగనుంది. సిరీస్ ఎవ‌రిది అనేది ఇవ్వాల జ‌ర‌గ‌బొయే మ్యాచ్ లో తేల‌నుంది. ప్రస్తుతం 2-2తో సిరీస్‌ని స‌మం చేసిన భారత్ ఇవ్వాల జ‌ర‌గ‌బొయే ఆఖ‌రి మ్యాచ్ సైతం గెలిచి ఈ సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

మరోవైపు విండీస్‌ కూడా ఈ మ్యాచ్‌లోనే టీమిండియాను ఓడించి సిరీస్‌ దక్కించుకోవాలని ఆతృతగా ఉంది. ఓవరాల్‌ గా ఈ మ్యాచ్ సిరీస్ విన్న‌ర్ ఎవ‌రు అనేది ఆదివారం తేల‌నుంది..దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లు కీలకంగా మారింది....

ఈ నెల 18 న అభివృద్ధి పనులకు శ్రీకారం – గంగుల కమలాకర్

కరీంనగర్ లో వంద కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులు ఆగస్టు 18 న ప్రారంభిస్తున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ, ఎవరు ఎక్కడ రోడ్ లేదని వచ్చిన మంజూరు చేస్తామనీ. అన్నారు. .

స్వాతంత్ర దినోత్సవం రోజు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఫుడ్ ఫెస్టివల్ తో పాటు కల్చరల్ పోగ్రాం లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతంలో రోడ్డు లేని గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఆగస్ట్ 16 న 600 మందికి బి సి బందు, 1100 మందికి దళిత బంధు ఇవ్వనున్నామని తెలిపారు విలేకరుల సమావేశంలో మేయర్ సునీల్ రావు, బి ఆర్ ఎస్ నగర ఆశ్యక్షుడు హారిశంకర్ తదితరులు పాల్గొన్నారు...

Minister Karumuri: గెలిచే సత్తా లేక తప్పుడు కూతలు కూస్తున్నారు..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సన్మాన సభలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదవులకు చట్ట సభల్లో అత్యధిక స్థానాలు ఇచ్చింది వైసీపీనేనని గుర్తు చేశారు..

రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు యాదవులే ఉన్నారని ఆయన తెలిపారు. యాధవులను గౌరవించింది జగన్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కష్టాల్లో తమ వెంట ఉంటా, అందరివాడిగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు..

గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు.

పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. చంద్రబాబు, పవన్ లకు ప్రజలే బుద్ది చెప్పుతారని మంత్రి కారుమూరి అన్నారు. మరోవైపు వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చడం పవన్ అవివేకం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు..

వేములవాడలో మహిళపై దొంగల దాడి

వేములవాడ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు.

భగవంత రావు నగర్ లోని పిల్లి శ్రీలత చిన్న కిరాణా కొట్టు నడిపిస్తూ జీవనోపాధి పొందుతోంది. సదరు మహిళ భర్త శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్ళగా, చిన్న కూతురు హైదరాబాదులో విద్యనుభ్యసిస్తుండగా సదరు మహిళా శ్రీలత ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.

వివరాల్లోకి వెళితే ఆదివారం తెల్లవారుజామున శ్రీలత నివాసముండే ఇంట్లోకి సుమారు నాలుగు గంటలకు రాడ్ తో అనుమానితుడు ఇంటి ఆవరణలోకి చొరబడ్డాడు. ఏదో శబ్దం అయినట్లుగా అనిపించి గృహిణి పిల్లి శ్రీలత బయటకు వచ్చింది.

కాంపౌండ్ ఆవరణలోనే రాడుతో దాగి ఉన్న నిందితుడు ఒక్కసారిగా ఆమెపై రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు.అప్రమత్తమైన సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటిస్తూ అరుపులు కేకలు వేసింది. పెనుగులాటలో సదర్ దొంగ మెడలోని బంగారు చైన్లు లాగేందుకు ప్రయత్నించగా పుస్తెలతాడు కింద పడిపోగా మరో ఏడు గ్రాముల బంగారం చైన్ మాత్రం నిందితుడు లాక్కెళ్లినట్టుగా బాధితురాలు తెలిపింది.

సదరు దొంగ దాడి వ్యవహారం ఇంటి ఆవరణలో బిగించిన సీసీ కెమెరాలు దృశ్యాలు రికార్డు కావడంతో మహిళలపై దాడులకు ప్రయత్నిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.వేములవాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు....

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అపరచితుడు

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి ఓ ప్రయాణికుడు బయటకు వచ్చాడు.

హైదరాబాద్ వైపు వెళ్తున్న టాక్సీ పార్కింగ్‌లో అనుమానాస్పదంగా వేరే వ్యక్తులతో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు

ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద ఒక కిలో బంగారు ఆభరణాలు చూసి ఇంటలిజెన్స్ అధికారులు ఆశ్చర్యపోయారు.

అతనిని విచారించగా జెడ్డా నుంచి వచ్చానని చెప్పాడు. అయితే విచారణ నిమిత్తం ఆ వ్యక్తిని ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు తిరిగి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. పూర్తి సమాచారం అందవలసి..