madagoni surendar

May 09 2023, 18:42

నల్గొండ జిల్లా:నార్కట్ పల్లి:సుడిగాలి పర్యటన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

సుడిగాలి పర్యటన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సుడిగాలి పర్యటన చేసారు, ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఆయన పర్యటించారు, కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు, మునుపెన్నడూ లేని విధంగా కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని, పార్టీలకతీతంగా పూర్తి మద్దతు తెలుపుతామని ఎమ్మెల్యే చిరుమర్తి తో వారు అన్నారు..

madagoni surendar

May 09 2023, 18:19

నల్గొండ జిల్లా :పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

.

నకిరేకల్ మున్సిపాలిటీ సిబ్బంది వంటేపాక పెద్ద లింగయ్య ఆనారోగ్యంతో మరణించడంతో మృతదేహానికి పులా మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి *రూ.20 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసి. అనంతరం.

కట్టంగూర్ మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన బండారు నర్సింహా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మృతదేహానికి పులా మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.25 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,వారి వెంట నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,కట్టంగూర్ జెడ్పీటీసీ తరాల బలరామ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊట్కురి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవిన్, ఉపేందర్,శీను,బండరు సత్తయ్య,ఊట్కురి మల్లేష్, సైదులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

May 09 2023, 18:07

నల్గొండ జిల్లా:నకిరేకల్:కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య. జన్మదిన వేడుకలు

నా జీవితమే.. పేదల కోసం..ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తా టీపీసీసీ ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య స్పష్టం నకిరేకల్ లో వైభవంగా జన్మదిన వేడుకలు వేలాదిమంది అభిమానులు శుభాకాంక్షల వెల్లువ

.

Streetbuzz న్యూస్. నల్గొండ జిల్లా :

నకిరేకల్: తన జీవితం ప్రజసేవకే అంకితమని, పేదల మధ్య ఉండి సేవచేయడమే తన లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు కొండేటి మల్లయ్య జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్ చేసి స్వీట్లు అభిమానులకు స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే తన జన్మదిన వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుపుకుంటానని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కేతేపల్లి మండలంలో జఠంగి వెంకటనర్సయ్య, కట్టంగూరులో సుకంరబోయిన నర్సింహ యాదవ్, ముక్కామల శేఖర్ ఆధ్వర్యంలో, చిట్యాలలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రామన్నపేట జమీర్, సాల్వేర్ అశోక్, ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కాగా, నకిరేకల్ క్యాంపు కార్యలయంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జటంగి రామనర్సయ్య యాదవ్, లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, రాచకొండ లింగయ్య, యాస కర్ణాకర్ రెడ్డి, బొప్పని యాదగిరి, పల్ రెడ్డి ఉపేందర్ రెడ్డి, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, కొండ భాస్కర్, కొండ అంజమ్మ, సురిగి జ్యోతి, ఆవుల వేణు, మధు, కేతేపల్లి, కట్టంగూరు, నార్కెట్ పల్లి,చిట్యాల,రామన్న పెట,నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గుడివాడ శివాలయంలో కొండేటి పూజలు

కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని శివాలంయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య తన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ద్వారా స్వామివారికి అభిశేకం నిర్వహించారు. నియోజకవర్గం ప్రజలను ఆ దేవుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పన్నాల రాఘవరెడ్డి, యాసకర్ణాకర్ రెడ్డి, రాచకొండ లింగయ్య, బొప్పని యాదగరి, గుడి వాడ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగయ్య, మాజీ సర్పంచ్ లతీఫ్, వార్డుమెంబర్ సైదులు, మాజీ వార్డు మెంబర్ దస్తగిరి, నాగభూషణం, సతీష్, కదిరే శ్రవణ్, నారాయణ, వి. నర్సింహ, చారి, రమేష్, సాయిబాబా, సీతయ్య, రేపని సత్తయ్య, చంద్రశేఖర్, పి. సైదులు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

May 08 2023, 19:22

నల్గొండ జిల్లా .కట్టంగూర్:బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చెసిన కెసిఆర్ కి పాలాభిషేకం చెసిన.జెడ్పీటీసీ తరాల బలరామ్.

బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చెసిన కెసిఆర్ కి పాలాభిషేకం చెసిన.జెడ్పీటీసీ తరాల బలరామ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కురి ఎడుకోండలు 

కట్టంగూర్ మండలం కేంద్రంలో బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చెసిన. కెసిఆర్ కి బీ.ఆర్.ఎస్.పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం చెసిన.జెడ్పీటీసీ తరాల బలరామ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కురి ఎడుకోండలు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ, మాజీ ఉప సర్పంచ్ అంతటీ శీనువాస్,వార్డు మెంబర్స్ రెడ్డి పల్లి మనోహర్, అయితగోని సునిత సైదులు,మునుగోటి ఉత్తరయ్య,మన్నెం సైదమ్మ అంజయ్య,సర్పంచ్ పరశరాములు,మండల నాయకులు,పెద్ది బాలనరసింహ,మేకల రమేష్,పులిగిల్ల వెంకన్న, పోగుల తిరుమలేశ్,ఉపేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.....

madagoni surendar

May 08 2023, 19:15

నల్గొండ జిల్లా:పట్టణంలో సామాన్యుడిలా పర్యటన నిర్వహించిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

పట్టణంలో సామాన్యుడిలా పర్యటన నిర్వహించిన. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

.

నిరంతరం నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలిలా పర్యటించే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు సోమవారం నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు హంగు ఆర్భాటాలు లేకుండా స్థానిక ప్రజలతో కలసి మార్నింగ్ వాక్ చేశారు అందులో భాగంగా ప్రజలను ఆప్యాయంగా పలుకరించి వారితో కాసేపు ముచ్చటించారు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చర్చించారు స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు పిల్లలకు క్రీడ సామగ్రి ఇప్పిస్తానన్నారు ఇండోర్ స్టేడియంలో పైకప్పు రేకులు ఊడిపోవడంతో కొత్తవి ఏర్పాటు చేస్తానన్నారు వాకింగ్ ట్రాక్ కు మట్టి పోపిస్తానన్నారు పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం బార్బర్ షాప్ కి వెళ్లి సామాన్యుడిలా షేవింగ్ చేసుకున్నారు.

ఆపత్కాలంలో ఆపద్బాంధవుడు సీఎం కెసిఆర్. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

రాష్ట్రంలోని పేద ప్రజలు ఆపత్కాలంలో ఉన్నపుడు ఆదుకునే ఆపద్బాంధవుడు సీఎం కెసిఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు సోమవారం నాడు నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మంది లబ్దిదారులకు రూ.12 లక్షల 50 వేల రూపాయిల సిఎం సహాయ నిధి చెక్కులను మంజూరు చేయించి బాధిత కుటుంబాలకు తన చేతుల మీదుగా పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలకు విలువిచ్చి వారి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు ప్రాణపాయ స్థితిలో ఉండి వైద్య ఖర్చులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజల కోసం అండగా నిలుస్తానని పేర్కొన్నారు.

madagoni surendar

Apr 29 2023, 18:31

నల్గొండ జిల్లా:నకిరేకల్:స్వగ్రామంలో బొడ్రాయి పండగకు ఇంటిబిడ్డగా హాజరైన.బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి*

స్వగ్రామంలో బొడ్రాయి పండగకు ఇంటిబిడ్డగా హాజరైన.బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

చిట్యాల మండలంలోని వట్టిమార్తి గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగ కు శనివారం బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ఇంటిబిడ్డగా హాజరై బొడ్రాయి పండుగకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని మేడి కి చీర సారె పెట్టి ఆశీర్వదించారు.గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బొడ్రాయి మహోత్సవ కార్యక్రమం ఆహ్వానం మేరకు ప్రియదర్శిని మేడి వచ్చి బొడ్రాయి ఉత్సవంలో పాల్గొని గ్రామస్తుల్లో నూతన ఉత్సాహాన్ని తెచ్చారు. ప్రియదర్శిని మేడి రావడంతో కార్యకర్తలు కూడా అంతే నూతనోత్సాహంతో బొడ్రాయి ఉత్సవంలో పాల్గొన్నారు.గ్రామ నాయకులు స్వాగతం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు పూజారులు ఆహ్వానం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రియదర్శిని మేడి తో ప్రత్యేక పూజలు చేయించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య,గ్రామస్తులు మేడి శ్రీను, మేడి విరస్వామి, మేఖం శేఖర్, నందిపాటి హరీష్ బిఎస్పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 29 2023, 18:26

కర్ణాటక లో కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 కే గ్యాస్ సిలిండర్,మహిళలకు ఉచిత ఆర్టీసి ప్రయాణం*

కర్ణాటక లో కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 కే గ్యాస్ సిలిండర్,మహిళలకు ఉచిత ఆర్టీసి ప్రయాణం

పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్న బిజెపికి బుద్ది చెప్పాలి

మాస్కి నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన సీతక్క

.

.

కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మస్కి నియోజక వర్గం లోని జులదరాసి క్యాంప్

గాలి దుర్గమ్మ క్యాంప్,హిరే దీన్ని క్యాంప్,మలదగుడ్డ క్యాంప్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బసన్ గౌడ గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

madagoni surendar

Apr 26 2023, 21:35

నల్గొండ జిల్లా:కట్టంగూర్:ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.

*ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

★సభ్యత కార్యక్రమం తో టిడిపిలో జోష్..

★రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి గద్దపాటి వెంకటేశ్వర్లు..

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఇంటింటికీ తెలగుదేశం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గద్దపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యం లో బుధవారం నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండల కేంద్రంలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి యాతకుల అంజయ్య, భువనగిరి పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి నూకల శ్రీధర్ రెడ్డి హాజరైయ్యారు, కట్టంగూర్ మండల కేంద్రంలో ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలు చేయించారు.

ఈ సందర్భంగా గద్దపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...

తెలుగు జాతి ఉన్నత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచిందని అలాగే నియోజవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృధి, సంక్షేమాన్ని ప్రచారం చేసి, ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని,సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తునామన్నారు, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

madagoni surendar

Apr 26 2023, 19:43

నల్గొండ జిల్లా:క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న మూట అరెస్ట్. పోలిసుల మెరుపు దాడి లో తొమ్మిది మంది రిమాండ్..

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న మూట అరెస్ట్.

పోలిసుల మెరుపు దాడి లో తొమ్మిది మంది రిమాండ్..

Streetbuzz NeWS.నల్గొండ జిల్లా :

.

1కోటి 12 లక్షల రూ.. నగదు, రెండు కార్లు

30 లక్షల విలువ గల 14 సెల్ ఫోన్లు, స్వాధీనం

చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

నల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు..

శనార్తి తెలంగాణ/నల్లగొండ:

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నా 9 మంది ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వ రావు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలిస్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో తెలిపారు..

వీరి వద్ద నుండి 1 కోటి 12 లక్షల రూపాయల నగదు, రెండు కార్లు, 30 లక్షల విలువ గల 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు..

ఈనెల 25న మిర్యాలగూడ పరిధిలో మయూరి నగర్ హౌసింగ్ బోర్డు లోని ప్లాట్ నెంబర్ 303 సాయి దత్త అపార్ట్మెంట్లో చట్ట విరుద్ధమైన క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు,

సమాచారం మేరకు మిర్యాలగూడ 1 టౌన్ సిఐ రాఘవేందర్, ఎస్సై శివతేజ, కట్టంగూర్ ఎస్సై దాచేపల్లి విజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ పోలీసులు మూకుమ్మడిగా మెరుపు దాడి చేశారు..

అపార్ట్మెంట్ లోకి ప్రవేశించి ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్లు బంటు రాకేష్, కొల సాయి కూమార్,జీవన్, సత్యనారాయణ, శాఖమూరి ఉదయ్, బంటు సంతోష్, గంధం నవీన్, బంటు శివ, రాజేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించమన్నారు ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో కీలక వ్యక్తి ఏ వన్ అయినా బంటు రాజేష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తాడు, ఇతను టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్థిక్ బుక్‌ ఫైనల్ నుండి మెయిన్ లైన్ యాక్సిస్ ని తీసుకున్నాడు, ఈ లింకును తన బామ్మర్ది అయిన కోల సాయికుమార్ కు ఫార్వర్డ్ చేసి ఇట్టి యాప్ ద్వారా మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసి ఆన్లైన్ లో చాలామందికి ఆన్లైన్ కమిషన్ ద్వారా పైన తెలిపిన వ్యక్తుల సహాయంతో ఈ నెట్వర్క్ లో జాయిన్ చేసుకొని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పెడుతూ సులభంగా డబ్బు సంపాదిస్తారు..

ఈ కేసును చాకచక్యంగా డిఎస్పి వెంకటగిరి పర్యవేక్షణలో వన్టౌన్ సిఐ రాఘవేందర్, కట్టంగూర్ ఎస్సై విజయ్ కుమార్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఎస్ఐ శివతేజ, పలువురు కానిస్టేబుల్స్ ని జిల్లా ఎస్పీ అభినందించారు..

madagoni surendar

Apr 26 2023, 19:22

నల్గొండ జిల్లా:కేతేపల్లి:రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.బుధవారం కేతపల్లి మండలం గుడివాడ గ్రామంలో 

మంగళవారం అకాల వర్షానికి పంట నష్టపోయిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా.                    

ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ...                      

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారురాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి తెలిపారు.ఈ మద్యనే కురిసిన ఆకాల వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వమని రాష్ర్టంలో ఉందన్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు నష్టపోయిన వడ్ల మార్కెట్లను సందర్శించాలని ఆదేశించారు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, నకిరేకల్ జెడ్పిటిసి మాద ధనలక్ష్మి నాగేష్ గౌడ్, కట్టంగూర్ జడ్పిటిసి తరాల బలరాం,కేతేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మారం వెంక రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు రాచకొండ భద్రయ్య గౌడ్,గుడివాడ గ్రామ సర్పంచ్ కట్ట శ్రవణ్,ఉప సర్పంచ్ రాచకొండ సైదులు,వార్డ్ నెంబర్లు,సీనియర్ నాయకులు రాచకొండ పురుషోత్తం,వేములకొండ లింగయ్య,వేములకొండ యాదయ్య,రాచకొండ లింగయ్య,రాచకొండ జానయ్య, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.