నల్గొండ జిల్లా:నకిరేకల్:కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య. జన్మదిన వేడుకలు
నా జీవితమే.. పేదల కోసం..ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తా టీపీసీసీ ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య స్పష్టం నకిరేకల్ లో వైభవంగా జన్మదిన వేడుకలు వేలాదిమంది అభిమానులు శుభాకాంక్షల వెల్లువ
.
Streetbuzz న్యూస్. నల్గొండ జిల్లా :
నకిరేకల్: తన జీవితం ప్రజసేవకే అంకితమని, పేదల మధ్య ఉండి సేవచేయడమే తన లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు కొండేటి మల్లయ్య జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్ చేసి స్వీట్లు అభిమానులకు స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే తన జన్మదిన వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుపుకుంటానని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కేతేపల్లి మండలంలో జఠంగి వెంకటనర్సయ్య, కట్టంగూరులో సుకంరబోయిన నర్సింహ యాదవ్, ముక్కామల శేఖర్ ఆధ్వర్యంలో, చిట్యాలలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రామన్నపేట జమీర్, సాల్వేర్ అశోక్, ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కాగా, నకిరేకల్ క్యాంపు కార్యలయంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జటంగి రామనర్సయ్య యాదవ్, లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, రాచకొండ లింగయ్య, యాస కర్ణాకర్ రెడ్డి, బొప్పని యాదగిరి, పల్ రెడ్డి ఉపేందర్ రెడ్డి, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, కొండ భాస్కర్, కొండ అంజమ్మ, సురిగి జ్యోతి, ఆవుల వేణు, మధు, కేతేపల్లి, కట్టంగూరు, నార్కెట్ పల్లి,చిట్యాల,రామన్న పెట,నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గుడివాడ శివాలయంలో కొండేటి పూజలు
కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని శివాలంయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య తన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ద్వారా స్వామివారికి అభిశేకం నిర్వహించారు. నియోజకవర్గం ప్రజలను ఆ దేవుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పన్నాల రాఘవరెడ్డి, యాసకర్ణాకర్ రెడ్డి, రాచకొండ లింగయ్య, బొప్పని యాదగరి, గుడి వాడ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగయ్య, మాజీ సర్పంచ్ లతీఫ్, వార్డుమెంబర్ సైదులు, మాజీ వార్డు మెంబర్ దస్తగిరి, నాగభూషణం, సతీష్, కదిరే శ్రవణ్, నారాయణ, వి. నర్సింహ, చారి, రమేష్, సాయిబాబా, సీతయ్య, రేపని సత్తయ్య, చంద్రశేఖర్, పి. సైదులు, తదితరులు పాల్గొన్నారు.
May 09 2023, 18:07