Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం.. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కు.. : ఈడీ

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) బయటపెట్టింది..

రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ కేసులో అన్వర్ దేబర్‌ను నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి కోర్టు ఆదేశించింది. అన్వర్ కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ నగర మేయర్ ఐజాజ్ దేబర్‌కు సోదరుడే.

ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సోదాల్లో కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది.

2019 నుంచి 2022 మధ్య కాలంలో దాదాపు రూ.2,000 కోట్ల మేరకు అవినీతి, మనీలాండరింగ్ జరిగినట్లు వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో అన్వర్ దేబర్ నాయకత్వంలో వ్యవస్థీకృత క్రిమినల్ సిండికేట్ పని చేస్తోంది.

అన్వర్ సాధారణ ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ, అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు, సీనియర్ బ్యూరోక్రాట్ల కోసం ఆయన పని చేశాడు. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం సీసాకు చట్టవిరుద్ధంగా సొమ్మును వసూలు చేసే విస్తృత స్థాయి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు..

Karnatka Elections: మోదీ..మోదీ.. నినాదాలతో హోరెత్తిన రోడ్‌షో..

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారం మరి కొద్ది గంటల్లోనే ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బెంగళూరు సిటీలో భారీ రోడ్‌షోలో (Roadshow) పాల్గొన్నారు..

ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ...మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు. తిప్పసండ్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రం నుంచి ప్రారంభమైన రోడ్‌షో ట్రినిటీ రోడ్‌ వద్ద ముగిసింది. గంటన్నర వ్యవధిలో 8 కిలోమీటర్ల మేరకు రోడ్‌షో జరిగింది.

తొలుత, బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఈస్ట్, సెంట్రల్ బెంగళూరులోని సుమారు అరడజను అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రోడ్‌షా సాగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనంలో మోదీ ఈ యాత్ర సాగించారు. ఆయన వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ కూడా వాహనంలో ప్రయాణించారు. రోడ్లపైన, భవనాలపైన పెద్దసంఖ్యలో గుమిగూడిన ప్రజానీకానికి మోదీ అభివాదం చేయడంతో, అందుకు ప్రతిగా వారు...మోదీ మోదీ, భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు..

SB NEWS

పాట్నా హైకోర్టు స్టే బీసీలను కించపరచడమే...

--- బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్.

బీహార్‌లో కుల గణాంకాలపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడం బీసీల మనోభావాలను కించపరచడమేనని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టేకోలు దీపేందర్ మండిపడ్డారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

2021 సంవత్సరంలో జరగాల్సిన వెనకబడిన కులాల జనాభా లెక్కల సేకరణ కరోనా మహ్మమారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపక్షాలతో ప్రధాని మోదీని కలిసి కులగణాంకన జరపాలని విన్నవించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నేటికీ కులగణన చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేయాలని నిర్ణయించారని, దీనిపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడం భాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

1931లో నాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన జనాభా గణన కులాల వారీగా చేశారని, కానీ అప్పటి నుంచి నేటి వరకు కులగణన జరగలేదని వివరించారు. మండల కమీషన్ సిఫారసులో భాగంగా ఎస్సీ, ఎస్టీ తరహాలో ఓబీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

ఓబీసీలకు జరిగే అన్యాయంపై రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో బీసీలు ఏకమై... బీసీ జనాభగణనపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

Bihar | పెళ్లి వేడుకలో గాల్లోకి కాల్పులు జరిపిన సర్పంచ్ భర్త..

పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో ఓ సర్పంచ్ భర్త తుపాకీతో హల్ చల్ చేశాడు. పెళ్లి వేదికపై అటు ఇటు తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపి అందర్నీ భయభ్రాంతులకు గురి చేశాడు..

పాట్నా దిఘా పోలీసు స్టేషన్ పరిధిలోని నక్తా దియారా సర్పంచ్ భర్త విమల్ రాయ్.. ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక ఆ వేదికపై కొంత మంది మహిళలు డ్యాన్సులు చేస్తుండగా, విమల్ రాయ్ తన చేత్తో తుపాకీ పట్టుకుని హల్‌చల్ చేశాడు. గాల్లోకి మూడు, నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు.

అయితే అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. గతంలోనూ విమల్ రాయ్ ఇలాంటి ఘటనలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

SB NEWS

SB NEWS

NEET Exam 2023: దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రారంభం..

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ప్రారంభమైంది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది..

తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 40వేల మంది పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌,. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

సినీ డైరెక్టర్​గా మారిన తెలంగాణ మాజీ ఐఏఎస్ అధికారి

•శ్రియ ప్రధాన పాత్రలో ‘మ్యూజిక్ స్కూల్’ను తెరకెక్కించిన బియ్యాల పాపారావు

•తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ నెల 12న విడుదల

•నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్

సీనియర్ హీరోయిన్ శ్రియ, బాలీవుడ్ నటుడు షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ప్రకాష్ రాజ్, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మే 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఉంది. దీన్ని మాజీ ఐఏఎస్ బియ్యాల పాపారావు తెరకెక్కించడం విశేషం.

ఏపీ, తెలంగాణలో కీలక హోదాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన దర్శకుడిగా మారి ఈ సినిమాను తీశారని తెలిసి ఆశ్చర్యపోయానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చాలామందిలో బయటికి కనిపించని ప్రతిభ ఉంటుందని, అలాంటి వారిని మనం ప్రోత్సహించాలనే సందేశంతో ఈ చిత్రం తీసిన పాపారావుకు అభినందనలు తెలిపారు. ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా ఈవెంట్ వేదికగా తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని ఇళయరాజా గారిని రిక్వెస్ట్ చేస్తున్నానని కోరారు.

వెంటనే స్పందించిన ఇళయరాజా ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తే తాను రెండు వందల మంది ఇళయరాజాలను తయారుచేస్తానని చెప్పారు. ఐఏఎస్‌గా పనిచేసిన తర్వాత మెగా ఫోన్ పట్టుకోవడం తనకు చాలా కొత్తగా అనిపించిందని పాపారావు అన్నారు. పదకొండు పాటలు కావాలని ఇళయరాజా దగ్గరకు వెళ్తే వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఆయన మ్యూజిక్ చేయనంటే ఈ సినిమా ఉండేది కాదని పాపారావు చెప్పారు.

పదోతరగతి ఫలితాల్లో ఆరోతరగతి విద్యార్థి తన సత్తా చాటింది

ప్రతిభ ఉంటే తరగతితో సంబంధం లేదంటూ ఆ చిన్నారి నిరూపించింది. ఏకంగా ఆరో తరగతి చదువుతూనే, పదోతరగతి పరీక్షలు రాసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.

వివరాల్లోకి వెళ్లితే.. కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ముప్పల హేమ శ్రీ చదువులో అసమాన ప్రతిభ కనబరుస్తుంది.

దీంతో ఈమె టాలెంట్‌కు ఫిదా అయిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా హేమశ్రీ తెలివితేటలు పరీక్షించి టెన్త్ పరీక్షలు రాయడానికి అనుమతిచ్చారు. దీంతో శనివారం వెలువడిన ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాల్లో హేమ శ్రీ తన సత్తాచాటింది. 488 మార్కులతో ఔరా అనిపిస్తుంది. దీంతో ఈ చిన్నారి తెలివి తేటలు చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

SB NEWS

SB NEWS

Fake gang: సైబరాబాద్‌లో కల్తీ ముఠా. కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌..

HYD..

రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ..

ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కల్తీ సరుకులు తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు..

కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు..

వారి నుంచి సుమారు 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, లిటిల్ చాప్స్ అనే మ్యాంగో డ్రింక్ స్వాధీనం

చేసుకున్నారు..

కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు..

మనుషుల జీవితాలతో ఆడుకుంటూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఈ అక్రమార్కులు.. వెల్లుల్లిపాయల తొక్కను కూడా వదలడం లేదు..

యంత్రాల్లో కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయల పొట్టు వేసి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు..

ప్రకాశం ముండ్లమూరులో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో ఆదివారంనాడు ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి..

రెండు సెకన్ల పాటు భూమి కంపించింది..

భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్లలో నుండి భయంతో పరుగులు తీశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

కొత్తగా 2380 కరోనా కేసులు నమోదు..

ఢిల్లీ..

ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..

గడిచిన 24 గంటల్లో దేశంలో 2380 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,69,630 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 27,212 కు చేరింది..

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.06 శాతంగా ఉంది.ఇక దేశంలో 21 మంది చనిపోయారు..

SB NEWS

SB NEWS