సినీ డైరెక్టర్​గా మారిన తెలంగాణ మాజీ ఐఏఎస్ అధికారి

•శ్రియ ప్రధాన పాత్రలో ‘మ్యూజిక్ స్కూల్’ను తెరకెక్కించిన బియ్యాల పాపారావు

•తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ నెల 12న విడుదల

•నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్

సీనియర్ హీరోయిన్ శ్రియ, బాలీవుడ్ నటుడు షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ప్రకాష్ రాజ్, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మే 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఉంది. దీన్ని మాజీ ఐఏఎస్ బియ్యాల పాపారావు తెరకెక్కించడం విశేషం.

ఏపీ, తెలంగాణలో కీలక హోదాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన దర్శకుడిగా మారి ఈ సినిమాను తీశారని తెలిసి ఆశ్చర్యపోయానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చాలామందిలో బయటికి కనిపించని ప్రతిభ ఉంటుందని, అలాంటి వారిని మనం ప్రోత్సహించాలనే సందేశంతో ఈ చిత్రం తీసిన పాపారావుకు అభినందనలు తెలిపారు. ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా ఈవెంట్ వేదికగా తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని ఇళయరాజా గారిని రిక్వెస్ట్ చేస్తున్నానని కోరారు.

వెంటనే స్పందించిన ఇళయరాజా ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తే తాను రెండు వందల మంది ఇళయరాజాలను తయారుచేస్తానని చెప్పారు. ఐఏఎస్‌గా పనిచేసిన తర్వాత మెగా ఫోన్ పట్టుకోవడం తనకు చాలా కొత్తగా అనిపించిందని పాపారావు అన్నారు. పదకొండు పాటలు కావాలని ఇళయరాజా దగ్గరకు వెళ్తే వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఆయన మ్యూజిక్ చేయనంటే ఈ సినిమా ఉండేది కాదని పాపారావు చెప్పారు.

పదోతరగతి ఫలితాల్లో ఆరోతరగతి విద్యార్థి తన సత్తా చాటింది

ప్రతిభ ఉంటే తరగతితో సంబంధం లేదంటూ ఆ చిన్నారి నిరూపించింది. ఏకంగా ఆరో తరగతి చదువుతూనే, పదోతరగతి పరీక్షలు రాసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.

వివరాల్లోకి వెళ్లితే.. కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ముప్పల హేమ శ్రీ చదువులో అసమాన ప్రతిభ కనబరుస్తుంది.

దీంతో ఈమె టాలెంట్‌కు ఫిదా అయిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా హేమశ్రీ తెలివితేటలు పరీక్షించి టెన్త్ పరీక్షలు రాయడానికి అనుమతిచ్చారు. దీంతో శనివారం వెలువడిన ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాల్లో హేమ శ్రీ తన సత్తాచాటింది. 488 మార్కులతో ఔరా అనిపిస్తుంది. దీంతో ఈ చిన్నారి తెలివి తేటలు చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

SB NEWS

SB NEWS

Fake gang: సైబరాబాద్‌లో కల్తీ ముఠా. కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌..

HYD..

రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ..

ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కల్తీ సరుకులు తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు..

కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు..

వారి నుంచి సుమారు 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, లిటిల్ చాప్స్ అనే మ్యాంగో డ్రింక్ స్వాధీనం

చేసుకున్నారు..

కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు..

మనుషుల జీవితాలతో ఆడుకుంటూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఈ అక్రమార్కులు.. వెల్లుల్లిపాయల తొక్కను కూడా వదలడం లేదు..

యంత్రాల్లో కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయల పొట్టు వేసి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు..

ప్రకాశం ముండ్లమూరులో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో ఆదివారంనాడు ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి..

రెండు సెకన్ల పాటు భూమి కంపించింది..

భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్లలో నుండి భయంతో పరుగులు తీశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

కొత్తగా 2380 కరోనా కేసులు నమోదు..

ఢిల్లీ..

ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..

గడిచిన 24 గంటల్లో దేశంలో 2380 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,69,630 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 27,212 కు చేరింది..

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.06 శాతంగా ఉంది.ఇక దేశంలో 21 మంది చనిపోయారు..

SB NEWS

SB NEWS

సిద్దిపేట జిల్లాలో మంత్రుల పర్యటన

సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఆదివారం పర్యటించారు. కొండపాక మండలం దుద్దేడ గ్రామ శివారులో నూతన పశువైద్య కళాశాల భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొననున్నారు.అంతేకాకుండా పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

గూండాయిజం చేసినట్లు ప్రూవ్ చేస్తావా.. ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్

తాను గుండాయిజం చేసినట్లు ఆరోపణలు చేయడం కాదు.. ప్రూవ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు.

ఈ మేరకు పాడి కౌషిక్ రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసురుతున్నా.. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా?’ చెప్పాలని సవాల్ చేశారు. ఆరోపణలు చేయడం తగదని, తాను ఏం గూండాయిజం చేశానో చెప్పాలన్నారు. ‘‘నేను ఎవరినైనా కొట్టిన్నా? ఎవరినైనా తిట్టిన్నా? ఎవరి ల్యాండ్ అయిన కబ్జా చేసిన్నా? ఏం చేసినా? అని మండిపడ్డారు. తాను అక్కడ సెక్రటరీని తిట్టినట్లు ఒప్పుకున్నాడు.

ఎందకు తిట్టారంటే జూపాక విలేజ్‌లో మోరీ ప్రాబ్లం ఉందని ఒక ఐదారు సార్లు చెప్పిన.. పని చేయకపోతే ఏమంటారు? అని అన్నారు. పేద ప్రజలు, పేద మహిళలు అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పని చేయండని మంచిగా చెప్పాను అతను వినలేదన్నారు. వినకపోతే గట్టిగా చెప్పాలా వద్ద.. గట్టిగా చెప్పిన తర్వాతనే పరిష్కారం అయ్యిందన్నారు. సమస్య పరిష్కారం అవ్వడంతో నేడు జూపాక ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని పేర్కొన్నారు.

SB NEWS

SB NEWS

జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖల కలకలం

•పద్ధతి మార్చుకోకపోతే హతమారుస్తామంటూ హెచ్చరిక

బీర్పూర్ మండలంలో మావోయిస్టుల పేర వచ్చిన లేఖలు కలకలం రేపుతున్నాయి. మండలంలోని పలువురు ఎంపీటీసీలు సర్పంచ్ లతో పాటు మరి కొంతమంది ప్రజాప్రతినిధులను కలుపుకొని మొత్తం 28 మందికి లేఖలు అందినట్లు సమాచారం. మండలంలోని కొంత మంది నాయకులు అటవీ భూములను కబ్జా చేసి అమ్ముకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

అలాంటి వారు ఇప్పటకైనా పద్ధతి మార్చుకోవాలని.. లేని పక్షంలో ప్రజా కోర్టులో హతమరుస్తామని ఆ లేఖ సారాంశం. జగ్దళ్ పూర్ జిల్లా ఏరియా కమిటీ అని ముద్రించి ఉన్న లెటర్ హెడ్స్ పై గోదావరి బెల్ట్ ఏరియా మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్ పేరున లేఖలు వచ్చినట్లుగా తెలుస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రమే కాకుండా మండలంలోని ఓ ప్రభుత్వ అధికారికి కూడా లేఖ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

నక్సల్స్ కదలికలు ఏ మాత్రం లేని జగిత్యాల జిల్లాలో పలువురు నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరున వచ్చిన లేఖలు స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. లేఖలు నిజంగా మావోయిస్టులు రాశారా.. లేక ఎవరైనా ఆకతాయిల చేసిన పనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లేఖలు ఎక్కడ నుండి వచ్చాయని నిగ్గు తెల్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

SB NEWS

SB NEWS

మాదాపూర్‌లో కార్డెన్ సెర్చ్.. భారీగా మద్యం బాటిళ్లు సీజ్

నగరంలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మస్తాన్‌నగర్‌లో పోలీసులు శనివారం అర్ధరాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ శిల్పవళ్ళి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ లు, 11 సెర్చ్ పార్టీలు, దాదాపు 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేశారు.

తనిఖీలో భాగంగా నలుగురు పాత నేరస్తులను గుర్తించారు. అలాగే సరైన పత్రాలు లేని నాలుగు వెహికిల్స్, రెండు బెల్టు షాపులు గుర్తించి 400 కాటన్ల మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా డీసీపీ శిల్పవళ్ళి మాట్లాడుతూ... మస్తాన్ నగర్‌లో 11 సెర్చ్ పార్టీలు, 5 కటాఫ్ పార్టీలతో తనిఖీలు చేశామని చెప్పారు. అనుమానితులను, వెహికిల్స్‌ను, షాపులలో సెర్చ్ చేసినట్లు తెలిపారు.

రెండు బెల్టు షాపులు, అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న షాపును, క్రాకర్స్ నిల్వ ఉంచిన షాపును గుర్తించామన్నారు. 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్ చేసినట్లు చెప్పారు. నలుగురు పాత నేరస్తులను గుర్తించి వారి పరిస్థితి తెలుసుకున్నామని డీసీపీ తెలిపారు..

SB NEWS

సీఎం ప్రయివేట్ సెక్రటరీ రిక్రూట్‌మెంట్ జీవో లీక్ చేసింది ఎవరు❓️

కేసీఆర్ సర్కారును ఎప్పడూ ఎదో ఓ టెన్షన్ వెంటాడుతూనే ఉంటున్నది. తాజాగా మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను కేసీఆర్ ప్రయివేట్ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ జీవో జారీ చేశారు.

ఈ జీవోను ఆన్‌లైన్‌లో ఉంచకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకున్నది. కానీ రెండు రోజులకే ఆ కాపీ బయటకు రావడంతో ప్రగతిభవన్ వర్గాలు షాక్ తిన్నాయి. అది కాస్త ప్రతిపక్షాల చేతికి చిక్కడంతో వారి నుంచి విమర్శలు మొదలయ్యాయి. జాగ్రత్తలు పాటించినా జీవో కాపీ ఎలా బయటకు వచ్చిందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ విషయం సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరి కాపీ ఎక్కడి నుంచి లీకైందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణ మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను సీఎం కేసీఆర్‌కు పర్సనల్ సెక్రటరీగా నియమించారు. ఆయనకు నెలకు రూ.లక్షన్నర వేతనం అదిస్తున్నట్టు ఈనెల 2వ తేదీన జోవో జారీ అయింది. ఆ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

జీవో కాపీని ఆన్‌లైన్‌లోనూ పెట్టలేదు. అంత వరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల అనంతరం ఆ జీవో కాపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతికి చేరింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఆ జీవో కాపీని బయటపెట్టారు. దీంతో ప్రగతిభవన్ వర్గాలు ఒక్క సారిగా షాక్ అయినట్టు సమచారం. సీక్రెట్‌గా ఉంచిన జీవో కాపీ ఎలా బయటకు విషయంలో అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.

SB NEWS