చీకట్లో జీవోలు

వివిధ శాఖల్లో పని చేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు 10 ప్రభుత్వ శాఖల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ఏప్రిల్‌ 30న రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నంబర్‌ 38ను జారీ చేసింది. వాస్తవంగా అయితే ఈ జీవో.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ అయిన http://goir.telangana.gov.inలో కనపడాలి. కానీ కనిపించట్లేదు.

ఐఏఎస్‌ అధికారులు కోరెం అశోక్‌రెడ్డి, బి.గోపి, ఆశిష్‌ సంగ్వాన్‌లను బదిలీ చేసి, పోస్టింగులిస్తూ ఏప్రిల్‌ 28న సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జీవో నంబర్‌ 613 జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎ్‌సలు కె.హైమావతి, ఎం.సత్య శారదా దేవి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని అందులోనే ఆదేశించింది. ఇదీ కనిపించుట లేదు.

మహారాష్ట్రకు చెందిన శరద్‌ మర్కడ్‌ను ముఖ్యమంత్రి ప్రైవేటు సెక్రటరీ(పీఎ్‌స)గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్‌ 647 జారీ చేసింది. ఈ జీవోను మే 2న జారీచేసినట్లు పేర్కొన్నప్పటికీ... శుక్రవారం (5న) వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటకు వచ్చింది.

..ఇలా చెప్పుకొంటూ పోతే మరెన్నో! తప్పనిసరిగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సిన ఇలాంటి జీవోలు చాలానే సర్కారీ వెబ్‌సైట్‌లో కనిపించట్లేదు. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా జీవో రూపంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ, పలు ముఖ్యమైన జీవోలను ప్రభుత్వం దాచిపెడుతోంది. ఇప్పుడే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం తీరు ఇలాగే ఉంది. ప్రభుత్వ పథకానికి సంబంధించినవి, భూసేకరణ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బదిలీలు, నియామకాలు, నిధుల విడుదల, ఉద్యోగాలకు అనుమతి, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా ప్రతి కీలకమైన జీవోను దాచి పెడుతోంది. వాట్సాప్‌ గ్రూపులు లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వాట్సాప్‌ గ్రూపు ద్వారామాత్రమే వాటిని బయటపెడుతోంది. అదీ ప్రభుత్వానికి ఇబ్బంది లేదనుకునే జీవోలను మాత్రమే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటకు తెస్తున్నారు. వివాదాస్పద జీవో అనుకుంటే.. దానిని అసలు బయటే పెట్టడం లేదని, ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

పారదర్శకత కోసం

పాలనలో పారదర్శకతే లక్ష్యంగా చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో పెట్టడం ప్రారంభించాయి. ఈ కోవలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా http://goir.telangana.gov.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో 32 శాఖలకు సంబంధించిన జీవోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ శాఖలన్నింటి నుంచీ కలిపి ఏటా 6000 నుంచి 8000 దాకా జీవోలు వెలువడుతుంటాయి. అయితే, వీటిలో.. ప్రభుత్వ పథకాలు, నిధుల మంజూరు, ముఖ్యమైన నియామకాలు, పదోన్నతులు, పదవీ విరమణలు, వివిధ కమిషన్ల ఏర్పాటు, ఐఏఎ్‌సలు, ఇతర అధికారుల బదిలీలు, పదవీ బాధ్యతల అప్పగింత, వివిధ రకాల అనుమతులు, ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు మార్పులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పోస్టుల భర్తీకి అనుమతులు వంటి అంశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన జీవోలను మాత్రం ప్రభుత్వం ఆ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేయట్లేదు.

హైకోర్టు సీరియస్‌

2014 జూన్‌ 2 నుంచి 2019 ఆగస్టు 15 వరకు మొత్తం 1,04,171 జీవోలు వెలువడగా.. వాటిలో 43,462 జీవోలను వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదంటూ 2019లో పేరాల శేఖర్‌రావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) వేశారు. దీనిపై హైకోర్టు సీరియస్‌ అయింది. ప్రజలకు తెలియాల్సిన జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారంటూ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)ను ప్రశ్నించింది. మిస్సింగ్‌ జీవోలన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అలాగే.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకానికి సంబంధించిన జీవోను సైతం వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంతో.. ‘వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిల్‌ వేసింది. దీనిపై 2021 ఆగస్టులో స్పందించిన హైకోర్టు... 24 గంటల్లో జీవోను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అయినా సర్కారు తీరులో ఎలాంటి మార్పూ లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 5 వరకు మొత్తం 35 రోజుల్లో దాదాపు 250 వరకు జీవోలు వెలువరించినట్లు సమాచారం. కానీ.. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ కలిగించని 163 రొటీన్‌ జీవోలు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు వచ్చేఅవకాశం లేని జీవోలు కాబట్టే వాటిని ప్రభుత్వం అప్‌లోడ్‌ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నేడు అమరరాజా పరిశ్రమకు KTR శంకుస్థాపన

నేడు మహబూబ్నగర్ జిల్లాలో అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ గిగా ప్లాంటుకు శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సస్టేనబుల్ మొబిలిటీకి తెలంగాణ కేంద్రంగా మారెందుకు ఇది గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు..

ఈ రంగంలో ఇండియాలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదొకటని తెలిపారు. ఇందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు అమర రాజా యజమాని గల్లా జయదేవ్ కు థాంక్స్ చెప్పారు. అలాగే, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో పలు నగరాల్లో ఐటీ టవర్లు నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ యోచన చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే మహబూబ్నగర్కు ఐటీ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు తలమానికం కానున్న ఐటి కారిడార్‌లో తొలి కంపెనీని ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు..

SB NEWS

SB NEWS

జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్ కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాజౌరిలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా.. శనివారం బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభం అయినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

బారాముల్లా ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఉగ్రవాదలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇరు పక్షాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.

ఇదిలా ఉంటే నిన్న ప్రారంభం అయిన రాజౌరి ఎన్‌కౌంటర్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. ముందుగా ఇద్దరు సైనికులు మరణించగా.. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు సైనికులు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

శుక్రవారం మరణించినవారిలో నలుగురు 9 పారా(స్పెషల్ ఫోర్సెస్)కి చెందిన కమాండోలు కాగా.. ఒకరు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్స్ కు చెందిన వారు. ఏప్రిల్ 20న పూంచ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భద్రతాబలగాలు ఉగ్రవాదులను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్ కౌంటర్లు ఓటు చేసుకుంటున్నాయి. బుధవారం నుంచి వరసగా నాలుగురోజులుగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.

అంతకుముందు గురువారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదులను స్థానికులుగా గుర్తించారు. వీరిద్దరు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నారు. షోఫియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ గా గుర్తించారు. 2023లో ఇద్దరూ ఉగ్రవాదంలోకి చేరారు. బుధవారం కుప్వారాలోని పిచ్‌నాడ్ మచిల్ సెక్టార్ సమీపంలో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం, కాశ్మీర్ పోలీసులు హతమార్చారు.

రేపే నీట్

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ పరీక్ష ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా నీట్‌కు 20,87,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

భారత్‌లో 499 నగరాలు, ఇతర దేశాల్లో 14 నగరాలు కలిపి మొత్తం 513 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుంది. ఈనెల 3 నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థుల అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి సుమారు 70 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 24 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది.

SB NEWS

SB NEWS

SB NEWS

3,096 మంది కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్

అర్ధరాత్రి జాయినింగ్ ఆర్డర్స్

3న ఆదేశాలు, 4న జాయిన్ అయినట్లు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎట్టకేలకు ఇంటర్ కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్ అయ్యారు. జిల్లా ల్లో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ వారంతా జాయినింగ్ ఆర్డర్లు తీసుకున్నా రు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ 2,909 మంది రెగ్యులర్, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లతో పాటు ముగ్గురు సీనియర్ ఇన్ స్ట్రక్టర్లను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం కాంట్రాక్టు లెక్చ రర్లకు ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో సాయంత్రం నుంచి కాంట్రాక్టు లెక్చరర్లు జాయినింగ్ ఆర్డర్స్ అందుకోగా, మిగిలిన జిల్లాల్లో అర్ధరాత్రి వరకూ వాటిని తీసుకున్నారు.

రెగ్యులరై జేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా డీఐఈఓ ఆఫీసులకు ఉదయమే రావాలని కాలేజీ ప్రిన్సిపల్స్, కాంట్రాక్టు లెక్చరర్లను ఆదేశిం చారు. దీంతో అన్ని జిల్లాల్లో ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు ఉదయమే అక్కడికి చేరుకున్నారు. కానీ, మల్టీజోన్ 1, మల్టీజోన్ 2కు ఆర్జేడీ అధికారి ఒక్కరే ఉండటం, ఆమె హైదరాబాద్ లో ఉండటంతో డీఐఈఓ, జిల్లా నోడల్ ఆఫీసర్లు అపాయింట్మెంట్ ఆర్డర్లను తీసుకుపోయేందుకు హైదరాబాద్ కు వచ్చారు.

వ్యక్తిగత ఆర్డర్లపై ఆర్జేడీ సంతకాలు చేయాల్సి ఉండడంతో ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. హైద రాబాద్ నుంచి జిల్లాలకు డీఐ ఈఓలు, నోడల్ ఆఫీ సర్లు వచ్చేందుకు అర్ధరాత్రి వరకూ టైమ్ అయింది. దీంతో ప్రిన్సిపల్స్, కాంట్రాక్టు లెక్చరర్లు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. డీఐఈఓలు ప్రిన్సి పాల్స్ ద్వారా కాంట్రాక్టు లెక్చరర్లకు జాయినింగ్ ఆర్డర్స్ అందించారు.

అయితే, 3న రెగ్యులరైజేషన్ ఆర్డర్స్, 4న జాయిన్ అయినట్లు ఉత్తర్వులిచ్చారని తెలిసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తుది తీర్పుకు లోబడి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి, గుట్టుచాటుగా ఇంటర్ అధికారులు అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేస్తు న్నారని ఓయూ జేఏసీ నేతలు గురువారం అర్థరాత్రి కమిషరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు.

ప్రాణం తీసిన ఇంస్టాగ్రామ్ వీడియో షూట్

ఇంస్టాగ్రామ్ వీడియో షూట్ చేస్తుండగా రైలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందినట్టు తెలిసింది

సనత్‌నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోలను రికార్డ్ చేస్తుండగా ఎక్ ప్రెస్ రైలు ఆకస్మాత్తు గా ఢీకొనడంతో సర్ఫరాజ్ అనే 16 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల ప్రకారం మరణించిన సర్పరాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శుక్రవారం వీడియోలు రికార్డ్ చేయడానికి సనత్‌నగర్ రైల్వే ట్రాక్‌కి వెళ్లాడు రైల్వే పట్టాలపై వీడియోలు షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు ..రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని స్నేహితులను కూడా పోలీసులు అదుపు తీసుకున్నట్టు తెలిసింది.

SB NEWS

SB NEWS

ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్

తెలంగాణలో ఎన్నికల సీజన్ దాదాపు వచ్చేసినట్లే.. పార్టీల అధినేతలు వరుస సమావేశాలు, బహిరంగ సభలతో బిజిబిజీగా గడుపుతున్నారు. మరోవైపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు ఎలా ప్లాన్ చేసుకోవాలనేదానిపై వ్యూహాలు రచిస్తున్నారు.

అభ్యర్థుల విషయంలో ఒక అడుగు ముందుకేసిన బీఆర్ఎస్ ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.. పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని మరికొందరు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో సీఎం ఇలా ఉంటే.. ఎంపీ అభ్యర్థులు గురించి మంత్రి కేటీఆర్ చూసుకుంటున్నారట. ఇందులో భాగంగానే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని కేటీఆర్ ప్రకటించేశారు.

శుక్రవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్నాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై పోటీచేసే అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్‌‌ను ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో బండిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘ బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ నాలుగేండ్లలో ఏం చేశాడో చెప్పే దమ్మందా..?. కరీంనగర్ ఎంపీ ఎవరంటే చెప్పుకోవడానికి నాకు సిగ్గు అవుతోంది. కరీంనగర్ ఎంపీగా మళ్ళీ వినోద్‌ను గెలిపించి.. బండి సంజయ్‌ను ఇంటికి పంపాలి. గత ఎన్నికల్లో వినోద్‌‌ను ఎంపీగా గెలిపించుకుంటే కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీ వచ్చేది.

.బండి సంజయ్.. ఓ గుడి, బడి, యూనివ‌ర్సిటీ కట్టలేదు. కేవలం మతాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదు’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాగా.. కేటీఆర్ ప్రకటనతో ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరు ఖరారైంది. కాగా ప్రస్తుతం వినోద్ తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ జాతీయ వ్యవహారాలన్నింటినీ వినోదే చక్క బెడుతున్నారని చెబుతుంటారు.

మొత్తానికి చూస్తే.. బండిపై ఎవరు పోటీచేస్తారా అనేదానిపై గత కొన్నిరోజులుగా సందిగ్ధత నెలకొంది. అంతేకాదు.. వినోద్ ఎమ్మెల్యేగా పోటీచేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే కేటీఆర్ తాజా ప్రకటనతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది

మందు బాబులకు గుడ్ న్యూస్...

•మద్యం ధరలు తగ్గింపు.

హైదరాబాద్: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు సర్కారు వెల్లడించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి.

ఫుల్‌ బాటిల్‌పై రూ.40, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్‌పై రూ.60 వరకు తగ్గించినట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చాయని తెలిపారు.

అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు అధికారులు తేల్చారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు ఆబ్కారీ అధికారులు వివరించారు.అయితే ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల కోసమే ఈ విధానం తెచ్చారని కొంతమంది అంటూన్నారు...

SB NEWS

SB NEWS

జమ్మూ కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు: ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. శనివారం రాజౌరి, బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. రాజౌరిలో ఇప్పటికే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది..

బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. 

రాజౌరిలోని కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు మరణించారు. జమ్మూ ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల బృందాన్ని ఏరివేసేందుకు భారత సైన్యం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి..

SB NEWS

SB NEWS

రైతులతో రాజకీయాలొద్దు సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ వార్నింగ్

తెలంగాణ లో ప్రతిపక్షాలు రైతులతో రాజకీయాలు చేయవద్దని పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి రైతులకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి మేము 10 వేలు ఇచ్చాము.. అలానే మీరు కూడా ఇప్పించండి కానీ అనవసరంగా ఆరోపణలు చేయకండన్నారు.

రైతు బిడ్డగా సీఎం కేసీఆర్‌కు అన్ని తెలుసని, ఇతరులు చెప్పాల్సింది ఏం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాదేనని, ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కూడా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. కేంద్రానికి ఎంత ధాన్యం వచ్చిన ధాన్యం పూర్తి అయ్యే వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఏప్రిల్ 15న కొనుగోలు స్టార్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు చెప్పిన దానికంటే ముందే స్టార్ట్ చేశారని పేర్కొన్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS