8 న ఇంటర్ ఫలితాలు? ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెల 8న ఇంటర్ ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. 10వ తేదీలోపు ఇంటర్ ఫలితాలను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఈక్రమంలోనే శని, ఆది, సోమవారాల్లో ఏదేని ఒక రోజు ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా శని, ఆదివారాల్లో ఫలితాలను ప్రకటించే అవకాశంలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో సోమవారం అంటే ఈనెల 8న ఇంటర్ ఫలితాలను ప్రకటించాలని అనుకుంటున్నట్లుసమాచారం. ఫలితాల్లో ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్ ఫలితాలను పకడ్బందీగా వెల్లడించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ఈక్రమంలోనే ఫలితాల వెల్లడిలో కాస్త సమయం తీసుకుంటుంది. ఒకటికి రెండు సార్లు మార్కుల నమోదు, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఫలితాలకు సిద్ధమవుతున్నారు. ఇంటర్ ఫస్ట్, సెంకడియర్ కలిపి మొత్తం 9.47లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
SB NEWS











May 05 2023, 16:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
35.8k