మొక్క జొన్న కు రెక్కలు
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు, మొక్క జొన్నలకు మద్దతు ధర రాని పరిస్థితులో ప్రభుత్వమే మక్కల కొనుగోలుకు కేంద్రాలను సిద్ధం చేస్తుండడంతో రైతుకు ఊరట కలుగుతోంది. ఇప్పటికే జిల్లా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రా రంభానికి సిద్ధమయ్యాయి.
మొక్కజొన్నలు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కు వ ధర పలుకుతుండడంతో మక్కల రైతులు ఆందోళనతో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరతో ఖరీదులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
దీంతో కొనుగోలు కేంద్రాల ప్రారంభమయ్యాయి ముందుగా బయ్యారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి త ర్వాత జిల్లాలోని ఇతర కేంద్రాల్లో ప్రారంభించడానికి జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటి వరకు రైతుల వద్దనున్న మొక్కజొన్నలను ఖరీదు చేపడుతారు.
కొనుగోళ్లు ఇలా..
కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మా ర్కెట్లలో గత మార్చి నెల నుంచి మక్కల ధరలు త గ్గుముఖం పట్టాయి. మక్కలు గత మార్చి నెలలో రూ.2078 నుంచి రూ.2100 వరకు ఉండగా ఏప్రిల్ నెలలో రూ.1749 నుంచి రూ.1849 వరకు ధరలు ప లికాయి. అత్యధికంగా రూ.1700తోనే అధికంగా మక్క లు కొనుగోలు చేశారు. దీంతో రైతులు ప్రభుత్వ మద్ద తు ధర రాక రైతులు నష్టపోయారు. ఇదే మార్కెట్ లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. దీంతో కేసీఆర్ స్పం దించి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగానే జిల్లాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు.
వ్యవసాయ పోర్టల్‌లో నమోదై ఉంటేనే..
రైతు సమగ్ర సమాచార పోర్టల్‌లో మొక్కజొన్నలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు నమోదు చేసుకుంటేనే రైతులకు మక్కల కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే వీలును ప్రభుత్వం కల్పించింది. దీని ద్వారా దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులు తమ వెంట పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డుతో వ్యవసాయ విస్తీర్ణ అధికారి వద్దకు వెళ్లి టోకెన్ తీసుకున్న తర్వాతనే మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తరలించాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం మక్కలకు తేమశాతంతో పాటు నాణ్యతగా ఉండేందుకు పూర్తిగా ఎండబెట్టి ఉంటేనే నిర్వాహకులు మక్కలను కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తా రు. ఆ తర్వాత నేరుగా రైతులకు రైతుబంధు ఖాతాల్లో ఆ ఆకౌంట్లలోనే ప్రభుత్వం నగదు జమ చేస్తుంది.
May 05 2023, 09:47