ఢిల్లీలో బి ఆర్ ఎస్ ఆఫీస్ నేడు ప్రారంభించునున్న సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది.

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు.

ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ రెండు రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌, కార్పొరేషన్ల చైర్మన్లు కోలేటి దామోదర్‌, దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, ఒడపల్లి మాధవ్‌ తదితరులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ ప్రారంభోత్స నేపథ్యంలో వసంత్‌విహార్‌ సమీప రోడ్లు, అశోక్‌రోడ్డు, తెలంగాణభవన్‌ పరిసరాల్లో కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆయా ప్రాంతాలన్నీ గులాబీమయమై కొత్త శోభను సంతరించుకున్నాయి. నూతన కార్యాలయంలో పార్టీ అధినేత చాంబర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌తోపాటు ప్రత్యేక గదులన్నింటినీ పూలతో అలంకరించారు.

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇప్పటికే కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీలో బి ఆర్ ఎస్ ఆఫీస్ నేడు ప్రారంభించునున్న సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు.

అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ రెండు రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌, కార్పొరేషన్ల చైర్మన్లు కోలేటి దామోదర్‌, దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, ఒడపల్లి మాధవ్‌ తదితరులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ ప్రారంభోత్స నేపథ్యంలో వసంత్‌విహార్‌ సమీప రోడ్లు, అశోక్‌రోడ్డు, తెలంగాణభవన్‌ పరిసరాల్లో కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

దీంతో ఆయా ప్రాంతాలన్నీ గులాబీమయమై కొత్త శోభను సంతరించుకున్నాయి. నూతన కార్యాలయంలో పార్టీ అధినేత చాంబర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌తోపాటు ప్రత్యేక గదులన్నింటినీ పూలతో అలంకరించారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇప్పటికే కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈడీ పొరపాటు, నేత కు క్షమాపణ

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దూకుడును పెంచింది. ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారిని విచారిస్తూ తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తోంది. కాగా ఈ కేసులో తాజాగా ఈడీ పొరపాటు చేయడం సంచలనంగా మారుతోంది. ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్‌లో ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును మార్చడం వల్ల గందరగోళంగా మారింది.

మామూలుగా ఈ స్కాంలో ప్రమేయం ఉందన్న కారణంగా ఢిల్లీ ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ పేరును కేసులో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ సింగ్ ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కాంతో అసలు సంబంధం లేని తన పేరును ఛార్జిషీట్‌లో చేర్చి.. తన ప్రతిష్టను దెబ్బతీశారని ఈడీకి లీగల్‌ నోటీసులు పంపారు. సంజయ్ సింగ్ ఏప్రిల్ 22న ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సింగ్‌లకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపారు, క్షమాపణలు చెప్పాలని లేదా సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాలని కోరారు.

దీంతో తప్పు తమవైపు నుంచే జరిగిందని ఈడీ అంగీకరించింది. సంజయ్‌ సింగ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ అది క్లరికల్ మిస్టేక్ వలన జరిగిందని ఆయనకు ఈ కేసుకు సంబంధం లేదని.. రాహుల్ సింగ్‌కు బదులుగా మా స్టాఫ్ సంజయ్ సింగ్ అని టైపు చేయడంతో ఈ సమస్య తలెత్తిందని ఈడీ అధికారిక లేఖను రాసింది. అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చరిత్రలో తొలిసారి ఈడీ క్షమాపణలు కోరుతూ తనకు లేఖ రాసిందని సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. దీనితో బాధ్యత కలిగిన స్థానంలో ఉండి ఇలాంటి పొరపాట్లు చేయడమేంటని ఈడీని అంతా విమర్శస్తున్నారు. పాలసీని రూపొందించినప్పుడు రాహుల్ సింగ్ ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్నారు. పార్టీని, నేతలను అప్రతిష్టపాలు చేసేందుకు సంజయ్ సింగ్ పేరును ఈడీ ఛార్జిషీట్‌లో ‘పీఎంఓ ఆదేశాల మేరకు’ ప్రస్తావించారని ఆప్ ఆరోపించింది.

ఢిల్లీ టూర్ వాయిదా❓️

తెలంగాణా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బుధవారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్తారని ప్రచారం జరిగింది. అందుకు తగిన ఏర్పాట్లను సైతం అధికారులు చేశారు. అయితే చివరి నిమిషంలో ఢిల్లీ టూర్ గురువారానికి వాయిదాపడింది. ఉదయమే బయల్దేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పంటనష్టంపై అధికారులతో సమీక్షల నేపథ్యంలో ఢిల్లీ టూర్ వాయిదాపడిందని విశ్వసనీయ సమాచారం.

ఢిల్లీలోని వసంత విహార్ లో 1,150 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఐదు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. కేసీఆర్ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. మొత్తం భవన్ లో 18 రూములు, కాన్ఫరెన్స్ హాల్ ఉండేలా నిర్మాణం చేపట్టారు. అతిథుల కోసం రెండు సూట్ రూములు కేటాయించారు.

ఆ భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించనున్నారు. ముందుగా రాజ్యశ్యామలయాగం, హోమం నిర్వహించనున్నారు. తెలంగాణ నుంచి 200ప్రతినిధులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ రోజు రాత్రి మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం

కారు’కు బ్రేకులు❓️

•బీఆర్‌ఎస్‌ పార్టీలో కుమ్ములాటలు

•సవాళ్లు విసురుకుంటున్న నేతలు

•ఆత్మీయ సంబురాల్లో అసమ్మతి జాడలు

•సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు

ఎన్నికలకు సమయాత్తమవుతున్న అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయి పనిచేసుకుంటున్నారు. టిక్కెట్‌ రేస్‌లో ఉన్న కొందరు నేతలు సిట్టింగ్‌లపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఇటీవల పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు అసలు ఈ సమావేశాలకే హాజరుకాలేదు. మరికొన్ని చోట్ల అసమ్మతి నేతలు హాజరైనప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. అనేక చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమకు గిట్టని నేతలకు ఆహ్వానాలు కూడా పంపలేదు.

మరో వైపు ఎలక్షన్‌ హీట్‌ పెరుగుతుండడంతో అధికార పార్టీలో కుమ్ములాటలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల నేతలు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి చెందిన వారే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌ (ఇపుడు బీఆర్‌ఎ్‌స)లో చేరడంతో అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ పాగా వేసింది. అయితే ఇపుడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లో సీనియర్లు, ఆశావహులు టిక్కెట్‌ కోసం సిట్టింగ్‌లతో పోటీపడుతున్నారు. స్థానికంగా పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌లకు టిక్కెట్‌ ఆశించే ఆశావహుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కూడా స్థానికంగా అసమ్మతి ఎదుర్కొంటున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, మరికొందరు నేతలకు అసలు పొసగడం లేదు. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు జడ్పీ చైర్మన్‌ సైతం హాజరుకాలేదు. ఇంతకు ముందు జరిగిన ఓ సమావేశంలో మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి మధ్య స్వల్ప వివాదం జరిగింది. సుధీర్‌రెడ్డి మైక్‌ను మంత్రి బలవంతంగా లాక్కోవడంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో సుధీర్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి డుమ్మా కొట్టారు. ఆయన వర్గం కూడా ఎవరూ హాజరు కాలేదు. అలాగే మహేశ్వరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సబితారెడ్డికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదు. కొన్ని నెలల కిందట తీగల కృష్ణారెడ్డి మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శించారు. తరువాత అధిష్ఠానం ఆయన్ని పిలిచి మందలించడంతో కొంత మెత్తబడ్డారు. కానీ ఆయన వర్గం ఇప్పటికీ సబితవర్గంతో ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. అలాగే తాండూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అసలు పొసగడం లేదు. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి సైతం మహేందర్‌రెడ్డి వర్గం హాజరు కాలేదు. ఈ సమావేశానికి మహేందర్‌రెడ్డి, ఆయన భార్య వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, తాండూరు మున్సిపల్‌ చైర్మన్‌ స్వప్న, బషీరాబాద్‌ జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, తాండూరు జడ్పీటీసీ మంజుల, యాలాల్‌ జడ్పీటీసీ సంధ్య, తాండూరు ఎంపీపీ అనితాగౌడ్‌, బషీరాబాద్‌ ఎంపీపీ కరుణ, డీసీసీబీ డైరెక్టర్‌ రవిగౌడ్‌తోపాటు సీనియర్‌ నేత కరణం పురుషోత్తమరావు సైతం ఈ కార్యక్రమానికి రాలేదు. ఇక వికారాబాద్‌ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు జతకట్టారు. మహేందర్‌రెడ్డి వర్గం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రామచంద్రారెడ్డి, ధారూర్‌ సొసైటీ మాజీ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, మర్పల్లి ఎంపీపీ లలిత డుమ్మా కొట్టారు. ఇక్కడ రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అలాగే పరిగిలో కూడా అధికార పార్టీలో అసమ్మతి పోరు నడుస్తోంది. పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, దోమ ఎంపీపీ అనసూయ హాజరుకాలేదు. కొడంగల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్‌రెడ్డి వర్గానికి పడడం లేదు. ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశానికి కొడంగల్‌ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి హాజరుకాలేదు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు రాజుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి పడడం లేదు. అలాగే మాజీ మంత్రి చిత్తరంజన్‌దా్‌స కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. షాద్‌నగర్‌లో కూడా అంజయ్య యాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి వర్గానికి పొసగడం లేదు. పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ప్రతా్‌పరెడ్డి వర్గం హాజరు కాలేదు.

దేశాధి నేతల నైనా కలవోచ్చు కానీ ఈ స్టేట్ చీఫ్ ను మాత్రం కలవలేం

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి స్పందించారు.

అభివృద్ధి అంటే ఒక్క కుటుంబం కోసం కాదని .. అందరూ అభివృద్ధి చెందాలన్నారు. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సి-20 సమాజ్‌శాల కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొంత మంది మాట్లాడుతారు కానీ పని చేయరు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ, ఈ స్టేట్‌ చీఫ్‌ని మాత్రం కలవలేం. నన్ను సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. ప్రగతి భవన్‌.. రాజ్‌భవన్‌ దూరంగా ఉంటున్నాయి’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.

నాలుగు ఇళ్ళలో పట్టపగలే చోరీ

పట్ట పగలే నాలుగు ఇళ్లలో దొంగలు చొరబడి కొంత నగదు బంగారమును దోచుకెళ్లిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బోల్లేపల్లి గ్రామంలో బుధవారం రోజున చోటుచేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బోల్లే పల్లి గ్రామానికి చెందిన ఓ వివాహ వేడుకకు హాజరు అయ్యేందుకు వారందరూ ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళారు.

ఇదే అదునుగా భావించిన దొంగలు ఎవరు లేని సమయం చూసి పట్ట పగలే గ్రామానికి చెందిన గోపు ఉపేందర్ రెడ్డి , వెంకట్ రెడ్డి , కంది యాకూబ్ రెడ్డి , తంగళ్ళపల్లి లలిత ఇళ్లలో చొరబడి 4 తులాల బంగారం మరియు రెండు లక్షల రూపాయల నగదు దోచుకెళ్ళినట్లు బాధితులు తెలిపారు.

ఈఘటనపై గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా ఈ మధ్య కాలం లో గూడూరు మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో మండల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే మండల ప్రజలు భయపడాల్సి వస్తుంది.

మేడారం మహా జాతరకు ముహూర్తం ఫిక్స్

2024 సంవత్సరంలో జరగబోయే మేడారం మహా జాతరకు సంబంధించి తేదీలను మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం పూజారులు ప్రకటించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పిలువబడే మేడారం మహా జాతర జరిగే తేదీలను బుధవారం ఖరారు చేశారు.

బుధవారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024మహా జాతర తేదీలను నిర్ణయించి ప్రకటించారు.

ఫిబ్రవరి 14న బుధవారం మండమేలగడం మొదలవుతుందని తెలిపారు. 21న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు చేరుకుంటారన్నారు. 22న సమ్మక్క దేవత గద్దెకు చేరుకుంటుందన్నారు. 23న భక్తులు మొక్కులు చెల్లించవచ్చన్నారు. 24న దేవతల వనప్రవేశం ఉంటుందన్నారు. 28న తిరుగువారం జాతర పూజలు ముగింపు ఉంటుందన్నారు.

Cyclone Mocha: ముంచుకొస్తున్న 'మోచా'.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..!

దిల్లీ: అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో పిడుగులాంటి వార్త. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను (cyclone) ముప్పు పొంచి ఉంది..

ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal)లో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. (Cyclone Mocha)

దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. ''మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముంది. ఈ తుపాను cyclone) ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది'' అని ఆయన తెలిపారు..

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు.. ఊపిరాడక ఇబ్బందులు

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువమంది వయస్సు మీద పడినవారే కావడంతో కొందరికి ఊపరి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో కేదార్‌నాథ్‌ను నిలిపివేశారు. అక్కడి నుంచి భక్తులు వీలైనంత తర్వగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాత్రలో దాదాపు 150 మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆలయ పరిసరాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో ఆలయ పరిసరాల్లో క్షణాల్లో వాతావరణం మారిపోతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.