బాణసంచా వెలుగుల్లో కాంతులీనిన కొత్త సచివాలయం..

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది..

సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి..

రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్‌ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది..

*SB NEWS*

నారా లోకేష్ పాదయాత్రలో జనసేన

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేరుకుంది..

ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పాదం కలిపారు. జనసేన, యువగళం జెండాలతో పాదయాత్రకు జనసేన నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసైనికులకు లోకేష్ అభివాదం చేశారు..

తాను ఎస్సీలను అవమానించినట్లు ఒక మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఎస్సీలను అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు..

నిరూపించలేకపోతే భారతీరెడ్డి తన పత్రిక, ఛానెల్ మూసేస్తారా? అని సవాల్ విసిరారు. తాను ఎస్సీలను అవమానించినట్లు చూపిన వీడియోలో చప్పట్లు కొడుతున్నారని, తాను అవమానిస్తే వారు చప్పట్లు కొడతారా? ఇంత చిన్న లాజిక్ ను భారతీరెడ్డి ఎలా మిస్ అయ్యారని లోకేష్ ప్రశ్నించారు..

Snakes Chameleon : మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఊసరవెల్లి..

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఒక ఊసరవెల్లి కలకలం రేపాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు..

ఒక మహిళా మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఏకే 13 విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు..

మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆమె లగేజ్ ను తనిఖీ చేశారు. మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసిన కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు..

పాములు పట్టే వారిని రప్పించి పాములను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేసి ఆమెపై కస్టమ్స్ చట్టంతోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..

అకాల వర్షాలకు నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి...

•వేముల గోపీనాథ్

జిల్లా వ్యాప్తంగా వరుసగా అకాల వర్షాలు కురుస్తుండడంతో ఐకెపి సెంటర్లలోకి వరద నీరు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు వేముల గోపీనాథ్ అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం గోపీనాథ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐకెపి ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి అకాల వర్షాలకు నష్టపోయిన రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలును ఆలస్యం చేయడం మూలంగా అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు అప్పు తెచ్చి పండించిన పంట చేతికందకపోవడంతో వనస్థాపానికి గురవుతున్నారని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

ప్రధాన రహదారుల వెంట గాలి దుమారానికి చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోతున్నాయని అధికారులు స్పందించి అలాంటి చెట్లను తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపోయిన ధాన్యాన్ని అంచనా వేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

Weather Update: రాబోయే రెండురోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు..

•తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అల్లాడిపోతున్నాయి.

మండు వేసవిలో అకాల వర్షాలు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి డా. బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు.

దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

సోమవారం కోనసీమ,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఎల్లుండి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

TS: గుడ్‌న్యూస్‌.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ..

హైదరాబాద్: నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది..

కాంట్రాక్టు ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణ దస్త్రంపై సీఎం కేసీఆర్‌ తొలి సంతకం చేశారు.

SB NEWS

Siddipet: టీఆర్‌ఎస్‌ పేరుతో మరో కొత్త పార్టీ..

•ఎన్నికల సంఘానికి సిద్దిపేటవాసి దరఖాస్తు..

సిద్దిపేట: టీఆర్‌ఎస్‌(తెలంగాణ రాజ్య సమితి) పేరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది.

తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్‌ కోసం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు.

రాష్ట్ర పార్టీ కార్యాలయం చిరునామాగా ఓల్డ్‌ అల్వాల్‌లోని ఇంటి నంబర్‌. 1-4-177/148, 149/201ను దరఖాస్తులో పేర్కొన్నారు..

కాగా, అదే గ్రామానికి చెందిన తుపాకుల మురళీకాంత్‌.. పార్టీ ఉపాధ్యక్షుడిగా, సదుపల్లి రాజు.. కోశాధికారిగా, వెల్కటూర్‌కు చెందిన నల్లా శ్రీకాంత్‌.. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే మే 27లోపు తమ కు తెలపాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 28న ఓ హిందీ పత్రిక, 29న ఇంగ్లిష్‌ పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ క్రమంలో అభ్యంతరాలొస్తే పరిశీలిస్తారు.

అనంతరం నిబంధనల మేరకు రాజకీయ పార్టీగా రిజిస్ట్రర్‌ చేస్తారు. కాగా, బాలరంగం 1983 నుంచి కేసీఆర్‌తోనే ఉన్నారు. 1987, 1995 సంవత్సరాల్లో సర్పంచ్‌గా, 2001లో ఆయన సతీమణి ఎల్లమ్మ సర్పంచ్‌గా, అప్పటి టీఆర్‌ఎస్‌ సిద్దిపేట మండల పార్టీ అధ్యక్షుడిగా, 2006లో జెడ్పీటీసీగా, 2019-2021 వరకు ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యునిగా పని చేశారు.

Mann ki Baat: ఏపీ రాజ్ భవన్ లో మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన..

రాజ్ భవన్ దర్బార్ హాల్లో ప్రధాని 100వ మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆల్ ఇండియా రేడియో నేతృత్వంలో మన్ కీ బాత్ ప్రదర్శన నిర్వహించారు..

మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్….ఈ సందర్భంగా ప్రముఖులు ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం.మన్ కీ బాత్ ద్వారా ప్రధాని ప్రజల్లో చైతన్యం రగిలించారు..

దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను ఎలా అధిగమించాలో ప్రధాని వివరిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రధాని నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం చాలా మందికి వ్యాక్సినేషన్ విషయంలో అవగాహన కలిగించిందన్నారు.

ఇవాళ నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసారం అయింది. దేశంతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది. మన్ కీ బాత్ వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు..

దళిత బంధులో కమిషన్లకు పాల్పడిన MLA ల కేసును హైకోర్టు సుమోటుగా స్వీకరించాలి.......

బకరం శ్రీనివాస్ మాదిగ

MSP జిల్లా సీనియర్ నాయకులు, నల్లగొండ నియోజకవర్గం ఇంచార్జ్.

దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను తక్షణమే బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యేల చిట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేయాలి. ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వారిని వచ్చే ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ....

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు MRPS, MSP ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.

కార్యక్రమాన్ని ఉద్దేశించి

ఎమ్మెస్పి జిల్లా సీనియర్ నాయకులు నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్

బకరం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ మాట్లాడుతూ...

దళిత బందులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉంది మీ అనుచరులు రెండు లక్షల నుండి 3లక్షల వరకు వసూలు చేసిన జాబితా కూడా నా దగ్గర ఉన్నది ఇలా మీరు డబ్బులు తీసుకోవడం కొత్త కాదని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే

మొన్న జరిగిన టిఆర్ఎస్ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇది మొదటిది కాదు మీ తోక కత్తరిస్తా అని మాట్లాడటం అన్ని తెలుగు ప్రధాన దినపత్రికల్లో వార్తా ప్రచురించారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒకసారి ఏసీబీకి దొరికితే ఇదే మొదటిసారి అని వదిలిపెట్టరు కదా!

మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి పార్టీ MlA లు అవినీతికి పాల్పడ్డారని తెలియజేశారు. కాబట్టి ఎమ్మెల్యేలు వసూలు చేసిన డబ్బులు తిరిగి బాధితులకు ఇప్పించాలని చీటింగ్ కేసు కింద నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇంకోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని లేనిపక్షంలో ఈ ఉద్యమం త్రివ్రతరం చేస్తామని మే రెండో తారీకు నుండి 9వ తారీకు వరకు నిరసన కార్యక్రమాలు రాస్తారోకలు, ధర్నాలు, దీక్షలు పదవ తారీకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు.

-------------------------------------------------

కార్యక్రమంలో ఎంఎస్పి నాయకులు కొమిరే స్వామి, మహిళా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, కందుల మోహన్, బొజ్జ దేవయ్య, దుబ్బ సత్యనారాయణ, కత్తుల సన్నీ, మాసారం వెంకన్న తలకొప్పుల రాజు, బూసిపాక రణవీర్, బొజ్జ నాగరాజు, బీపంగి అర్జున్, బుర్రి స్వామి, కంచి మహేష్, నితిన్ సాయి తదితరులు పాల్గొన్నారు.

AP News : ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

అమరావతి : ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జి అనంతరామును బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు..

జి జయలక్ష్మిని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. రజిత్ భార్గవను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రీడిసిగ్నేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీనితో పాటు టూరిజం, సాంస్కృతిక శాఖలకు ఫుల్ ఎడిషనల్ చార్జితో కొనసాగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోనూ ఆయనే చీఫ్ సెక్రటరీగా కొనసాగునున్నట్టు వెల్లడించారు.

మహ్మద్ ఇంతియాజ్‌ను మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జి లక్ష్మి షాను గ్రామ వార్డు విలేజ్ వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు..