TS: గుడ్‌న్యూస్‌.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ..

హైదరాబాద్: నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది..

కాంట్రాక్టు ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణ దస్త్రంపై సీఎం కేసీఆర్‌ తొలి సంతకం చేశారు.

SB NEWS

Siddipet: టీఆర్‌ఎస్‌ పేరుతో మరో కొత్త పార్టీ..

•ఎన్నికల సంఘానికి సిద్దిపేటవాసి దరఖాస్తు..

సిద్దిపేట: టీఆర్‌ఎస్‌(తెలంగాణ రాజ్య సమితి) పేరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది.

తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్‌ కోసం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు.

రాష్ట్ర పార్టీ కార్యాలయం చిరునామాగా ఓల్డ్‌ అల్వాల్‌లోని ఇంటి నంబర్‌. 1-4-177/148, 149/201ను దరఖాస్తులో పేర్కొన్నారు..

కాగా, అదే గ్రామానికి చెందిన తుపాకుల మురళీకాంత్‌.. పార్టీ ఉపాధ్యక్షుడిగా, సదుపల్లి రాజు.. కోశాధికారిగా, వెల్కటూర్‌కు చెందిన నల్లా శ్రీకాంత్‌.. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే మే 27లోపు తమ కు తెలపాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 28న ఓ హిందీ పత్రిక, 29న ఇంగ్లిష్‌ పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ క్రమంలో అభ్యంతరాలొస్తే పరిశీలిస్తారు.

అనంతరం నిబంధనల మేరకు రాజకీయ పార్టీగా రిజిస్ట్రర్‌ చేస్తారు. కాగా, బాలరంగం 1983 నుంచి కేసీఆర్‌తోనే ఉన్నారు. 1987, 1995 సంవత్సరాల్లో సర్పంచ్‌గా, 2001లో ఆయన సతీమణి ఎల్లమ్మ సర్పంచ్‌గా, అప్పటి టీఆర్‌ఎస్‌ సిద్దిపేట మండల పార్టీ అధ్యక్షుడిగా, 2006లో జెడ్పీటీసీగా, 2019-2021 వరకు ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యునిగా పని చేశారు.

Mann ki Baat: ఏపీ రాజ్ భవన్ లో మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన..

రాజ్ భవన్ దర్బార్ హాల్లో ప్రధాని 100వ మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆల్ ఇండియా రేడియో నేతృత్వంలో మన్ కీ బాత్ ప్రదర్శన నిర్వహించారు..

మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్….ఈ సందర్భంగా ప్రముఖులు ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం.మన్ కీ బాత్ ద్వారా ప్రధాని ప్రజల్లో చైతన్యం రగిలించారు..

దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను ఎలా అధిగమించాలో ప్రధాని వివరిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రధాని నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం చాలా మందికి వ్యాక్సినేషన్ విషయంలో అవగాహన కలిగించిందన్నారు.

ఇవాళ నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసారం అయింది. దేశంతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది. మన్ కీ బాత్ వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు..

దళిత బంధులో కమిషన్లకు పాల్పడిన MLA ల కేసును హైకోర్టు సుమోటుగా స్వీకరించాలి.......

బకరం శ్రీనివాస్ మాదిగ

MSP జిల్లా సీనియర్ నాయకులు, నల్లగొండ నియోజకవర్గం ఇంచార్జ్.

దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను తక్షణమే బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యేల చిట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేయాలి. ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వారిని వచ్చే ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ....

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు MRPS, MSP ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.

కార్యక్రమాన్ని ఉద్దేశించి

ఎమ్మెస్పి జిల్లా సీనియర్ నాయకులు నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్

బకరం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ మాట్లాడుతూ...

దళిత బందులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉంది మీ అనుచరులు రెండు లక్షల నుండి 3లక్షల వరకు వసూలు చేసిన జాబితా కూడా నా దగ్గర ఉన్నది ఇలా మీరు డబ్బులు తీసుకోవడం కొత్త కాదని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే

మొన్న జరిగిన టిఆర్ఎస్ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇది మొదటిది కాదు మీ తోక కత్తరిస్తా అని మాట్లాడటం అన్ని తెలుగు ప్రధాన దినపత్రికల్లో వార్తా ప్రచురించారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒకసారి ఏసీబీకి దొరికితే ఇదే మొదటిసారి అని వదిలిపెట్టరు కదా!

మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి పార్టీ MlA లు అవినీతికి పాల్పడ్డారని తెలియజేశారు. కాబట్టి ఎమ్మెల్యేలు వసూలు చేసిన డబ్బులు తిరిగి బాధితులకు ఇప్పించాలని చీటింగ్ కేసు కింద నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇంకోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని లేనిపక్షంలో ఈ ఉద్యమం త్రివ్రతరం చేస్తామని మే రెండో తారీకు నుండి 9వ తారీకు వరకు నిరసన కార్యక్రమాలు రాస్తారోకలు, ధర్నాలు, దీక్షలు పదవ తారీకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు.

-------------------------------------------------

కార్యక్రమంలో ఎంఎస్పి నాయకులు కొమిరే స్వామి, మహిళా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, కందుల మోహన్, బొజ్జ దేవయ్య, దుబ్బ సత్యనారాయణ, కత్తుల సన్నీ, మాసారం వెంకన్న తలకొప్పుల రాజు, బూసిపాక రణవీర్, బొజ్జ నాగరాజు, బీపంగి అర్జున్, బుర్రి స్వామి, కంచి మహేష్, నితిన్ సాయి తదితరులు పాల్గొన్నారు.

AP News : ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

అమరావతి : ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జి అనంతరామును బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు..

జి జయలక్ష్మిని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. రజిత్ భార్గవను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రీడిసిగ్నేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీనితో పాటు టూరిజం, సాంస్కృతిక శాఖలకు ఫుల్ ఎడిషనల్ చార్జితో కొనసాగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోనూ ఆయనే చీఫ్ సెక్రటరీగా కొనసాగునున్నట్టు వెల్లడించారు.

మహ్మద్ ఇంతియాజ్‌ను మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జి లక్ష్మి షాను గ్రామ వార్డు విలేజ్ వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు..

Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేదే మా నినాదం..

Nadendla Manohar Interesting Comments On Chandrababu Pawan Kalyan Meeting: జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు..

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేదే తమ విధానం, నినాదమని పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారని చెప్పారు. నిన్న చంద్రబాబుతో పవన్ జరిపిన చర్చల్లోనూ అదే కీలక అంశమని తెలిపారు.

భవిష్యత్‌లో వారి మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోందన్నారు. సీట్లపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, దాన్ని భరించలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో లా & ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని అన్నారు. తాను ఎక్కడ కాపురం పెడితే, అక్కడి నుంచే పరిపాలన అనే అభిప్రాయం కల్పించేలా సీఎం వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉందని విమర్శించారు. వైసీపీ వ్యతిరేకులంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి, దాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు..

పేద ప్రజల ఇండ్ల కొరకు తొలి సంతకం

నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలు పై నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్న మంత్రి కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి రేపు మంత్రి కే. తారకరామారావు అడుగుపెట్టబోతున్నారు.

నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు.

చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ రేపు అత్యంత కీలకమైన ఫైలుపైన మొదటి సంతకం చేయనున్నారు.

హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలు పైన మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు.

నూతన సచివాలయంలో సుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు. ఉదయం 5.50 గంటలకే రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఉదయం 6.15 గంటలకు సచివాలయానికి చేరుకున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్నారు.

అనంతరం అక్కడే జరిగే వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటున్నారు.

ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు..

ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి..

ఈ రోజు మధ్యాహ్నం నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు మొదలవనున్నాయి..

రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు అలాగే కొన్నిచోట్ల భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు..

ఇక ఈ రోజు రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉండనున్నాయి..

ఇవాళ రాత్రి, రేపు తెల్లవారు జామున కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి..

మే 1, 2 తేదీలలో ఎక్కువ చోట్ల భారీ ఉరుములు మెరుపులు పిడుగులు వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. 

RTC Bus | భద్రాచలంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ.. గాయపడిన 43 మంది..

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.

జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది.

దీంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 43 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం దవాఖానకు తరలించారు.