నల్గొండ జిల్లా:క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న మూట అరెస్ట్. పోలిసుల మెరుపు దాడి లో తొమ్మిది మంది రిమాండ్..
క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న మూట అరెస్ట్.
పోలిసుల మెరుపు దాడి లో తొమ్మిది మంది రిమాండ్..
Streetbuzz NeWS.నల్గొండ జిల్లా :
.
1కోటి 12 లక్షల రూ.. నగదు, రెండు కార్లు
30 లక్షల విలువ గల 14 సెల్ ఫోన్లు, స్వాధీనం
చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
నల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు..
శనార్తి తెలంగాణ/నల్లగొండ:
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నా 9 మంది ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వ రావు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలిస్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో తెలిపారు..
వీరి వద్ద నుండి 1 కోటి 12 లక్షల రూపాయల నగదు, రెండు కార్లు, 30 లక్షల విలువ గల 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు..
ఈనెల 25న మిర్యాలగూడ పరిధిలో మయూరి నగర్ హౌసింగ్ బోర్డు లోని ప్లాట్ నెంబర్ 303 సాయి దత్త అపార్ట్మెంట్లో చట్ట విరుద్ధమైన క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు,
సమాచారం మేరకు మిర్యాలగూడ 1 టౌన్ సిఐ రాఘవేందర్, ఎస్సై శివతేజ, కట్టంగూర్ ఎస్సై దాచేపల్లి విజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ పోలీసులు మూకుమ్మడిగా మెరుపు దాడి చేశారు..
అపార్ట్మెంట్ లోకి ప్రవేశించి ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్లు బంటు రాకేష్, కొల సాయి కూమార్,జీవన్, సత్యనారాయణ, శాఖమూరి ఉదయ్, బంటు సంతోష్, గంధం నవీన్, బంటు శివ, రాజేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించమన్నారు ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో కీలక వ్యక్తి ఏ వన్ అయినా బంటు రాజేష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తాడు, ఇతను టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్థిక్ బుక్ ఫైనల్ నుండి మెయిన్ లైన్ యాక్సిస్ ని తీసుకున్నాడు, ఈ లింకును తన బామ్మర్ది అయిన కోల సాయికుమార్ కు ఫార్వర్డ్ చేసి ఇట్టి యాప్ ద్వారా మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసి ఆన్లైన్ లో చాలామందికి ఆన్లైన్ కమిషన్ ద్వారా పైన తెలిపిన వ్యక్తుల సహాయంతో ఈ నెట్వర్క్ లో జాయిన్ చేసుకొని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పెడుతూ సులభంగా డబ్బు సంపాదిస్తారు..
ఈ కేసును చాకచక్యంగా డిఎస్పి వెంకటగిరి పర్యవేక్షణలో వన్టౌన్ సిఐ రాఘవేందర్, కట్టంగూర్ ఎస్సై విజయ్ కుమార్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఎస్ఐ శివతేజ, పలువురు కానిస్టేబుల్స్ ని జిల్లా ఎస్పీ అభినందించారు..
Apr 29 2023, 18:31