Modi: కాంగ్రెస్ నన్ను 91 సార్లు నిందించింది: ఖర్గే వ్యాఖ్యలకు మోదీ బదులు..
బెంగళూరు: 'నన్ను నిందించిన ప్రతిసారి, కాంగ్రెస్ పార్టీనే పతనమవుతోంది' అని ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) భగ్గుమన్నారు..
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ మాట అన్నారు. ఎన్నికల(Karnataka Elections 2023 ) ప్రచారంలో భాగంగా ప్రధాని ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్నారు.
'కాంగ్రెస్ మళ్లీ నన్ను నిందించడం ప్రారంభించింది. నన్ను నిందించిన ప్రతిసారి.. అది పతనమవుతోంది. కాంగ్రెస్ ఇప్పటికీ 91సార్లు నన్ను నిందించింది. దుర్భాషలాడే పని కాంగ్రెస్‌ను చేసుకోనివ్వండి. నేను మాత్రం కర్ణాటక(Karnataka) ప్రజల కోసం పనిచేస్తాను. వారు లింగాయత్ వర్గాన్ని నిందించారు.
అంబేడ్కర్, వీర్ సావర్కర్‌ను అవమానించారు. వారి నిందలకు ప్రజలు ఓట్లతో బదులిస్తారు. భాజపాపై ఎంత బురదచల్లితే.. కమలం అంతగా వికసిస్తుంది' అని కార్యకర్తలనుద్దేశించి మోదీ(Modi) అన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాదు.. ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌వన్‌గా చేయడానికని పేర్కొన్నారు. అలాగే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రం డబుల్ స్పీడ్‌తో దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు..











Apr 29 2023, 15:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
31.6k