రైతును కరుణించని వడగళ్ల వానలు

తెలంగాణలో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వడగాళ్ల వానలు పడుతున్నాయి. వడగాళ్ల వానతో పంట నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతుండగా.. పలు జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడగళ్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. ఈ మేరకు గురువారం రాత్రి హైదరాబాద్ వాతావరణశాఖ వెదర్ బులిటెన్ విడుదల చేసింది.

శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడతాయని స్పష్టం చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాలో కూడా పలుచోట్ల వర్షాలు పడతాయంది. ఇక 29వ తేదీ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొంది.

30వ తేదీ న ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెదర్ బులిటెన్‌లో పేర్కొంది.

మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఇక వచ్చే నెల 1వ తేదీ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.

ఈరోజు నుంచి పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం: దువ్వాడ రైల్వేస్టేషన్‌ మెయిన్‌ లైన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్న నేపథ్యంలో శనివారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రోజు నుంచి మే ఆరో తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), సికింద్రాబాద్‌-విశాఖ (12784),

ఈనెల 30 నుంచి మే ఏడో తేదీ వరకు విశాఖ-రాజమండ్రి పాసింజర్‌ (07467), రాజమండ్రి-విశాఖ పాసింజర్‌ (07468), కాకినాడ-విశాఖ (17267), కాకినాడ-విశాఖ పాసింజర్‌ (17268); విశాఖ-మచిలీపట్నం (17220); విశాఖ-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17283),

మే 5న పూరి-తిరుపతి (17479), తిరుపతి-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (22708), మే 5, 6వ తేదీల్లో తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ (17480), కాచీగూడ-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (12862),

మే 6న విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (22707), విశాఖ-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ (22701), విజయవాడ-విశాఖ (22702), బిలాస్‌పూర్‌-తిరుపతి (17481), సికింద్రాబాద్‌-విశాఖ (22204),

మే 6,7 తేదీల్లో విశాఖ-కాచీగూడ ఎక్స్‌ప్రెస్‌ (12861),

మే 7న విశాఖ-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను (22203) రద్దు చేశామని రైల్వే అధికారులు చెప్పారు...

ఘనంగా పూలే అంబేడ్కర్ జాతర

•ఆకట్టుకున్న సబ్బండ కులాల ప్రదర్శనలు

బహుజనుల జీవితాలలో అఖండ జ్యోతులు వెలిగించిన మహనీయులు పూలే అంబేద్కర్

అని కొనియాడిన వక్తలు

రాజ్యంగ వారసత్వాన్ని కొనసాగిస్తాం

విద్యతోనే మార్పు సాధ్యం

ప్రజాస్వామ్యానికి పునాది అంబేడ్కర్ ఆలోచనలు

ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జీవితాలలో అఖండ జ్యోతులు నింపిన మహనీయులు పూలే అంబేడ్కర్ అని మాజీ ఐఏఎస్ అంబేద్కర్ వాది జేబీ రాజు కొరియాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తొమ్మిది ఏండ్లుగా బడుగు బలహీన వర్గాలను రాజ్యాంగ పలాలకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్.బి.ఆర్ గార్డెన్ లో పూలే అంబేడ్కర్ జాతరను కెవిపిఎస్ మరియు సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలే అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ జాతరను సబ్బండ కులాల కళా నృత్యాలతో,డప్పు వాయిద్యాలతో,కోలాట బృందాలతో,డోలకిలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో నిర్వహించడం జరిగింది.

అఖండ విప్లవ జ్యోతులు పూలే అంబేడ్కర్

అంబేద్కర్ వాది జె.బి.రాజు

ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐ.ఏ.ఎస్,అంబేడ్కర్ వాది జె.బి.రాజు మాట్లాడుతూ ఈ మధ్యలో కేసీఆర్ ఏనాడు అనని విధంగా ఏడుసార్లు జై భీం అన్నాడు.నాకు నిజమా అనిపించింది.జైభీం తో సర్థిపుచ్చుకుంటే సరిపోదు.భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉంటేనే ముఖ్యమంత్రిగా ఉండాలి,లేదంటే ఉండే హక్కు లేదు అన్నారు. పూలే అంబేద్కర్ చరిత్ర తెలుసుకోలేక పోతే మనం భారతీయులమే కాదు.ఇది వ్యక్తుల చరిత్ర కాదు ఈ దేశ ఉద్యమ చరిత్ర అన్నారు.

సామాజిక విప్లవకారుడు ఫూలే అన్నాడు అందుకే అంబేద్కర్ గారు పూలేను నాకు గురువు అన్నాడు. భారతదేశం గర్వపడే మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అతను అంబేద్కర్ అని కొనియాడారు.అంబేద్కర్ ఈ దేశంలో సర్వజనులకు హక్కులను ప్రసాదించాడు అందుకే అంబేడ్కర్ సార్వజనీనుడు అన్నారు.హక్కులు ఇవ్వని మన ధర్మ శాస్త్రాన్ని అమలు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.ఈ దేశ సర్వజనుల జీవితాలలో పూలే అంబేడ్కర్ లు అఖండ జ్యోతులు వెలిగించారన్నారు.రాజకీయ సమానత్వం కావాలంటే అందరికి ఒకే ఓటు హక్కు కావాలని సామాజిక న్యాయం సాధన దిశగా అవిశ్రాంతంగా అంబేద్కర్ పోరాడారు.బిజెపి నేడు మతాన్ని ఆయుధం గా చేసుకొని చిచ్చుపెడుతున్నారు.మతోకల్లోలను సృష్ఠిస్తున్నారు అన్నారు.పేదలకు చేరువలో ఉన్న ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారన్నారు.బిజెపి రాజ్యంగాన్ని కనుమరుగు చేసే కుట్రలను ఓటుహక్కు ద్వారా బుద్ది చెప్పాలన్నారు.

విద్యతోనే మార్పు సాధ్యం

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశ సాధన కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంధుకు పోతున్నారు అన్నారు. విద్యతోనే మార్పు సాధ్యమని భావించి గురుకుల పాఠశాలను ఏర్పాటుచేసి ఆరు లక్షల మందికి కేసీఆర్ విద్యను అందిస్తున్నారన్నారు.

అంబేద్కర్ ఆలోచనతోనే మైనారిటీ లకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు.నరేంద్ర మోడి బిజెపి ఈ దేశంలో రాజ్యంగాన్ని ఆగం చేయడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు.బిజెపి ఈడిలను,సిబిఐలను అడ్డంపెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థ లను కాలరాస్తున్నారు అన్నారు.దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు లాంటి పథకాల ద్వారా మార్పు తెస్తున్నామన్నారు.దళితులు సమాన స్థాయి కి ఎదగాలంటే దళిత బహుజనులంధరు తమ పిల్లలను ఉన్నత విద్య వరకు చదివించాలన్నారు.

మేము రాజ్యాంగ వారసులం

కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబా

కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబా మాట్లాడుతూ ప్రపంచ ధృవతారలలో

ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి అంబేడ్కర్ పుట్టినరోజుని ది వరల్డ్ నాలెడ్జ్ డే గా ప్రపంచ విజ్ఞాన దినోత్సవం గా జరపాలని చెప్పి పిలుపునిచ్చింది. ఇంత పెద్ద కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా అంబేద్కర్ కు పెరుగుతూ ఉంటే అంబేద్కర్ బావాజాలాన్నే కాదు విగ్రహాన్ని కూడా భరించలేకపోతున్నారన్నారు. ఈ దేశంలో మన హక్కులను మనస్మృతి ఆదాపాతాల్లోకి తొక్కిందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.మనుస్మృతి కి వారసులు సంఘ్ పరివార్ శక్తులైతే మేము రాజ్యంగాన్ని కి వారసులం.

అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మొత్తం రద్దు కావాలి,రిజర్వేషన్ లు ఉండకూడదు ఇది బిజెపి లక్ష్యం అన్నారు. బిసి ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న బిజెపి బీసీలకు వ్యతిరేకంగా పోతుంది. బిసి కులగణన ను చేపట్టమంటే చేపట్టమని తెగేసి చెపుతున్నారు.నేను 100 సార్లు చెప్పిన బిజెపి అంటే అంటే బలహీన వర్గాల బద్ధ శత్రువు అని అన్నారు.బిజెపి పట్ల నిరంతర అప్రమత్తతో ఉండాలన్నారు.

పూలే అంబేద్కర్ ఆలోచనలు ప్రజాస్వామ్యానికి పునాది

రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ చొల్లేటి ప్రభాకర్

భారత ప్రజాస్వామ్య పునాది కి పూలే అంబేద్కర్ ఆలోచనా విధానం గర్వించదగినదని రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడారు.రాజ్యాంగ రచన వల్లనే నాలాంటి ఏంతోమంది ఐ.ఏ.ఎస్ లుగా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు.బడుగులను చైతన్యం చేయడానికి పూలే అంబేడ్కర్ చేసిన కృషి ని చూసి దేశం గర్విస్తుంది.దేశంలో పదే పదే అగ్ర కులాలు అధికారంలోకి వస్తున్నారు దీనికి కారణం ఎస్సీ.ఎస్టీ. బిసి మైనార్టీ ల మధ్య ఐకమత్యం లేకపోవడమే కారణమన్నారు.

కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను,గంజి మురళిధర్,కొండ వెంకన్న,ఔశెట్టి శంకరయ్య,మురారి మోహన్,చెరుకు పెద్దులు,కుర్రా శంకర్ నాయక్ సమన్వయం చేసిన కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున,ప్రముఖ రచయిత స్కైబాబ,ఎం.జి.యూ అధ్యాపకురాలు అనిత,రిటైర్డ్ ఎస్.ఈ దున్నా యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు,టి.ఎన్.జి.ఓ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్,ఎస్సీ.ఎస్టి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి,ఎల్.వి.యాదవ్,విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,ఎం.ఆర్.పి.ఎస్ సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ,కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమూలం శంకర్,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం,దళిత నాయకులు పెరిక కరణ్ జయరాజ్‌, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల వెంకన్న యాదవ్,మాలిగ యాదయ్య,అవాజ్ సంఘం జిల్లా కార్యదర్శి ఆశం,ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడగు ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.

నేడు తెలంగాణకు అమిత్ షా

తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రాగలదని ఆ పార్టీ పెద్దలు బాగా నమ్ముతున్నారు. అందుకు వారి లెక్కలు వారికి ఉన్నాయి. ప్రధానంగా పార్టీని తెరవెనక నడిపించే అమిత్ షా.. ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు.

ఎన్నికలకు మరో 9 నెలలు కూడా టైమ్ లేకపోవడంతో.. ఇప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఆయన సంసిద్ధమయ్యారు. అందులో భాగంగానే.. ఇవాళ తెలంగాణలోని చేవెళ్లలో... భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.

ఈ సభ కోసం 10 రోజుల ముందు నుంచే బీజేపీ వర్గాలు భారీ కసరత్తు చేస్తున్నాయి. సభకు ఎంత మందిని తరలించాలి అనే అంశం మొదలు... సభలో అమిత్ షా ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనే అంశం వరకూ... అన్నింటినీ ఆ పార్టీ లోతుగా విశ్లేషించుకుంటోంది. అందువల్ల ఇవాళ్టి సభపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

షెడ్యూల్ ఇదే

కేంద్ర హోమంత్రి అమిత్ షా సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వస్తారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్‌కి వెళ్తారు. ఆ తర్వాత 4.30కి బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశం ఉంది. అందులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారు. ఆ తర్వాత.. 5.15కి డైరెక్టుగా చేవెళ్ల సభకు వెళ్లి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటల వరకూ ఆయన సభలోనే ఉంటారు. రాత్రి 7.45కి తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. ఢిల్లీ బయలుదేరుతారు.

YS Viveka: వెన్నుపోటు వల్లే వివేకా ఓడిపోయారు.. రెండో భార్య షేక్‌ షమీమ్‌

అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డిలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం చేశారు..

అమరావతి: 'కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కరరెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిలు వెన్నుపోటు పొడవడం వల్లే 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఓడిపోయా..

వారు అలా చేయడం వల్ల చివరికి వైఎస్‌ కుటుంబానికే నష్టం వాటిల్లింది' అని మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి తనతో చెప్పారని ఆయన రెండో భార్య షేక్‌ షమీమ్‌ వెల్లడించారు. వివేకాకు ఓటేయాలని.. వైఎస్‌ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిలు వారి అనుచరులను కోరలేదని తెలిపారు.

వివేకా ఓటమి తర్వాత..పార్టీ కార్యకర్తలు కొంతమంది వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి ఇంటిపైన రాళ్లతో దాడి చేశారని, ఈ విషయం తాను టీవీల్లో చూసి తెలుసుకున్నానని చెప్పారు. ఈ ఓటమి వల్ల వివేకా తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారని వివరించారు. 2020 సెప్టెంబరులో సీబీఐకి ఆమె ఈ మేరకు వాంగ్మూలమిచ్చారు..

Superstar Rajinikanth: బెజవాడకు సూపర్‌ స్టార్‌.. వేదిక పంచుకోనున్న చంద్రబాబు, రజనీ, బాలయ్య..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు రజనీ.. బెజవాడ పొరంకిలోని అనుమోలు గార్డెన్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు..

ఇక, ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నటసింహా, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొనబోతున్నారు..

మొత్తంగా ఒకే వేదికను పంచుకోబోతున్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, చంద్రబాబు, బాలకృష్ణ. ఎన్టీ రామారావు శత జయంతిని

పురస్కరించుకొని నిర్వహిస్తున్న సభలో ముఖ్యఅతిధిగా రానున్న రజనీకాంత్‌.. ఎన్టీఆర్‌ ప్రసంగాలపై ప్రచురించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు..

NSG: రాళ్లదాడిపై ఎన్‌ఎస్‌జీ హెడ్ క్వార్టర్స్ సీరియస్

అమరావతి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) కాన్వాయ్‌పై వైసీపీ రాళ్ల దాడి ఘటనపై ఎన్‌ఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్ (NSG Head Quarters) సీరియస్‌గా తీసుకుంది..

రాళ్ల దాడిపై ఎన్‌ఎస్‌జీ హెడ్ క్వార్టర్స్‌కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది.

తలపై గాయం కావడంతో కమాండెంట్‌ను అధికారులు స్కానింగ్‌కు పంపించారు. యర్రగొండపాలెం పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేయాలని పార్టీ ఆదేశించింది.

గతంలో నందిగామ, ఇప్పుడు యర్రగొండపాలెం దాడి ఘటనలపై ఎన్‌ఎస్‌జీ బృందం నివేదిక ఇచ్చింది. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై ఎన్‌ఎస్‌జీ బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది..

India Corona: మరోసారి 12వేలు దాటిన కరోనా కేసులు..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి..

శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ(health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా(Corona) పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

ఇటీవల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో క్రియాశీల కేసులు 67,556 (0.15శాతం)కి చేరాయి. నిన్న 42మరణాలు నమోయ్యాయి.

అందులో కేరళ నుంచే 10 మరణాలు రికార్డు కాగా.. అవి సవరించిన గణాంకాలుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు..

Tamil Nadu : తమిళనాడులో దారుణం.. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య..?

తమిళనాడులో దారుణం. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులు, కుటుంబసభ్యులు సూచన మేరకే ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది..

పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు మోహన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ రాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.

నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో. శవాగారంలో వద్ద పని చేస్తున్నాడు. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు, బందువుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు తెలిపాడు..

దీనికి మోహన్ రాజ్ ఐదు వేల రూపాయలను తీసుకుంటున్నట్లు వీడియో వెల్లడించాడు. చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా పనులు చేసినట్లు మోహన్ రాజ్ పేర్కొన్నాడు. మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు మోహన్ రాజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. మోహన్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నెల 18న మోహన్ రాజ్ మద్యం మత్తులో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వైరల్ గా మారింది.

Telangana: తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు..

హైదరాబాద్‌:రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది..

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.

శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 39.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి..