నల్గొండ జిల్లా:కేతేపల్లి:రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.
రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.
.
Streetbuzz news. నల్గొండ జిల్లా :
.
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.బుధవారం కేతపల్లి మండలం గుడివాడ గ్రామంలో
మంగళవారం అకాల వర్షానికి పంట నష్టపోయిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా.
ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ...
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారురాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి తెలిపారు.ఈ మద్యనే కురిసిన ఆకాల వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వమని రాష్ర్టంలో ఉందన్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు నష్టపోయిన వడ్ల మార్కెట్లను సందర్శించాలని ఆదేశించారు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, నకిరేకల్ జెడ్పిటిసి మాద ధనలక్ష్మి నాగేష్ గౌడ్, కట్టంగూర్ జడ్పిటిసి తరాల బలరాం,కేతేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మారం వెంక రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు రాచకొండ భద్రయ్య గౌడ్,గుడివాడ గ్రామ సర్పంచ్ కట్ట శ్రవణ్,ఉప సర్పంచ్ రాచకొండ సైదులు,వార్డ్ నెంబర్లు,సీనియర్ నాయకులు రాచకొండ పురుషోత్తం,వేములకొండ లింగయ్య,వేములకొండ యాదయ్య,రాచకొండ లింగయ్య,రాచకొండ జానయ్య, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Apr 26 2023, 19:43