నల్గొండ జిల్లా:నకిరేకల్:విఓఏ ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం.బిఎస్పి నియోజకవర్గం ఇంచార్జి ప్రియదర్శిని మేడి.
విఓఏ ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం. బిఎస్పి నియోజకవర్గం ఇంచార్జి ప్రియదర్శిని మేడి
.
Streetbuzz news.నల్గొండ జిల్లా:
.
గ్రామ సంఘాలలో పనిచేసే ఐకెపి విఓఏల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిఎస్పి నియోజకవర్గం ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు,బుధవారం నకిరేకల్ పట్టణ కేద్రంలో మరియు కేతేపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంఎదుట గ్రామ సంఘం వివోఏలు చేపడుతున్న సమ్మె బుధవారం తో 10వ రోజుకు చేరింది,ఈ సమ్మెకు ఆమె మద్దతు తెలిపితూ ఈసందర్బంగా.ఆమె మాట్లాడుతూ..కనీస వేతనం గుర్తింపు లేకుండా సేవలు అందిస్తున్న వివోఏలపై ప్రభుత్వం కక్ష్య సాధింపు సరికాదన్నారు, విఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26000 చెల్లించాలని , సెర్ప్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, అర్హత కలిగిన విఓఏలను సీసీలుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు, బిఎస్పి తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ కార్యదర్శి చందుపట్ల శృతి, మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, విఓఏ మండల అధ్యక్షురాలు సుమీల,కార్యదర్శి సత్యనారాయణ,కోశాధికారి రాణి,వాణి,సంధ్య, మట్టయ్య,శ్రీనివాసులు, రామసుశీల, భాగ్యలక్ష్మి,మంగమ్మ,సరిత బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Apr 26 2023, 19:22