నల్గొండ జిల్లా:నకిరేకల్::ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
మన ఊరు-మన బడి కార్యక్రమంతో మారుతున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*
.
Streetbuzz news. నల్గొండ జిల్లా :
.
మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని ప్రభుత్వ మండల ప్రాధమిక పాఠశాల మరియు నకిరేకల్ పట్టణంలోని మండల ప్రాధమిక (బాలికల) పాఠశాల మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షలతో మౌలిక వసతుల బలోపేత పనుల ప్రారంబోత్సవానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ....... తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు అని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి పథకం తో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు,డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం లక్షల బడ్జెట్ను పాఠశాల విద్యా కమిటీ ఖాతాల్లో జమ చేసింది అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో.నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్ గౌడ్,నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసీం ఖాన్,నోముల గ్రామ శాఖఅధ్యక్షులు ఆలకుంట్ల సైదులు,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డ్ నెంబర్లు, సీనియర్ నాయకులు యల్మాకంటి జానయ్య గౌడ్,మండల ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు,నోముల గౌడ సంఘం అధ్యక్షులు బాధిని రాము గౌడ్,యువజన నాయకులు బాధిని సైదులు గౌడ్,రాచకొండ గోపి గౌడ్, టీచర్లు,విద్యార్థులు, నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.
Apr 24 2023, 21:03