నిజంనిప్పులాంటిది

Apr 23 2023, 14:29

నేడు తెలంగాణకు అమిత్ షా

తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రాగలదని ఆ పార్టీ పెద్దలు బాగా నమ్ముతున్నారు. అందుకు వారి లెక్కలు వారికి ఉన్నాయి. ప్రధానంగా పార్టీని తెరవెనక నడిపించే అమిత్ షా.. ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు.

ఎన్నికలకు మరో 9 నెలలు కూడా టైమ్ లేకపోవడంతో.. ఇప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఆయన సంసిద్ధమయ్యారు. అందులో భాగంగానే.. ఇవాళ తెలంగాణలోని చేవెళ్లలో... భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.

ఈ సభ కోసం 10 రోజుల ముందు నుంచే బీజేపీ వర్గాలు భారీ కసరత్తు చేస్తున్నాయి. సభకు ఎంత మందిని తరలించాలి అనే అంశం మొదలు... సభలో అమిత్ షా ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనే అంశం వరకూ... అన్నింటినీ ఆ పార్టీ లోతుగా విశ్లేషించుకుంటోంది. అందువల్ల ఇవాళ్టి సభపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

షెడ్యూల్ ఇదే

కేంద్ర హోమంత్రి అమిత్ షా సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వస్తారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్‌కి వెళ్తారు. ఆ తర్వాత 4.30కి బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశం ఉంది. అందులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారు. ఆ తర్వాత.. 5.15కి డైరెక్టుగా చేవెళ్ల సభకు వెళ్లి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటల వరకూ ఆయన సభలోనే ఉంటారు. రాత్రి 7.45కి తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. ఢిల్లీ బయలుదేరుతారు.

నిజంనిప్పులాంటిది

Apr 22 2023, 14:36

YS Viveka: వెన్నుపోటు వల్లే వివేకా ఓడిపోయారు.. రెండో భార్య షేక్‌ షమీమ్‌

అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డిలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం చేశారు..

అమరావతి: 'కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కరరెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిలు వెన్నుపోటు పొడవడం వల్లే 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఓడిపోయా..

వారు అలా చేయడం వల్ల చివరికి వైఎస్‌ కుటుంబానికే నష్టం వాటిల్లింది' అని మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి తనతో చెప్పారని ఆయన రెండో భార్య షేక్‌ షమీమ్‌ వెల్లడించారు. వివేకాకు ఓటేయాలని.. వైఎస్‌ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిలు వారి అనుచరులను కోరలేదని తెలిపారు.

వివేకా ఓటమి తర్వాత..పార్టీ కార్యకర్తలు కొంతమంది వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి ఇంటిపైన రాళ్లతో దాడి చేశారని, ఈ విషయం తాను టీవీల్లో చూసి తెలుసుకున్నానని చెప్పారు. ఈ ఓటమి వల్ల వివేకా తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారని వివరించారు. 2020 సెప్టెంబరులో సీబీఐకి ఆమె ఈ మేరకు వాంగ్మూలమిచ్చారు..

నిజంనిప్పులాంటిది

Apr 22 2023, 14:35

Superstar Rajinikanth: బెజవాడకు సూపర్‌ స్టార్‌.. వేదిక పంచుకోనున్న చంద్రబాబు, రజనీ, బాలయ్య..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు రజనీ.. బెజవాడ పొరంకిలోని అనుమోలు గార్డెన్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు..

ఇక, ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నటసింహా, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొనబోతున్నారు..

మొత్తంగా ఒకే వేదికను పంచుకోబోతున్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, చంద్రబాబు, బాలకృష్ణ. ఎన్టీ రామారావు శత జయంతిని

పురస్కరించుకొని నిర్వహిస్తున్న సభలో ముఖ్యఅతిధిగా రానున్న రజనీకాంత్‌.. ఎన్టీఆర్‌ ప్రసంగాలపై ప్రచురించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 22 2023, 14:33

NSG: రాళ్లదాడిపై ఎన్‌ఎస్‌జీ హెడ్ క్వార్టర్స్ సీరియస్

అమరావతి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) కాన్వాయ్‌పై వైసీపీ రాళ్ల దాడి ఘటనపై ఎన్‌ఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్ (NSG Head Quarters) సీరియస్‌గా తీసుకుంది..

రాళ్ల దాడిపై ఎన్‌ఎస్‌జీ హెడ్ క్వార్టర్స్‌కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది.

తలపై గాయం కావడంతో కమాండెంట్‌ను అధికారులు స్కానింగ్‌కు పంపించారు. యర్రగొండపాలెం పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేయాలని పార్టీ ఆదేశించింది.

గతంలో నందిగామ, ఇప్పుడు యర్రగొండపాలెం దాడి ఘటనలపై ఎన్‌ఎస్‌జీ బృందం నివేదిక ఇచ్చింది. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై ఎన్‌ఎస్‌జీ బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది..

నిజంనిప్పులాంటిది

Apr 22 2023, 14:32

India Corona: మరోసారి 12వేలు దాటిన కరోనా కేసులు..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి..

శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ(health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా(Corona) పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

ఇటీవల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో క్రియాశీల కేసులు 67,556 (0.15శాతం)కి చేరాయి. నిన్న 42మరణాలు నమోయ్యాయి.

అందులో కేరళ నుంచే 10 మరణాలు రికార్డు కాగా.. అవి సవరించిన గణాంకాలుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 22 2023, 09:28

Tamil Nadu : తమిళనాడులో దారుణం.. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య..?

తమిళనాడులో దారుణం. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులు, కుటుంబసభ్యులు సూచన మేరకే ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది..

పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు మోహన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ రాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.

నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో. శవాగారంలో వద్ద పని చేస్తున్నాడు. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు, బందువుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు తెలిపాడు..

దీనికి మోహన్ రాజ్ ఐదు వేల రూపాయలను తీసుకుంటున్నట్లు వీడియో వెల్లడించాడు. చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా పనులు చేసినట్లు మోహన్ రాజ్ పేర్కొన్నాడు. మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు మోహన్ రాజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. మోహన్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నెల 18న మోహన్ రాజ్ మద్యం మత్తులో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వైరల్ గా మారింది.

నిజంనిప్పులాంటిది

Apr 22 2023, 09:24

Telangana: తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు..

హైదరాబాద్‌:రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది..

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.

శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 39.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి..

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 13:56

Delhi: లాయర్‌ దుస్తుల్లో వచ్చి.. కోర్టులో మహిళపై కాల్పులు..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో కాల్పులు కలకలం సృష్టించాయి. దక్షిణ దిల్లీలోని సాకేత్‌ కోర్టు (Saket court) ప్రాంగణంలో ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు..

లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు.. మహిళపై నాలుగు రౌండ్లు కాల్పులు (Firing) జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. కోర్టు ప్రాంగణంలోని పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సాకేత్‌ కోర్టులోని లాయర్‌ ఛాంబర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం ఆ మహిళ నేడు కోర్టుకు హాజరయ్యారు.

ఆమె తన న్యాయవాదితో మాట్లాడుతుండగా.. దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 13:44

Somu Veerraju: బీజేపీతో టీడీపీ పొత్తు.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పొత్తులపై చర్చ జరుగుతనే ఉంది. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో.. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది..

అయితే టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తు పెట్టుకోకుండా.. బీజేపీ (BJP) అడ్డుపడుతోందని.. వైసీపీ, బీజేపీ రెండు ఒకటే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొన్న పీతాని సత్యనారాయణ, తరువాత తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ, వైసీపీ ఒక్కటో కాదో ప్రజలను అడిగితే తెలుస్తుంది అంటూ ఆరోపించారు. తాజాగా అచ్చెన్నాయుడుపై ఫైర్‌ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 13:37

Poonch Attack: జీ20 సదస్సే లక్ష్యంగా దాడి..?భారీ ఆపరేషన్‌ చేపట్టిన సైన్యం

భారత్‌(India)-పాక్‌(Pakistan) సంబంధాలు మరింత లోతుకు దిగజార్చే ఘటన చోటు చేసుకొంది. పాక్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌(JEM) ముసుగు సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్టు ఫోర్స్‌ (పీఏఎఫ్‌ఎఫ్‌)..

భారత సైనిక వాహనంపై దాడి బాధ్యతను స్వీకరించింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌-370ని తొలగించిన తర్వాత.. అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు శ్రీనగర్‌లో జీ-20(g20) సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది పాక్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. మరోవైపు పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ మే 5న భారత్‌లోని గోవాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సుకు హాజరు కానున్నట్లు ప్రకటించారు.

ఈ సమయంలో భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం కూడా ఉంది. దౌత్యపరంగా ఇంత కీలక సమయంలో భారత సైనిక వాహనంపై ముష్కరులు దాడికి తెగబడటం సంచలనంగా మారింది..