National Highway : కశ్మీర్-కన్యాకుమారి.. పొడవైన జాతీయ రహదారి 'ఎన్‌హెచ్-44'!
ఎన్‌హెచ్-44 (National Highway 44).. దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి (Indias longest highway) ఇది. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది..
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో (Jammu kashmir) మొదలై.. పంజాబ్ (Punjab), హరియాణా (Haryana), దేశ రాజధాని దిల్లీ (Delhi), ఉత్తరప్రదేశ్ (Uttar pradesh), రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya pradesh), మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh), కర్ణాటక (Karnataka) మీదుగా ప్రయాణిస్తూ తమిళనాడు (Tamil nadu) రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ముగుస్తుంది.
ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 492 కి.మీ, ఏపీలో 260 కి.మీ మేర ఎన్‌హెచ్-44 ఉంది. తొలుత ఇది ఒకే జాతీయ రహదారి కాదు. ఏడు జాతీయ రహదారులను (ఎన్‌హెచ్-1ఎ, ఎన్‌హెచ్-1, ఎన్‌హెచ్-2, ఎన్‌హెచ్-3, ఎన్‌హెచ్-75, ఎన్‌హెచ్-26, ఎన్‌హెచ్-7) విలీనం చేసి 'ఎన్‌హెచ్-44'ను ఏర్పాటు చేశారు. భారత మ్యాప్‌పై ఒక నిలువు గీత గీసిన తరహాలో ఈ జాతీయ రహదారి
కన్పిస్తుంది..
Apr 18 2023, 17:33