నల్గొండ జిల్లా :నకిరేకల్ ::ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
*ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
.
Streetbuzz news. నల్గొండ జిల్లా :
రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నకిరేకల్ పట్టణంలోని శకుంతల ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన దావత్- ఏ- ఇఫ్తార్ విందులో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ...
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు ఐక్యతకు చిహ్నం ఇఫ్తార్ అన్నారు.
ఉపవాసాలతో పేదల ఆకలి బాధలు తెలిపిన మహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో మంచి పనులు చేయడం గొప్ప విషయమన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు కులాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని దసరా సందర్బంగా చీరల పంపిణి, క్రిస్మస్ సందర్బంగా కానుకలు , రంజాన్ కు తోఫా అందిస్తున్నారని పేర్కొన్నారు.
రంజాన్ పవిత్ర మాసంలో ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉంటున్న ముస్లింలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసింఖాన్,మైనార్టీలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Apr 17 2023, 21:06