ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు?: పేర్ని నాని

తాడేపల్లి: ఎల్లో మీడియాపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. ఏదో విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

కాగా, పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి బరితెగించి వార్తలు రాస్తున్నాయి. కక్షపూరితంగా సీఎం జగన్‌ను అపఖ్యాతిపాలు చేయాలని చూస్తున్నారు. సీఎం జగన్‌పై దాడి ఘటనలో తప్పుడు వార్తలు రాస్తున్నారు. హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఒప్పుకున్నారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసింది మా పార్టీ వ్యక్తే అని హడావిడిగా దాడి జరిగిన గంట వ్యవధిలోనే అప్పట్లో డీజీపీ చెప్పేశారు. దాడి జరిగిన తర్వాత కనీసం పరామర్శించకుండా విమర్శలు చేశారు. దాడి ఘటనపై ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఎన్టీఆర్‌పై దాడి జరిగితేనే ఈనాడుకు పెద్దవార్త. సీఎం జగన్‌ కావాలని చేయించుకుంటున్నారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు..

చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు మహానేత వైఎస్‌ఆర్‌ ఖండించారు. పటిష్ట భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులోపలికి కత్తి ఎలా వచ్చింది?. హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వెల్లడించాలని అప్పట్లో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ వేశారు. ఘటనపై విచారణ జరపాలని కోరడం తప్పా?. విశాఖ పోలీసులను ఎవరు ప్రభావితం చేశారు?. ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు?. నిందితుడి గురించి విచారించకుండానే స్టేట్‌మెంట్లు ఇచ్చారు అని తెలిపారు..

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఉపశమనం!

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో నమోదైన ఓ పరువునష్టం కేసు (Defamation Case)లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఉపశమనం లభించింది.

విచారణ క్రమంలో ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టు ఆయనకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్‌ ఈ మేరకు దాఖలు చేసిన

దరఖాస్తును పరిశీలించిన భివండీ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్‌.. శాశ్వత మినహాయింపునకు రాహుల్‌ అర్హుడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్‌ 3న ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నమోదు చేస్తామని తెలిపారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ యత్నించాడు : సీబీఐ

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నించాడని సీబీఐ వెల్లడించింది..

ఉదయ్‌ రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలను సీబీఐ పొందుపరిచింది.

''వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ ప్రయత్నించాడు. హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్‌ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య జరిగిందని తెలిసిన వెంటనే ఆధారాల చెరిపివేతకు వారిద్దరూ అవినాష్‌ ఇంట్లోనే ఎదురుచూశారు.

అవినాష్‌కు శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చాడు. హత్య జరిగిన స్థలంలో అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డితో కలిసి ఉదయ్‌ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఆ రోజు అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, భాస్కర్‌రెడ్డి,శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా గుర్తించాం. వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించాం. విచారణకు ఉదయ్‌ సహకరించడం లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ముందస్తుగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది '' అని సీబీఐ పేర్కొంది.

కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ ఏర్పాటు చేస్తుంది : కెసిఆర్

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంది.అయితే ఇప్ప‌టి నుంచి రాజ‌కీయ రంగం సిద్ధ‌మ‌వుతున్న తీరు యావ‌త్ దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వేడిని పెంచింది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు బీజేపీ వర్సెస్ మహాకూటమి మధ్యే జరుగుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూల ఐక్యత ప్రయత్నాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పెద్ద ఎత్తున ప్రకటన చేశారు. కేసీఆర్‌ను నమ్మితే కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఆయన పార్టీ భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేస్తుంది.

వెలుగుకు ఒక్క నిప్పురవ్వ చాలు - కేసీఆర్

అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో దేశంలోనే అత్యంత ఎత్తైన (125 అడుగుల) బాబా సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తూ 2024 లోక్ తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. సభ ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తోందని, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా ఇదే విధమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వం మనది, మనది మరియు మనది మాత్రమే అని ఆయన అన్నారు. దీన్ని మన శత్రువులు కొందరు జీర్ణించుకోలేరు. కానీ కాంతి కోసం ఒక స్పార్క్ సరిపోతుంది.

బీఆర్‌ఎస్ వచ్చాక దేశం మొత్తం మీద దళిత బంధు పథకం అమలవుతుంది – కేసీఆర్

తమ పార్టీ అధికారంలోకి వస్తే దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. 2021 సంవత్సరంలో ప్రారంభించిన 'దళిత బంధు యోజన'లో, షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు వ్యాపారం ప్రారంభించడానికి 10 లక్షల రూపాయలను 100 శాతం గ్రాంట్‌గా అందించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకం కింద ఇచ్చిన గ్రాంట్లు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద అడ్డంకి

రెండు రోజుల క్రితం ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ల సమావేశం జరిగినప్పుడు కేసీఆర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ సమావేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలని తీర్మానం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన ఈ ప్రకటన విపక్షాల ఐక్యతకు పెద్ద అడ్డంకిగా కనిపిస్తోంది.

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

పిల్లలకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

నేడు (శనివారం) వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి.

టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది.

శుక్రవారం 66,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Bus Accident: లోయలో పడిన బస్సు.. 13 మంది మృతి, 25 మందికి పైగా గాయాలు

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా..25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

పూణేలోని పింపుల్ గురవ్ నుంచి గోరెగావ్‌కు బస్సు వెళ్తుండగా పూణె-రాయ్‌గఢ్ సరిహద్దులో తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు.. 16న విచారణకు రావాలంటూ..

మద్యం కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమన్లు పంపినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు..

కీలక అంశాలపై పంకజ్‌ జైన్‌తో ఏపీ సీఎస్‌ చర‍్చలు..

విజయవాడ: కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు..

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం చమురు మరియు సహజ వాయువు రంగానికి సంబంధించి లైసెన్సులు, క్లియరెన్స్‌ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్రోకెమికల్ ప్రాజెక్టుల స్థాపనకు సంబంధించిన ఫీజులు, వాటి నిర్వహణ వంటి కీలక అంశాలపై ఈసమావేశంలో ఇరువురు ప్రధానంగా చర్చించారు..

అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న పెట్రోలియం మైనింగ్ లీజులు (PMLs) మరియు అన్వేషణ,ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన వేగవంతమైన అనుమతులు మంజూరుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు..

CM KCR : బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నాడు 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ హాజరయ్యారు. అయితే..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఆయన మనవడు, లోక్‌సభ మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రకాష్‌ అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి లాంఛనంగా సమావేశం నిర్వహించి, అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌కు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎంపీలు జే సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు..

Mamata Banerjee: చరిత్రను మార్చే శక్తి ఎవరికీ లేదు.. భాజపాపై దీదీ విమర్శలు

కోల్‌కతా: ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) సిలబస్‌ హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా కొన్ని పాఠ్య భాగాలను తొలగించడాన్ని పశ్చిమ బెంగాల్‌(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తప్పుపట్టారు.

కోల్‌కతా(Kolkata)లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె భాజపాపై విమర్శలు గుప్పించారు.

'మీరు నాకు మద్దతుగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. నేను దేనిని విచ్ఛిన్నం చేయను. అకస్మాత్తుగా తాజ్‌మహల్‌, విక్టోరియా మెమోరియల్‌ను చరిత్ర నుంచి తుడిచేయాలని చూడను. చరిత్ర ఎప్పుడూ చరిత్రనే. దానిని మార్చే శక్తి ఎవరికీ లేదు. భారత చరిత్రే మన సంపద. భారతదేశ లౌకికవాదం బెంగాల్ ఇచ్చిన సంపద. రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్‌ ఠాగూర్, నజ్రుల్‌(బెంగాలీ కవి), రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ వంటి వారు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు' అని మమత(Mamata Banerjee) అన్నారు..

మహాత్ముడి హత్య.. హిందూ, ముస్లిం ఐక్యత.. ఆరెస్సెస్‌ నిషేధం వంటి పాఠాలు 11, 12 తరగతుల రాజనీతిశాస్త్రం, సామాజికశాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి కొత్త విద్యాసంవత్సరంలో అదృశ్యమయ్యాయి. గతేడాది చేపట్టిన ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) సిలబస్‌ హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా ''అతివ్యాప్తి'', ''అసంబద్ధం'' కారణాలుగా చూపుతూ ఇలా కొన్ని పాఠ్యభాగాలను తొలగించారు. తొలగించిన వాటిలో గుజరాత్‌ అల్లర్లు - వాటి పరిణామాలు, మొగల్‌ దర్బార్లు, ఎమర్జెన్సీ వంటి అంశాలు సైతం ఉన్నాయి. అయితే, అది ఈ విద్యాసంవత్సరం జరిగిన సిలబస్‌ మార్పు కాదని.. గతేడాది జూన్‌లోనే సిలబస్‌ హేతుబద్ధీకరణ జరిగినట్లు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ సక్లానీ చెప్పారు..