Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ యత్నించాడు : సీబీఐ
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్ రెడ్డి ప్రయత్నించాడని సీబీఐ వెల్లడించింది..
ఉదయ్ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను సీబీఐ పొందుపరిచింది.
''వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ ప్రయత్నించాడు. హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్ ఇంట్లోనే ఉదయ్, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య జరిగిందని తెలిసిన వెంటనే ఆధారాల చెరిపివేతకు వారిద్దరూ అవినాష్ ఇంట్లోనే ఎదురుచూశారు.
అవినాష్‌కు శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చాడు. హత్య జరిగిన స్థలంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఉదయ్ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఆ రోజు అవినాష్ ఇంట్లోనే ఉదయ్, భాస్కర్‌రెడ్డి,శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా గుర్తించాం. వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించాం. విచారణకు ఉదయ్ సహకరించడం లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ముందస్తుగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది '' అని సీబీఐ పేర్కొంది.











Apr 15 2023, 16:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
33.4k