CM YS Jagan: బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్.. దేశం గర్వించదగ్గ మేధావి
CM YS Jagan: దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి.. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించారు..
భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం.. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం.. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అంటూ #AmbedkarJayanti యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్..











Apr 14 2023, 17:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.9k