నేడు ఎల్‌బీ స్టేడియం వేదిక‌గా ఇఫ్తార్ విందు

•సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్: ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఎల్‌బీ స్టేడియం వేదిక‌గా ఇఫ్తార్ విందు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముస్లిం ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.

చాపెల్ రోడ్, నాంప‌ల్లి నుంచి వ‌చ్చే వాహ‌న‌దారులు బీజేఆర్ విగ్ర‌హం వ‌ద్ద ఏఆర్ పెట్రోల్ పంప్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. ఎస్‌బీఐ గ‌న్‌ఫౌండ్రీ నుంచి బ‌షీర్‌బాగ్ ఫ్లై ఓవ‌ర్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను చాపెల్ రోడ్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. ర‌వీంద్ర భార‌తి, హిల్ ఫోర్ట్ నుంచి బీజేఆర్ విగ్ర‌హం వైపు వెళ్లే వాహ‌న‌దారుల‌ను సుజాత స్కూల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.

బ‌షీర్‌బాగ్ ఫ్లై ఓవ‌ర్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను బీజేఆర్ విగ్ర‌హం వ‌ద్ద కుడి వైపున‌కు అనుమ‌తించ‌రు. ఎస్‌బీఐ గ‌న్‌ఫౌండ్రీ మీదుగా చాపెల్ రోడ్ వైపు వెళ్లాలి.

నారాయ‌ణ‌గూడ సెంటిన‌రీ నుంచి బ‌షీర్‌బాగ్ వైపు వ‌చ్చే వెహిక‌ల్స్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ వ‌ద్ద హిమాయ‌త్‌న‌గ‌ర్ వై జంక్ష‌న్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. కింగ్ కోఠి, బొగ్గుల‌కుంట నుంచి బ‌షీర్‌బాగ్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను కింగ్ కోఠి క్రాస్ రోడ్స్ వ‌ద్ద తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. వాహ‌న‌దారులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు.

మంగళగిరి లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు

• చంద్రబాబు నాయుడు ప్రసంగం:-

• రంజాన్ మాసం అంటే క్రమశిక్షణ, సేవ. ఖురాన్ ఆవిర్భవించిన నెలకు గుర్తుగా రంజాన్ పండుగ చేసుకుంటాం.

• నేను 40 ఏళ్లుగా రంజాన్ పండుగ లో భాగస్వామిని అవుతున్నా

• నాడు సిఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగు దేశం పార్టీ

• ఉర్ధూను రెండో అధికార భాషగా చేసిన ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం

• పాలనలో సైతం ఉర్దూని తీసుకుని వచ్చి ప్రోత్సహించిన పార్టీ టీడీపీ

• మైనారిటీ వర్గంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు 1985లోనే నాడు ఎన్టీఆర్ మైనారిటీ కార్పొరేషన్ తీసుకువచ్చారు.

• ముస్లిం సోదరుల కోసం హైదరాబాద్ లో శాసన సభ ఎదురుగా హజ్ హౌస్ కట్టి సదుపాయలు కల్పించి మక్కా యాత్రకు పంపింది మనమే.

• హస్ హౌస్ ఎత్తుపై నాడు సమస్య వస్తే...ప్రత్యేక అనుమతులు ఇచ్చి దాన్ని అందుబాటులోకి తెచ్చాం

• 2014 తరువాత ఎపిలో విజయవాడ, కర్నూల్ లో హజ్ హౌస్ లు కట్టాం. నవ్యాంధ్రలోనూ ఉర్థూ యూనివర్సిటీ తెచ్చాం

• ఇమాంలకు, మౌజుంలకు గౌరవ వేతనం ఇచ్చిన ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం

• దుల్హన్ అనే పథకం ద్వారా పేద ముస్లిం యువతులకు ఆర్థిక సాయం చేశాం. నాడు 50 వేలు ఇచ్చాం...టీడీపీ అధికారం లోకి వచ్చి ఉంటే నేడు రూ. లక్ష ఆర్థిక సాయం ఇచ్చేవాళ్లం.

• ఈ ప్రభుత్వం దుల్హన్ పథకం పై అనేక ఆంక్షలు పెట్టింది. 32 వేల మందికి రూ.163 కోట్ల ఆర్థిక సాయం దుల్హన్ పథకం కింద అందించాం.

• 525 మంది ముస్లిం విద్యార్థులను విదేశాలకు పంపి చదివించాం.

• మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10 లక్షల మందికి ఆర్థిక సాయం అందేలా చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పించాం.

• వైసీపీ ప్రభుత్వం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మాట తప్పింది. ఈ ప్రభుత్వంలో ముస్లిం వర్గంపై దాడులు పెరిగాయి.

• ముస్లిం లు అంతా రాష్ట్ర భవిష్యత్ కోసం అల్లాను ప్రార్థించాలి. తెలుగు దేశం రావాలి...రాష్ట్రం అభివృద్ది కావాలి.

• రంజాన్ సందర్భంగా ఇఫ్లార్ లో పాల్గొనడం నా అదృష్టం గా భావిస్తున్నా.

Karnataka elections : రైతులను పెళ్లి చేసుకునే యువతులకు జేడీఎస్ భారీ తాయిలం

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం జేడీఎస్ భారీ తాయిలాలు ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు ముస్లింలు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామని హామీలను ఇవ్వడం చూశాం..

ఇప్పుడు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి రైతుల కోసం ఓ తాయిలాన్ని ప్రకటించారు. వ్యవసాయదారుల కుటుంబంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు అందిస్తామని చెప్పారు.

కోలార్‌లోని పంచరత్న ర్యాలీలో కుమార స్వామి మాట్లాడుతూ, వ్యవసాయదారుల కుటుంబంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు అందిస్తామని చెప్పారు. రైతుల పిల్లలకు పెళ్లిళ్లు జరిగేలా ప్రోత్సహించడం కోసం వధువులకు రూ.2 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలన్నారు. రైతుల పిల్లలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తానని చెప్పారు..

బలగం మొగిలయ్యను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం దగ్గరుండి హైదరాబాదుకు పంపించిన ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్...

బలగం సినిమాతో తనదైన శైలిలో ప్రజలను మెప్పించిన కళాకారుడు బలగం మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతూ సంరక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారిని పరామర్శించారు.

మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు,జిల్లా మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తాను ఎప్పటికప్పుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నామని

నేడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్ కు ఎమ్మెల్యే నరేందర్ దగ్గరుండి అంబులెన్స్ లో పంపించి ఆర్థికసాయంతో పాటు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు.

మొగిలయ్య ఆరోగ్యం కుడుటపడి ఆయురారోగ్యాలతో క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే కోరుకున్నారు

బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి

మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకుని బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 

 ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిభా పూలే అణగారిన వర్గాల అసమానతలను రూపుమాపేందుకు అది కేవలం విద్య ద్వారానే సాద్యం అని భావించి అక్షరాలను ఆయుధంగా చేసుకుని వారికి విద్యనేర్పిన గొప్ప మహనీయుడని కొనియాడారు. విద్య ద్వారానే సమాజాన్ని మార్చాలని నిర్ణయుంచుకుని అణిచివేయబడుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షరజ్యోతులు వెలిగించిన చైతన్య మహానీయుడు అని అన్నారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా అన్నివర్గాల ప్రజలం అడుగులు వేసి సాధించుకొనే విధంగా ప్రయత్నం చేయాలన్నారు.

అంతేకాకుండా మహిళలకు విద్య ద్వారానే విముక్తి కలుగుతుందని భావించి తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా మహిళా పాఠశాలలు ఏర్పాటు చేయించి ఎంతో మంది మహిళలకు విద్యనేర్పిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిభా పూలే అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫూలే జయంతి రోజున అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, కత్తుల సన్నీ తదితరులు పాల్గొన్నారు.

ఉరుమడ్ల గ్రామంలో పల్లె పల్లెకు, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా భరోసా కార్యక్రమం

•ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గo చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పల్లె పల్లెకు ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఓబిసి మోర్చా చిట్యాల మండల కోఆర్డినేటర్స్ గుండెబోయిన నరసింహ ముదిరాజ్ నూతి విశ్వతేజ ముదిరాజ్ గార్ల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా భరోసా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు పాల్గొని మాట్లాడారు పల్లె పల్లెకు ఓబీసీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలు గురించి తెలియజేయడం జరిగింది.

వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ 102 వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కి రాజ్యాంగ హోదాను అందిస్తుందన్నారు, 105వ రాజ్యాంగ సవరణ చట్టం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి రాష్ట్రాల ఓబిసి జాబితాను రూపొందించే హక్కు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అని తెలియజేశారు, ఓ బి సి ఆదాయ క్రిమిలేయర్ సవరణ 2017లో ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయాన్ని రూపాయలు ఆరు లక్షల నుండి 8 లక్షలకు పెంచారన్నారు.

27 ఓబిసి మంత్రులు మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారని, PSU లో ఓ బీసీలకు రిజర్వేషన్లు ఓబీసీ వర్గాల సంక్షేమం సాధికారతకు సంబంధించి వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని అవకాశాలను ప్రయత్నిస్తుందన్నారు, సుపరిపాలన జనరల్ కేటగిరిలో అర్హత సాధించిన అభ్యర్థులను ఓబీసీ కోటాలో పరిగణించే తప్పుడు విధానాన్ని రద్దుచేసి జనరల్ కేటగిరీలో అర్హత సాధించిన ఓబీసీ అభ్యర్థిని జనరల్ అభ్యర్థిగా పరిగణిస్తారు అని తెలియజేశారు.

ఓబిసి విద్యార్థులకు సైనిక్ నవోదయ మరియు కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్లు, ఓబిసి విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఓబీసీల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ అందిస్తుందన్నారు, ఓ బి సి విద్యార్థుల కోసం జేఆర్ఎఫ్ స్థాయి జాతీయ ఫెలోషిప్ నెలకు రూ. 31,000, ఎస్ఆర్ఎఫ్ స్థాయి వారికి నెలకు రూ. 35000 అందజేస్తుందన్నారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ పథకం కింద విదేశీ చదువుల కోసం విద్య రుణాలు తీసుకునే ఓబీసీ విద్యార్థులకు వడ్డీ రాయితీని నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది దాని బడ్జెట్ కేటాయింపులను పెంచిందన్నారు, నీట్ రిజర్వేషన్, కొత్త విద్యా విధానం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్, పోషన్ అభియాన్ లేదా జాతీయ పోషకాహార మిషన్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు.

నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓబీసీల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సబ్ వెన్షన్ స్కీమ్ , ఈపీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన వంటి ఎన్నో ప్రయోజనకర పథకాలను ఓబీసీలకు అందజేస్తున్న ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలుస్తుంది అన్నారు, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో బీసీలను 9 ఏళ్లలో అన్ని రంగాల్లో అణచివేసింది అన్నారు.

రాజకీయంగా, ఆర్థికపరంగా, విద్యాపరంగా, సామాజిక న్యాయం పరంగా, ఉద్యోగ, ఉపాధి పరంగా, ఇలా అన్ని విధాలుగా వివక్షకు గురవుతున్న బీసీ సామాజిక వర్గం ఒక్కసారి ఆలోచన చేయాలని కేసిఆర్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా బిజెపి దేశానికి ఒక బీసీ నాయకుడిని ప్రధానిగా చేసిందన్నారు, రాష్ట్రంలో బీసీలకు సముచిత నాయకత్వం ఇచ్చింది భారతీయ జనతా పార్టీనే తెలంగాణ బీసీల ఆశలు, ఆశయాలు, రాజ్యాధికారం, ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్న అది డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం. ఒక్కసారి రాష్ట్రంలో బిజెపికి అధికారాన్ని ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు ఉయ్యాల లింగస్వామి గౌడ్, ఈదుల పవన్, యువజన నాయకులు మర్రి హరీష్ రెడ్డి, కాటo సందీప్ యాదవ్, వెంకటేష్, శ్రీనివాస్, నరసింహ, రాములు, సత్యం, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.

Hyderabad: నడిరోడ్డుపై దారుణం.. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పు..!

రాజేంద్రనగర్‌: హైదరాబాద్‌ శివారు అత్తాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.

ఓ మహిళపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది..

తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయిన మహిళను స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలిని అత్తాపూర్‌కి చెందిన శివానిగా గుర్తించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

నీట్ పరీక్షకు ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

దేశవ్యాప్తంగా నీట్ ఏప్రిల్ 6 తో ముగిసిన దరఖాస్తుల గడువు అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు జాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల తుది గడువును మూడ్రోజులు పెంచారు. వాస్తవానికి నీట్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 6 తోనే ముగిసింది.

అయితే, పలు సమస్యల వల్ల సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకు నీట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది.

ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించింది. అటు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్లలో పొరపాట్లను సవరించుకునేందుకు ఎన్టీఏ తాజాగా కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నీట్... ఇలా...

దేశవ్యాప్తంగా మే 7 న నీట్ పరీక్ష...

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష

మొత్తం 13 భాషల్లో నీట్

తెలుగులోనూ నీట్ రాసే వెసులుబాటు

పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష

ఎన్టీఏ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారం

మొత్తం 499 నగరాలు, పట్టణాల్లో నీట్ పరీక్ష నిర్వహణ

ఎంబీబీఎస్ , డెంటల్ కోర్సు, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, ఆయుష్‌లోని వెజిటేరి కోర్సులు,(ICAR) అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ కమ్యూనిటీ సైన్స్, పారామెడికల్ మరియు నర్సింగ్ కోర్సులకు B.Sc అల్లైడ్ కొర్స్, ఫోజీయోతెరఫి ఇంజనీరింగ్ కొర్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి.

సీపీ రంగనాథ్‍ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. బండి సంజయ్ హెచ్చరిక..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేశాడని గుర్తు చేశాడు. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలన్నారు.

తెలంగాణలో నిరుద్యోగం తప్పా ఇంకేమి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నాడని విమర్శించారు. తనపై కావాలానే కేసు పెట్టారని చెప్పారు.

రాత్రి 12:30 గంటలకు ఉప్పల్ నుంచి మెట్రో రైలు..

తన ఫోన్ ను ఎవరు ఎత్తుకు పోయారని చెప్పారు. పోలీసులే తన మొబైల్ దొంగిలించారని ఆరోపించారు. ప్రశాంత్ వాట్సాప్ చేస్తే తాను సాయంత్రం 5 గంటలకు చూసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటలకే అయిపోయిందన్నారు.

అటు హనుమకొండ సీపీ రంగనాథ్ పై కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రంగనాథ్ విజయవాడ, ఖమ్మం, వరంగల్ లో ఏ దందాలు చేశాడో తెలుసన్నారు. వాటన్నింటిని బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు.

బానిసత్వ కుల వ్యవస్థ ను నిర్మూలించిన మహనీయునికి నివాళి

భారతదేశంలో బ్రిటిష్ వాడి ఆధిపత్యం రెండువందల యేళ్ల పాటు సాగింది. ఈ విశాల భారత దేశంలోని భూమిపుత్రులను బానిసలుగా మార్చి నిరంకుశ వలస పాలనను వారు కొనసాగించారు. ఈ దేశపు ప్రజలను పీడిస్తున్న మరో తరహా బానిసత్వం కుల వ్యవస్థ పేరుతో మొదలయింది. రెండువేల యేళ్ల క్రితం ప్రారంభమై నేటికీ అది కొనసాగుతున్నది. బ్రిటిష్ వాడు రుద్దిన బానిసత్వాన్ని రద్దు చేయడానికి షహీద్ భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ.. అమరులెందరో ఉద్యమిస్తే.. మనువాద గులాంగిరీని రద్దు చేయడానికి ఆధునిక భారత చరిత్రలో తొట్టతొలిగా ఉద్యమించిన మహనీయుడు జ్యోతిబా ఫూలే. ఆ స్వాతంత్ర్య ఉద్యమనేత గాంధీ మహాత్ముడైతే.. ఈ స్వాతంత్ర్య ఉద్యమ నేత ఫూలే సైతం నిస్సందేహంగా మహాత్ముడే!

జ్యోతిరావు గోవిందరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించాడు. నాటి పీష్వా రాజుల దగ్గర జ్యోతిరావు కుటుంబం పూలమాలలు కట్టి అమ్మే వృత్తిని కొనసాగించిన కారణంగా ఫూలే అనే పేరు వచ్చింది. వెనుకబడిన 'మాలి' కులానికి చెందిన ఆయన కుల కట్టుబాట్ల కారణంగా చిన్ననాటి నుంచే అవమానాలను ఎదుర్కొన్నాడు. యుక్త వయస్సులో ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి హాజరైన జ్యోతిరావును పెళ్లికొడుకు బంధువులు కులం పేరుతో అవమానించి పెళ్లి ఊరేగింపు నుంచి గెంటివేశారు. ఆ అవమానంతో రగిలిపోయిన ఫూలే కులాధిపత్యాన్ని నిర్మూలించడానికి అవిశ్రాంత పోరాటం కొనసాగించాలని ప్రతినబూనాడు. శూద్రులు, అతిశూద్రులపై అగ్రవర్ణాల వారు కొనసాగిస్తున్న దురాగతాలను నిరోధించడానికి ఫూలే 1873 సెప్టెంబరు 24న 'సత్య శోధక్ సమాజ్' ను స్థాపించాడు. మెజారిటీగా ఉన్న నిమ్న వర్గాల ప్రజలను కుల దోపిడీ నుంచి విముక్తి చేయడంతోపాటు రైతులు, కూలీలను తమ హక్కుల కోసం సంఘటితపరిచేందుకు ఈ సంస్థ ద్వారా ఫూలే విశేషంగా కృషి చేశాడు.

ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని కృత్రిమ కుల వ్యవస్థను సృష్టించి, దేశంలోని మెజారిటీ వర్గాలను ఆర్థికంగా సామాజికంగా అణచివేసిన స్వార్థపర వర్గాల దోపిడీని జీవితాంతం వ్యతిరేకించి పోరాడిన మహానుభావుడు ఫూలే. ఆయన నడిపిన పోరాటాల స్ఫూర్తిని నేటి తరానికి అందించే ఒక మహత్తర సాధనంగా ఆయన రచన "గులాంగిరీ" నేటికీ నిలిచి ఉన్నది. ఈ దేశపు వెనుకబాటుతనానికి ప్రధాన కారణమైన కుల వ్యవస్థ నికృష్ట స్వభావం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం "గులాంగిరీ". కాలాన్ని ఎదిరించి ఘనీభవించిన ఫూలే మూర్తి.. ఆయన రాసిన గులాంగిరీ పుస్తకంలో మనకు ప్రత్యక్షమౌతుంది. నేటి కాలంలో మనం చేపట్టాల్సిన సామాజిక న్యాయ పోరాటాలను ఎలా కొనసాగించాలో, దగ్గర కూచోబెట్టుకుని మనకు నేర్పుతుంది.

సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే భాషలో.. ఉద్యమ సహచరుడు దోండిబా మరియు ఫూలేల మధ్యన సంభాషణల రూపంలో గులాంగిరీ పుస్తకం కొనసాగుతుంది. ఈ దోండిబా ఎవరో కాదు.. ఫూలే ను హత్య చేయించడానికి పూణే బ్రాహ్మణులు సుపారి ఇచ్చి కుదుర్చుచున్న కిరాయి హంతకుడు! ఓ అర్థరాత్రి వేళ దోండిబా ఫూలేను చంపడానికి ఆయన ఇంట్లో దూరాడు. అలికిడికి నిద్ర లేచిన ఫూలే దోండిబాను నిలదీసాడు. నిన్ను చంపడానికి బ్రాహ్మణులు డబ్బులు ఇచ్చారని దోండిబా తెలుపగా.. నా చావుతో నీ ఆకలి తీరుతుందనుకుంటే.. అలానే కానియ్యి అని ఫూలే సమాధానమిచ్చాడు. "మీ నిమ్నవర్గాల పిల్లలకు మేము చదువులు చెప్పడమే.. బ్రాహ్మణుల కోపానికి కారణమయిందని తెలుసుకో.." అని ఫూలే తెలపడంతో దోండిబా తన తప్పును గ్రహించి.. హత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. క్రమక్రమంగా ఫూలే ఉద్యమ సహచరుడయ్యాడు.

బ్రాహ్మణుల ఆధిపత్యానికి దారులు వేసిన పురాణాల బండారాన్ని ఫూలే తన గులాంగిరీ పుస్తకంలో అందరికీ అర్ధమయ్యే రీతిలో విశదీకరిస్తాడు. బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుండి జన్మించారనే కథనం పై వ్యాఖ్యానిస్తూ.. మగ వ్యక్తి ముఖం నుండి వారు పుట్టడమే నిజమైతే.. ఎవరి స్తన్యం తాగి పెరిగినట్టు? అని ఫూలే ప్రశ్నిస్తాడు. ఫూలే ప్రయోగించిన తార్కిక వాదనలతో బ్రాహ్మణులు సృష్టించిన కృత్రిమ కథనాలు దూది పింజల్లా తేలిపోతాయి.

దురదృష్టవశాత్తూ ఆ మహాత్ముడికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం నేటికీ దక్కడం లేదు. తెలంగాణాకు ఫూలేకు సంబంధమేమిటి.. తెలంగాణలోని బీసీ గురుకులాల పేరులో నుంచి మహాత్మ జ్యోతిరావు ఫూలే పేరును తొలగించాలని.. ఆ మధ్య ఒక బీసీ నేత డిమాండు చేసారు. ఇక అగ్రవర్ణాల వారైతే.. ఫూలేను చులకన చేస్తూ, ఆయనొక బ్రాహ్మణ వ్యతిరేకి అంటూ కొట్టిపారేస్తున్నారు. ఫూలే జీవితం గురించి తెలిసిన వారెవరైనా.. ఆయన బ్రాహ్మణులనే కాదు, ఏ వర్గం వారినీ ద్వేషించలేదని అర్థం చేసుకుంటారు. ఆ రోజుల్లో.. ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆనాటి సమాజం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ఒడిగట్టిన వేళ.. ఫూలే దంపతులు ఆమెకు తమ ఇంటిలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు కలుగబోయే బిడ్డను తామే పోషిస్తామని భరోసా ఇచ్చి, ఆమెకు పుట్టిన బిడ్డను పూలే దంపతులు దత్తత తీసుకొని తమ బిడ్డగా స్వీకరించి పెంచి పెద్ద చేసారు. ఆ బిడ్డ పేరే యశ్వంతరావు ఫూలే! ఒక శూద్ర మాలి కుటుంబానికి వారసుడయిన ఒక బ్రాహ్మణ బిడ్డ! "నిఖిలలోకమెట్లు నిర్ణయించిన గాని.. తరుగులేని విశ్వనరుడ నేను!" అంటూ మొన్న మొన్న జాషువా కవి అన్న మాటలను.. ఆనాడే తన జీవితాచరణ ద్వారా నిరూపించిన మహాత్ముడు ఫూలే! ఆయన జీవితము, సత్య శోధక సమాజ ఉద్యమము ఆయన రచనలూ.. నేటి కాలంలో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారాన్ని చూపుతాయి.