TDP Vs YCP: ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. బాపట్లలో ఆసక్తికర రాజకీయం..

బాపట్ల: అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. దళితులు, మైనార్టీల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Former minister Nakka Anandbabu) విసిరిన చాలెంజ్‌ను మంత్రి మేరుగ నాగార్జున (Minister meruga Nagarjuna) స్వీకరించారు.

వేమూరులో అభివృద్ధిపై, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కడే వచ్చిన సరే, చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కొడుకును తెచ్చుకున్న సరే అని... తాను మాత్రం ఒక్కడినే వస్తానని అన్నారు. ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి మేరుగ స్పష్టం చేశారు.

దళితులు, మైనారిటీ సంక్షేమం - దాడులపై చర్చిద్దామని మంత్రికి నక్కా ఆనందబాబు (TDP Leader) సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి మేరుగ నాగార్జున (AP Minister) చర్చకు రావాలన్నారు. మంత్రి మేరుగ చేసిన దాడులు, దోపిడీ, మోసాలు నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇద్దరం సాంఘిక సంక్షేమశాఖకు మంత్రులుగా చేశామని, ఎవరెవరు ఏమేం చేశామో చర్చిద్దామా అంటూ టీడీపీ సవాల్ విసిరారు..

కాగా టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసని, నియోజకవర్గంలో జగన్‌ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయని చెప్పారు. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు..

IPL 2023 Records: ఐపీఎల్‌ 2023లో సూపర్ స్టార్లుగా మారిన ప్లేయర్లు వీళ్లే.. ఈ సీజన్ ఆణిముత్యాలు

•ఐపీఎల్ ఎందరో ప్లేయర్లకు జీవితాన్ని ఇచ్చింది. ఒక్క ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మార్చింది. ప్రతి సీజన్‌లో ఒకరిద్దరు...

రింకూ సింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసం ఐపీఎల్ చరిత్రలో ఎన్నటికీ మరువలేనిది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరమైన దశలో.. వరుసగా 5 సిక్సర్లు కొట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. రింకూ సింగ్ ఇలానే ఆడితే ఫినిషర్‌గా టీమిండియా తలుపు తట్టే అవకాశం ఉంది.

సుయాష్ శర్మ

కోల్‌కతా నైట్ రైడర్స్ లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. 19 ఏళ్ల సుయాష్‌.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఒక్క ఫస్ట్ క్లాస్ గేమ్ కూడా ఆడకుండానే తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో సూపర్‌గా బౌలింగ్ చేశాడు.

సాయి సుదర్శన్

గుజరాత్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన మరో ఆణిముత్యం. 21 ఏళ్లలోనే తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. సుదర్శన్ ఇప్పటికే 3 మ్యాచ్‌లలో 137 పరుగులు చేశాడు.

తిలక్ వర్మ

ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌ తిలక్ వర్మ ఐపీఎల్ 2023ను అద్భుతంగా ప్రారంభించాడు. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అజేయంగా 84 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. 20 ఏళ్ల తిలక్ వర్మ హైదరాబాద్ తరపున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ముంబై ఇండియన్స్‌కు కీలక బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు.

యశస్వి జైస్వాల్

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ అవతలి ఎండ్‌లో ఉన్నా.. వేగంగా పరుగులు చేస్తూ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. జైస్వాల్ 3 మ్యాచ్‌లలో 2 అర్ధశతకాలు బాది.. 164.47 స్ట్రైక్ రేట్‌తో 125 రన్స్ చేశాడు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దక్కించుకుంటాం : సీఎం కేసీఆర్

భారత రాష్ట్ర సమితి పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇరుగు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు చూస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో సంగతి ఎలా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రము, పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మరింత గట్టిగ ఫోకస్ చేయాలనీ పార్టీ నిర్ణయించింది.

ఈ మేరకు ప్రముఖ కాపు నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. రావెల కిషోర్ బాబు, మరికొందరు నాయకులను చేర్చుకుని ముందుకుపోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఏ కారణం.. ఎలాంటి వేదిక.. ఒక బలమైన అంశాన్ని పట్టుకుని కదా ఆంధ్రాలో వేళ్లూనుకోవాలి.. దానికి ఇప్పటికి ఓ అవకాశం దొరికింది.

కేంద్రం ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని నిర్ణయించింది. దాన్ని అలాగే ఉంచండి, అని రాష్ట్రప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్రం వినడం లేదు. అమ్మేద్దాం.. ఎలా ఉన్నాసరే వదిలించు కుంటామని కేంద్రం చెబుతోంది. ఈమేరకు అంతర్జాతీయ బిడ్లు ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. అయితే సరిగ్గా ఈ అంశం కేసీఆర్‌కు అవకాశంగా దక్కిందని అంటున్నారు. కేంద్రం అమ్మేయాలనుకుంటున్నా ఉక్కు విశాఖ ఉక్కును తాము సైతం బీడ్లు వేస్తామని వేలం లో ఉక్కు కంపెనీ దక్కించుకుంటామని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఈమధ్య కేటీఆర్ సైతం ఉక్కును అమ్మేయొద్దని ప్రైవేటికరణ చేయొద్దని కేంద్రాన్ని కోరారు. సింగరేణి సంస్థ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టేందుకు కేసీఆర్ చూస్తున్నారు...

Cell Phone Down Day: ఉద్యోగుల ఉద్యమం.. రేపు సెల్‌ఫోన్‌ డౌన్‌..

Cell Phone Down Day: తమ డిమాండ్ల సాధన కోసం మలిదశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. అందులో భాగంగా రేపు సెల్ ఫోన్‌ డౌన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు..

ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఏపీజేఏసీ రాష్ట్రకమిటి ఇచ్చిన మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా.. ఈనెల 11న మంగళవారం ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ సెల్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు..

అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ఈరోజు పర్యటించారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్‌ అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్‌, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురి నుంచి వినపత్రాలు స్వీకరించిన మంత్రి కేటీఆర్‌, యువకులతో కలిసి సెల్ఫీలు దిగారు.

లక్ష్మీపూర్‌లో పల్లె దవాఖానను ప్రారంభించిన తర్వాత పాపయ్యపల్లె చేరుకుంటారు. రూ.26 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. గోపాల్‌రావుపల్లె, మండెపల్లిలో అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తంగళ్లపల్లిలోని పీహెచ్‌సీలో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు గండిలచ్చపేటకు చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తర్వాత కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు.

దళితబంధు పథకం కింద మంజూరైన పౌల్ట్రీఫాంను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుంటారు. మండలంలోని దుమాల గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత చిట్టివాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనం, రూ.10 లక్షలతో మహిళా సంఘ భవనం, చిట్టివాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభిస్తారు.

యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు. అక్కడి నుంచి 3.30 గంటలకు బుగ్గరాజేశ్వర తండా చేరుకొని రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.9.60లతో నిర్మించిన గిరిజన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాచర్ల గుండారంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 5 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..

హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు.

మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు. ఇంకా రెండు బిల్లులను పెండింగ్‌లోనే ఉంచారు. 

కాగా.. పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఈ పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై నేడే(సోమవారం) విచారణ జరగనుంది.

చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది..

Air India: సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. విమానం వెనక్కి..!

దిల్లీ: విమానాల్లో ప్రయాణికులు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఈ మధ్య తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎయిరిండియా (Air India) విమానంలో ఓ ప్రయాణికుడు (unruly passenger) సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు..

దీంతో అతడిని దించేయడం కోసం విమానం మళ్లీ వెనక్కి వచ్చింది. దిల్లీ నుంచి లండన్‌ (Delhi-London flight) బయల్దేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సోమవారం ఉదయం దిల్లీ (Delhi Airport)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 225 మంది ప్రయాణికులతో ఓ ఎయిరిండియా విమానం (Air India Flight) లండన్‌ బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. దీంతో పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించారు. మళ్లీ దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేసి ఆ ప్రయాణికుడిని దించేశారు. ఘటన నేపథ్యంలో ఈ విమానం ఆలస్యమైంది..

ఘటనపై ఎయిరిండియా (Air India) స్పందించింది. ''దిల్లీ నుంచి లండన్‌ బయల్దేరిన ఏఐ 111 విమానం.. ప్రయాణికుడి అభ్యంతరకర ప్రవర్తన (Unruly Behaviour) కారణంగా కాసేపటికే వెనక్కి రావాల్సి వచ్చింది. మాటలతో, రాతపూర్వకంగా హెచ్చరించినా ఆ ప్రయాణికుడు వినిపించుకోలేదు సరికదా.. ఇద్దరు క్యాబిన్‌ సిబ్బందిని గాయపర్చాడు. దీంతో విమానాన్ని దిల్లీకి మళ్లించాలని పైలట్‌ నిర్ణయించారు. ల్యాండ్‌ అయిన తర్వాత అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం'' అని ఎయిరిండియా తన ప్రకటనలో వెల్లడించింది. విమానంలోని ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, వారి మర్యాదను కాపాడటం తమకు అత్యంత ప్రాధాన్యమని ఎయిర్‌లైన్ తెలిపింది. ఈ ఘటనతో ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లు పేర్కొంది. విమానాన్ని మధ్యాహ్నానికి రీషెడ్యూల్‌ చేసినట్లు

వెల్లడించింది.

ఇటీవల ప్రయాణికుడి మూత్ర విసర్జన ఘటనతో ఎయిరిండియా తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. విమానంలో ప్రయాణికుల ప్రవర్తనపై పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను ఎదుర్కొనేందుకు ఎయిరిండియా తమ సిబ్బందికి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది..

Jupalli Krishna Rao: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషంగా ఉంది..

హైదరాబాద్: బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) నుంచి తనను సస్పెండ్ (Suspend) చేసినందుకు చాలా ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు.

ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌ (Old MLA Quarters) దగ్గర మీడియాతో మాట్లాడుతూ పంజరంలో నుంచి బయటపడినట్లు ఉందన్నారు.

దొరలగడీ నుంచి బయటకు వచ్చానని, పార్టీ సభ్యత్వం చేస్తామంటే కూడా పుస్తకాలు ఇవ్వలేదన్నారు. తనను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే తనను సస్పెండ్ చేశారని జూపల్లి కృష్ణారావు అన్నారు..

నేటి నుండి 14 వరకు ఉస్మానియా అరుణతార,ఇండియన్ చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభలను జరపండి

•కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభల పోస్టర్స్ ఆవిష్కరణ.. PDSU

విప్లవ విద్యార్థి నాయకుడు,ఊస్మానియా అరుణతార,ఇండియన్ చేగువేరా,యువ మేధావి,ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ PDSU వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభల పోస్టర్ ను నల్లగొండ పట్టణంలోని గాందీ నగర్ ఎస్.సీ హాస్టల్ లో PDSU నేతలు ఆవిష్కరణ చేశారు..

ఈ సందర్భంగా,PDSU నల్లగొండ జిల్లా కార్యదర్శి పోలె పవన్,జిల్లా నాయకుడు ఇందూరు మధులు పాల్గొని మాట్లాడుతూ..,ఉస్మానియా అరుణతార,హైదరాబాద్ చేగువేరా జార్జిరెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 10 నుండి 14 వరకు దేశవ్యాప్తంగా జరిగే జార్జి వర్ధంతి సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 70 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పేరుకుపోయిన మతఛాందస వాదాన్ని, దుర్మార్గపు ఆదిపత్యాన్ని, దునుమాడిన అగ్నికణం జార్జిరెడ్డి అని కొనియడారు."జీనా హైతో మరణ సీఖో-కదం కదం ఫర్ లడనా సీఖో నినాదం" తో విద్యార్థుల సమస్యల పై సమర శంఖం పూరించాడని అన్నారు.

జార్జిరెడ్డిని అంతమొందించిన మతోన్మాదం నేడు రాజ్యమేలుతూ

విద్యార్థుల, ప్రజల కనీస హక్కులను కాలరాస్తుందని, విద్య కాషాయీకరణ చేయడానికి, తద్వారా మేధావులను తయారు చేసే విద్యావిధానంలో మూఢత్వాన్ని నింపడానికి కుట్రపన్నుతున్నారని,అందులో భాగంగానే NEP-2020 ని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఈ కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతున్నారని, సామాన్యులు జీవించలేని స్థితి కి నెట్టబడ్డారని పేర్కొన్నారు.

విద్యార్థులను మూడత్వంలో ముంచి విద్య కాశాయికరిస్తే తప్పేంటని నగ్నంగా మాట్లాడన్నారని, భూత విద్య కోర్స్ ప్రవేశ పెట్టుతున్నారని అన్నారు.నేడు జార్జిరెడ్డి ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే, ప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమేనని అన్నారు. విద్యార్థి, యువతరం జార్జిస్పూర్తితో కదం తొక్కాలని పిలుపునిచ్చారు,. జార్జి మరణించిన జార్జి ఆలోచనలు రాష్ట్ర,దేశ విద్యార్థి లోకానికి వెలుగు దారి చూపుతూ ఉంటాయని, విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో జార్జిరెడ్డి సదా బతికే ఉన్నాడని, జార్జి వారసత్వం తో మనమంతా ప్రగతిశీల భావాలతో పోరాడాలని వారు పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభలను దేశ వ్యాప్తంగా జయప్రదం చెయ్యాలని కోరారు. ఏప్రిల్ 10 నుండి 14 వరకు జరిగే జార్జిరెడ్డి సభలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో PDSU నాయకులు ఎమ్.సిద్దు.బి.సతీష్,డి.వాసు,ఆర్.కిట్టు,ఏ.శ్రీకాంత్,ఎస్.రాజు,పరమేశ్వర్,ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

కోడి కత్తి కేసులో కీలక పరిణామం-మినహాయింపు కోరిన జగన్ ...

ఇవాళ జరిగే విచారణకు సీఎం జగన్ హాజరయ్యేలా చూడాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు గతంలో ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు ఇచ్చింది.

అయితే చివరి నిమిషంలో ఈ కేసు విచారణకు తాను హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టును కోరారు.

ఈ మేరకు ఆయన న్యాయవాదితో కోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో కోర్టు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. కోడి కత్తి కేసులో ఇప్పటివరకూ సీఎం జగన్ వాంగ్మూలం నమోదు చేయకపోవడంపై ఎన్ఐఏ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.