అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటించారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురి నుంచి వినపత్రాలు స్వీకరించిన మంత్రి కేటీఆర్, యువకులతో కలిసి సెల్ఫీలు దిగారు.
లక్ష్మీపూర్‌లో పల్లె దవాఖానను ప్రారంభించిన తర్వాత పాపయ్యపల్లె చేరుకుంటారు. రూ.26 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. గోపాల్‌రావుపల్లె, మండెపల్లిలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తంగళ్లపల్లిలోని పీహెచ్‌సీలో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు గండిలచ్చపేటకు చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తర్వాత కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు.
దళితబంధు పథకం కింద మంజూరైన పౌల్ట్రీఫాంను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుంటారు. మండలంలోని దుమాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత చిట్టివాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనం, రూ.10 లక్షలతో మహిళా సంఘ భవనం, చిట్టివాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభిస్తారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు. అక్కడి నుంచి 3.30 గంటలకు బుగ్గరాజేశ్వర తండా చేరుకొని రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.9.60లతో నిర్మించిన గిరిజన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాచర్ల గుండారంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 5 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
Apr 10 2023, 21:11