నేటి నుండి 14 వరకు ఉస్మానియా అరుణతార,ఇండియన్ చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభలను జరపండి
•కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభల పోస్టర్స్ ఆవిష్కరణ.. PDSU
విప్లవ విద్యార్థి నాయకుడు,ఊస్మానియా అరుణతార,ఇండియన్ చేగువేరా,యువ మేధావి,ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ PDSU వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభల పోస్టర్ ను నల్లగొండ పట్టణంలోని గాందీ నగర్ ఎస్.సీ హాస్టల్ లో PDSU నేతలు ఆవిష్కరణ చేశారు..
ఈ సందర్భంగా,PDSU నల్లగొండ జిల్లా కార్యదర్శి పోలె పవన్,జిల్లా నాయకుడు ఇందూరు మధులు పాల్గొని మాట్లాడుతూ..,ఉస్మానియా అరుణతార,హైదరాబాద్ చేగువేరా జార్జిరెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 10 నుండి 14 వరకు దేశవ్యాప్తంగా జరిగే జార్జి వర్ధంతి సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 70 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పేరుకుపోయిన మతఛాందస వాదాన్ని, దుర్మార్గపు ఆదిపత్యాన్ని, దునుమాడిన అగ్నికణం జార్జిరెడ్డి అని కొనియడారు."జీనా హైతో మరణ సీఖో-కదం కదం ఫర్ లడనా సీఖో నినాదం" తో విద్యార్థుల సమస్యల పై సమర శంఖం పూరించాడని అన్నారు.
జార్జిరెడ్డిని అంతమొందించిన మతోన్మాదం నేడు రాజ్యమేలుతూ
విద్యార్థుల, ప్రజల కనీస హక్కులను కాలరాస్తుందని, విద్య కాషాయీకరణ చేయడానికి, తద్వారా మేధావులను తయారు చేసే విద్యావిధానంలో మూఢత్వాన్ని నింపడానికి కుట్రపన్నుతున్నారని,అందులో భాగంగానే NEP-2020 ని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఈ కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతున్నారని, సామాన్యులు జీవించలేని స్థితి కి నెట్టబడ్డారని పేర్కొన్నారు.
విద్యార్థులను మూడత్వంలో ముంచి విద్య కాశాయికరిస్తే తప్పేంటని నగ్నంగా మాట్లాడన్నారని, భూత విద్య కోర్స్ ప్రవేశ పెట్టుతున్నారని అన్నారు.నేడు జార్జిరెడ్డి ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే, ప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమేనని అన్నారు. విద్యార్థి, యువతరం జార్జిస్పూర్తితో కదం తొక్కాలని పిలుపునిచ్చారు,. జార్జి మరణించిన జార్జి ఆలోచనలు రాష్ట్ర,దేశ విద్యార్థి లోకానికి వెలుగు దారి చూపుతూ ఉంటాయని, విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో జార్జిరెడ్డి సదా బతికే ఉన్నాడని, జార్జి వారసత్వం తో మనమంతా ప్రగతిశీల భావాలతో పోరాడాలని వారు పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభలను దేశ వ్యాప్తంగా జయప్రదం చెయ్యాలని కోరారు. ఏప్రిల్ 10 నుండి 14 వరకు జరిగే జార్జిరెడ్డి సభలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో PDSU నాయకులు ఎమ్.సిద్దు.బి.సతీష్,డి.వాసు,ఆర్.కిట్టు,ఏ.శ్రీకాంత్,ఎస్.రాజు,పరమేశ్వర్,ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
Apr 10 2023, 13:10