ఏపీ::మహా ఘనుడు... నిత్యపెళ్లి కొడుకు బట్టబయలు... మ్యాట్రిమోనియల్ సైట్స్ లో 12 మంది మహిళలను మోసం చేసిన విధానం ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మహా ఘనుడు... నిత్యపెళ్లి కొడుకు బట్టబయలు...
మ్యాట్రిమోనియల్ సైట్స్ లో 12 మంది మహిళలను మోసం చేసిన విధానం ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.....
రోజు రోజుకి నిత్యపెళ్ళికొడుకుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి... మొన్న నలుగురు ని ఒకరికి ఒకరు తెలియకుండా పెళ్లి చేసుకొని మొహం చాటేసి వ్యవహారం నడిపిస్తున్న NRI నిత్యపెళ్ళికొడుకు విషయం అందరికి తెలిసిందే. మీడియా లో ఎన్ని కధనాలు వచ్చినా పోలీసులు కు అమ్యామ్యాలు సమర్పించి NRI పారిపోయిన వ్యక్తి సంఘటన పక్కన పెడితే...
జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ను వినియోగించేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఆ సైట్స్ లో రెండో వివాహం కోసం దరఖాస్తు చేసున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఐడీ కార్టులు సృష్టించి ఓ వ్యక్తి చేసిన మోసం కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన డక్కుమళ్ల సుదర్శన రావు అలియస్ పవన్ కుమార్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. 2012లోనే అతను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అయితే అతనికి మొదటి నుండి లైంగిక కోరికలు ఎక్కువ. కోర్కెలు తీర్చుకోవటం కోసం మహిళల కోసం వెదకటం మొదలు పెట్టాడు. అయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకోవడం సులభమని గ్రహించి అప్పటి నుండి షాదీ.కామ్ లో రిజిష్టర్ చేయించుకున్నాడు. ఆ సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకొన్న ద్వితీయ వివాహం మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన మహిళతో అదే విధంగా పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
అప్పు కావాలంటూ డబ్బులు కూడా తీసుకున్నాడు. లైగింక కోరికలు తీర్చమని వేధించాడు. అయితే అనుమానం వచ్చిన ఆ మహిళ అతడ్ని నిలదీసింది. ఎక్కువగా మహిళలతో మాట్లాడుతుండటాన్ని కూడా గమనించింది. అయితే ఆమె వాట్సప్ ను వాట్సప్ వెబ్ ద్వారా స్కాన్ చేసుకొని వారిద్దరూ ఏకంతంగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలను, చాట్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో సదరు మహిళ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. దీంతో మొత్తం బండారం బయటపడింది. ఆర్మిలో మేజర్ స్తాయిలో ఉన్నట్లు నకిలి ఐడెంటీటీ కార్డులు స్రష్టించి మహిళలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అనేక మంది మహిళలతోనూ టచ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆర్మి మేజర్ స్థాయిలో ఉన్నాడని నమ్మించడానికి ఆర్మీ డిపెండెంట్ కార్డులను మహిళలకు తానే జారీ చేసేవాడు. అవన్నీ నకిలేవని పోలీసులు గుర్తించారు. దాదాపు 12 మంది అమాయక మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవడం వారిని లైంగికంగా వాడుకోవడం లాంటి పనులు చేస్తున్నాడని దిశ సిఐ నరేష్ కుమార్ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నకిలీ ఐడెంటిటి కార్డులు, డిపెండెంట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
Apr 07 2023, 20:16