కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం.. సొంతంగా కొనుగోలు చేసుకోవాలని రాష్ట్రాలకు సలహా..
Covid Vaccine: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. కరోనా వ్యాక్సిన్‌లపై కేంద్రం చేతులెత్తేసింది..
వ్యాక్సిన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకోవాలని సూచించింది. ఓ వైపు 180 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన వసుదైక కుటుంబం అంటున్నారు.. కానీ వ్యాక్సిన్‌లను రాష్ట్రాలనే కొనుక్కోమంటున్నారని.. ఇదెక్కడి న్యాయం అని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌మాండవీయ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో నిల్వలు లేవని.. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కావాల్సిన వ్యాక్సిన్లు రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని.. మార్కెట్‌లో పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని సమాధానమిచ్చారు.
Apr 07 2023, 18:06