కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కోవిడ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..
కరోనా కేసులు పెరుగుతున్నాయని, కాబట్టి రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి, పరీక్షలను పెంచడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. పౌరుల్లో అనవసర భయాందోళనలు కలిగించవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు..
ఈ సమావేశంలో కోవిడ్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్ర మంత్రి చర్చించారు. సూచించిన కోవిడ్ నిబంధనలపై పౌరులకు అవగాహన కల్పించాలని, వాటిని పాటించాలని కోరారు. అన్ని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి ఏప్రిల్ 10, 11వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు..
Apr 07 2023, 18:04