పదవ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ ఘటనపై విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలి....
•పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి పోలే పవన్
పదవ తరగతి పరీక్ష పేపర్లు మూడో తారీకు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మొదటి రోజే లీక్ కావడం,కేసీఆర్ అసమర్ధ ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమని పీ.డి.ఎస్.యూ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్ తెలిపారు.
స్థానిక బి.సి హాస్టల్లో పేపర్ లీకేజీ ఘటనపై దోషులను శిక్షించాలని,దీనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం రాజీనామా చేయాలని పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలే పవన్ పాల్గొని మాట్లాడుతూ ఎగ్జామ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే ప్రశ్న పత్రం లీకు కావడం అంటే అత్యంత సోచనీయమని అన్నారు. ఇప్పటికే చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్ రాస్తే పేపర్ల లీకేజీ తో అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, మరొకవైపు చదువుకుందాం అంటే పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని, " చదువుకొన్నేడిదే.. చదువు లాగా" నేడు తెలంగాణ రాష్ట్రంలో తయారయిందని మండిపడ్డారు. అందులో భాగంగానే పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూస్తున్నాయని తెలిపారు .నిన్న తెలుగు పేపర్ లీకేజీ, నేడు హిందీ పేపర్ లీకేజీలు జరగడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీరని అన్యాయమే అని మండిపడ్డారు .ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 4 ,ఎంసెట్, ఇంకా అనేక రకాల పరీక్ష పేపర్ల నుండి నేడు టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ వరకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రధాన దోషులను శిక్షించకుండా కాలయాపన చేసిందని, అందులో భాగంగానే పేపర్ లీకేజీ ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని దుయ్యబట్టారు.
కేజీ నుండి పీజీ వరకు నా స్వప్నం,నా కళా అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ పదవి నుండి తప్పుకోవాలని, ఎస్.ఎస్.సి బోర్డు నిర్లక్ష్యానికి నిలువుటద్దం పేపర్ లీకేజీ ఘటనని ఎద్దేవా చేశారు. వెంటనే పేపర్ లీకేజీ కు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, పేద, బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో "ఉన్నత చదువులు ఉన్నోడికి అన్నట్లుగా" ప్రభుత్వ తీరు ఉన్నదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం బ్రష్టు పట్టించిందని అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు.పేపర్ లీకేజీ ఘటన పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పిడిఎస్ యూ నాయకులు ఇందూరు మధు, జి వెంకటేష్ ,ఆర్ ప్రవీణ్, లెనిన్, రాజు, మాధవ్, సురేష్ ,నవీన్ ,ప్రభాకర్ తదిత తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
Apr 06 2023, 19:55